IPS మొగుడు డాన్ పెళ్ళాం,
రాజ ఒక IPS ఆఫీసర్. అరుంధతి ఒక డాన్.
పిల్లి, ఎలుక లాంటి వీళ్ళ మధ్యలో ప్రేమ ఎలా ఏర్పడుతుంది?
──•~❉©Farruarts©❉~•──
నా పేరు అరుంధతి. నా వయసు 25 ఏళ్ళు.
గన్ షూటింగ్, బాణాలు వేయడం, కత్తి తిప్పడం లాంటి టెక్నీక్స్ తో పాటుగా కుంఫు, కరాటే లాంటి మార్టియల్ ఆర్ట్స్ ఎన్నింట్లోనో మొదటి స్థానంలో ఉన్నాను.
చిన్నప్పుడు టైం పాస్ కోసం చాలా సార్లు నేషనల్, ఇంటర్నేషనల్ పోటిల్లో కూడా పాల్గొని ఎప్పటిలాగే మొదటి స్థానంలో గెలిచాను.
వంద మందిని సైతం ఒంటి చేత్తో అంతం చేసే ఆయుధంలా నన్ను మా నాన్న తయారు చేసారు.
మా నాన్న ఒక డాన్.
నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది.
నాకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మా నాన్న ట్రైనింగ్ మొదలుపెట్టాడు.
చిన్న పిల్లలు బొమ్మ తుపాకీతో ఆడుకునే వయసులో నేను నిజమైన గున్నులతో ఆడుకునే దాన్ని.
నేను పసి బిడ్డగా ఉన్నప్పుడే ఎంతో మంది శత్రువులు రహస్యంగా నేను తినే ఆహారాన్ని విషంతో కలిపి ఇచ్చేవారు.
నన్ను చాలా సర్లే చంపడానికి పన్నగాలు పన్నారు. పసి పిల్లను కదా నాకు తెలీదు. అందుకే.. వాటిని తిని చావుకి దెగ్గరయ్యే దాన్ని.
ఆతర్వాత, నాకు విషం వల్ల ఏమీ కాకూడదని మా నాన్న నా శరీరం ఎంత భయంకరమైన విషాన్నయినా తట్టుకునేందుకు నన్నే ఒక విషపూరితమయిన పాములా తయారు చేసారు.
నా పళ్ళు, గోర్లు గుచ్చుకున్నా ఆ వ్యక్తి క్షణంలో కుప్ప కూలిపోతాడు.
నా రక్తం మొత్తం విషపురితమే. నా ఒక్క చుక్క రక్తంతో ఏనుగు సైతం కుప్ప కూలిపోతుంది.
నాలాంటి వాళ్లకు కుటుంబం అంటే లెక్క ఉండదు.
ప్రతీ బంధువు, స్నేహితుడు అవకాశం దొరికితే నన్ను చంపాలని ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నుతూనే ఉంటారు.
నేను బ్రతకాలంటే వాళ్ళకంటే జిత్తులమారిగా మారాలి. ఊసరవెల్లిలా రంగులు మార్చగలగాలి. నేను అలాగే మారాను.
నాన్న: అరు! నేను అందరి దృష్టిలో చెడ్డవాడినే కావొచ్చు! నీకు మాత్రం నాన్నని! ఈ లోకంలో నిన్ను తప్పా నేను ఎవరినీ నమ్మలేను. నాలాగే నువ్వు కూడా నన్ను తప్పా ఎవరినీ నమ్మలేవు..
నేను పక్కన లేనప్పుడు నువ్వు కష్టబడకూడదనే నిన్ను ఆయుధంలా తయారు చేశాను. ఈ లోకం నిన్ను అంతం చేయక ముందే నువ్వే అంతం చేసేలా బలంగా తయారవ్వాలి అన్నదే నా కోరిక.
ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెప్తున్నానని అనుకోకు. మనకు ప్రతీ రోజూ ఆఖరి రోజే. నేను పని మీద వెళ్తున్నాను. ఎప్పుడు వస్తోనో తెలీదు.
నేను అసలు తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలీదు.
నువ్వు జాగర్త! ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు! నిన్ను నువ్వు నమ్ము!
నేను కనుక తిరిగి రాకుంటే...
