అరుంధతి: ఇంకేంటి? కిందకు బయలుదేరుదమా?
లహరి:.....
వాసు:....
అరుంధతి: ఏమైంది? ఏమైనా ప్రాబ్లెమా?
లహరి: అం...
ఆమె ఆలోచిస్తూ తల దించుకుంటుంది.
అరుంధతి బాబు వైపు చూస్తుంది.
వాసు: అక్కకి తాతయ్యంటే చాలా భయం. అందుకే తాతయ్య ఉన్నప్పుడు ఆయన దెగ్గరకు వెళ్ళదు.
అరుంధతి: ఏం బేబీ? ఎందుకురా? తాతయ్య అంటే ఎందుకు భయం?
లహరి: తాతయ్య చాలా బాడ్ పర్సన్. ఎప్పుడూ అందరినీ తిడుతూనే ఉంటాడు.
ఈరోజు కూడా సాంబయ్య అంకుల్ని తిట్టి తరిమెసారు.
ఐ హేట్ గ్రాంపా.
వాసు: ఐ హేట్ హిం టూ! ఎప్పుడూ మమ్మల్ని కూడా తిడుతూనే ఉంటారు.
మార్క్స్ తక్కువ వచ్చాయి. స్పోర్ట్స్ సరిగ్గా ఆడట్లేదు. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తేలేదు. ఫుడ్ పెట్టింది తినట్లేదు. స్నాక్స్ ఎక్కువ తినకూడదు. పని వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండకూడదు..
ఇలా ఎప్పుడూ ఏదొక విషయంలో తిడుతూనే ఉంటారు.
మాకు ఇష్టమైన పని ఒక్కటి కూడా చెయ్యనివ్వరు.
వి హేట్ గ్రాండ్పా సొ మచ్!
లహరి: మాకు అస్సలు ఇండిపెండెన్స్ ఇవ్వరు. అలా ఉండు! ఇలా ఉండు! అది చైకు! ఇది చైకు! అని ఎప్పుడూ ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. ఐ హేట్ హిం టూ..
అని చెబుతూ ఇద్దరూ కళ్ళలో నీళ్లు కారుస్తారు.
అరుంధతి: హ్మ్... అయినా మీ గ్రాంపా చెప్పిన వాటిలో తప్పేముంది?
వాసు: హా?
లహరి: హా? అంటే?
అరుంధతి: అంటే దానర్థం గ్రాంపా కరెక్ట్గా చెప్పారు అంటున్నాను.
లహరి: నువ్వు కూడా గ్రాంపాకే సపోర్ట్ చేస్తున్నావా?
అని అప్సెట్ అవుతుంది.
అరుంధతి: ఓ మై బ్యూటిఫుల్ బేబీ. ఒక్కసారి ఆలోచించు!
షుగర్ ఎక్కువ తింటే ఏమవుతుంది?
వాసు: పళ్ళు పుచ్చి పోతాయి. మా ఫ్రెండ్స్ లో చాలా మందికి పళ్ళు బ్లాక్ కలర్లో పుచ్చిపోయాయి.
డాక్టర్ అంకల్ వాళ్ళ పుచ్చి పోయిన పళ్ళు పీకితే చాలా నొప్పెట్టిందట! చాలా ఏడ్చరంట!
లహరి: అవును. నా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు.
అరుంధతి: మరి నాకొక విషయం చెప్పండి బేబీస్. మీ ఇద్దరిలో ఎవరికయినా పళ్ళు పుచ్చి పోయాయా?
లహరి: లేదు ఆంటీ.
వాసు: నాకు కూడా. నా పళ్ళు క్లీన్గా ఉంటాయి. 2 టైమ్స్ బ్రెష్ చేస్తా డైలీ. చూడు.
అని పళ్ళు చూపిస్తాడు.
లహరి: నా పళ్ళు వీడికంటే క్లీన్ ఉంటాయి. ఈ...
అని పళ్ళు చూపిస్తుంది.
అరుంధతి: ఎస్. మీ పళ్ళు చాలా హెల్దీగా ఉన్నాయి.
సొ! ఇప్పుడు చెప్పండి బేబీస్.
మీరు కూడా స్వీట్స్ మీ ఫ్రెండ్స్ లా స్వీట్స్ తింటే మీ పళ్ళు కూడా పుచ్చి పోయేవి కదా?
లహరి: ఆవునేమో.. కానీ...
అరుంధతి: మీ గ్రాంపా మీ ఇద్దరి పల్లకి ఏమీ కాకూడదని స్వీట్స్ ఎక్కువ తినొద్దు అన్నారు. బట్ అస్సలు తినొద్దని చెప్పలేదుగా?
వాసు: అంటే.. రోజూ ఏదయినా మంచి పని చేస్తే గిఫ్తగా చిన్న చోక్లేట్ ఇస్తారనుకో..
అరుంధతి: చూడండి బేబీస్. గ్రాంపా పైకి స్ట్రిక్టుగా ఉంటారు. బట్ చెడ్డవారు మాత్రం కారు.
నాకు మీ మమ్మీ చెప్పింది. గ్రాంపా ఐస్ గుడ్ పెర్సన్.
మీ ఇద్దరూ బాగా చదువుకుంటే మీ డాడీ లాగా మంచి జాబ్ చేయొచ్చు.
మీ బాబాయ్ లాగా మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వొచ్చు. మీ గ్రంపాలాగా బెస్ట్ జడ్జి అవ్వొచ్చు తెలుసా?
మీకు వాళ్ళలా బెస్ట్ పర్సన్ అవ్వాలని లేదా?
లహరి: ఉంది... కానీ...
వాసు: మేము అంత బెస్ట్ కాము..
అరుంధతి: నో బ్యూటిఫుల్ బేబీస్. యూ కన్ డూ ఇట్. మీ గ్రాంపని చూసి అన్నిటిని మెల్లమెల్లగా నేర్చుకోండి.
గ్రాంపనే కదా మీ డాడీని చదివించింది?
గ్రాంపనే కదా మీ బాబాయిని చదివించి పోలీస్ ఆఫీసర్ చేసింది.
ఆయన చెప్పేవి ఫాలో చేస్తూ ఉండండి. ఏదోకరోజు మీరిద్దరూ కూడా గ్రాంపాలాగే ది బెస్ట్ గా తయారవ్వుతారు.
సొ! డోంట్ హేట్ యూర్ గ్రాంపా! లవ్ హిం! అన్దేర్స్తాండ్ హిం! ఓకే?
ఇద్దరూ సరే అని అమాయకంగా తల ఊపుతారు.
అరుంధతి: మరి కిందకు వెళ్దామా?
ఇద్దరూ సరే అని తలో వైపు చెయ్యి పట్టుకొని మెట్లు దిగుతూ వెళ్తారు.
....
డోర్ చాటున రెడ్డయ్య నిలబడి అంతా వింటాడు.
రెడ్డయ్య: హ్మ్....