మీ అమ్మలా నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే అతనితో కుటుంబాన్ని ఏర్పారుచుకో!...
జాగర్తగా ఉండు అరు...
అవే మా నాన్నగారి చివరి మాటలు.
మా నాన్న మాటల వెనకున్న అర్థం ఇప్పుడు అర్థమయింది..
మా లాంటి వాళ్లకు ప్రతీ రోజూ ఆఖరి రోజేనని..
ఆయన శవాన్ని చూసి కూడా నా కళ్ళ వెంట ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అంటే నేను మా నాన్నగారు చెప్పినట్టుగా బలంగా, ధైర్యంగా తయారయ్యాననే అర్ధం..
మా నాన్నగారు చనిపోయే ముందు నాకు డాన్ పదవిని ఇచ్చారు.
నాకు పదివి మీద ఆశ లేదు. కానీ నాకు తప్పదు. ఇది నా బాధ్యత.
***
డాన్ అసిటెంట్స్ అందరూ తల వంచి నమస్కరిస్తారు.
అరుంధతి డాన్ కుర్చీలో కాలి మీద కాలేసుకొని కూర్చుంటుంది.
అరుంధతి: ఇది నా కుర్చీ! మీలో ఎవరికైనా అభ్యంత్రం ఉందా?
వాళ్లలో కొందరు సడెన్గా గన్తో షూట్ చేయటం మొదలుపెట్టారు.
@@@
"చచ్చిందా?!"
"ఏమో...."
"చిన్న శబ్దం కూడా లేదేంటి?.."
అరుంధతి: కికికి...
ఎదురు తిరిగిన వాళ్ళు ఒక్కొక్కరుగా రాలిపోతారు.
"హిక్... *రక్తం కక్కుతూ* హా? రక్తం... అంటే..."
అరుంధతి: రోడ్డు మీద పుట్టి పెరిగిన వాళ్ళు! మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే, డాన్ కూతిరిని! నాకెన్ని తెలివితేటలు ఉండాలి?
రోడ్డు మీద అడుక్కుతింటున్న మిమ్మల్ని మా నాన్నగారు జాలిపడి దత్తకు తీసుకుంటే, ఇదా మీరంతా చేసేది?!
"హహహ.. అయితే? తల వంచి నీ కాళ్ళ కింద కుక్కలా పడుండమంటావా? హా? ఈ కుర్చీ నాది.. నాది.."
అరుంధతి: హ్మ్.. విషం బాగానే పని చేసింది.
మీరంతా నన్ను మోసం చేసినట్టే మీ పని వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసారు. హిహిహి.. నాకు ఎదురు తిరిగితే ఎవరికయినా ఇదే గతి!
"మీ నాన్నది మాములు చావనుకుంటున్నావా? హహహ! నీకు కూడా అదే చావు! నువ్వు కూడా నీ బాబు లాగే వాడి చేతుల్లోనే కుక్కలా చస్తావ్!..
అంటూ ప్రాణం కోలిపోతాడు.
అరుంధతి: హ్మ్... నాకు చావంటే భయం లేదు కన్నా. చావెలా ఉంటుందో చిన్నప్పటి నుంచి రుచి చూస్తూనే ఉన్నాను. నేనూ మరణ దేవతా స్నేహితులం. తను నన్ను పలకరిస్తే, నీలాంటి వాళ్ళను ఆమెకు బహుమతిగా ఇస్తూ ఉంటాను. హిహిహి...
@@@
ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద ఈ ఊరికి వచ్చాను.
అదేమిటంటే....
"మేడం! మీరు చంపాల్సింది వీడినే! వీడి వల్లే మీ నాన్నగారు చనిపోయారు."
అని చెబుతూ ఒకడి ఫోటో చూపిస్తాడు.
అరుంధతి: హ్మ్... మా నాన్నను ఎన్కౌంటర్ చేసింది వీడా?! ఎవరీడు?
"మేడం, వీడొక IPS ఆఫీసర్. వయసు 28. హయిట్ ఆరున్నార అడుగులు. బరువు 70 కేజీలు. కండలు తిరిగిన శరీరం. షూటింగులో ఎక్ష్పర్ట్.."
అరుంధతి: హ్మ్... కుర్రాడు బాగానే ఉన్నాడు.. విడినేనా నేను చంపాల్సింది?..