Chapter 14 - 14

అరుంధతి: నేను నాన్వెజ్ వండుతాను ఆంటీ.

శ్రీదేవమ్మ: నీవల్ల అవుతుందా అమ్మ? టైం 11 అవుతోంది. ఎక్సక్ట్లీ 12 కి వంటలు టేబుల్ మీద ఉంచక పోతే పెద్దాయన అరగంట క్లాస్ పీకుతాడు.

అరుంధతి: ఫుఫుఫు.. పర్లేదాంటి. నాన్వెజ్ వంటలు నాకు వదిలేయండి. మీరు మిగతా పనులు చూడండి.

అని చిన్నగా నవ్వుతూ పని మొదలు పెడుతుంది.

శుభ్రంగా చేతులు కడుక్కొని, చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, శుభ్రంగా కడిగి టేబుల్ పక్కన ఉంచుకుంటుంది.

చికెన్ లెగ్ పీసులు విడిగా తీసుకోని శుభ్రంగా సాల్ట్ వేసి, కడిగి స్టవ్ మీద పెట్టి కుంచం నీళ్లు, పసుపు వేసి ఉడకపెడుతుంది.

మసాలాలు, కుంచం ఉప్పుని ఒక బౌల్ లో వేసుకొని కుంచం నీళ్లు కలిపి క్రీం లా చేసుకోని టేబుల్ పక్కన పెట్టుకుంటుంది.

ఒక్కో చికెన్ లెగ్ పీస్ తీసుకోని లైటుగా మూడు గీతలుగా కోసి టేబుల్ పక్కన పెడుతుంది.

అన్నిటిని కోసిన తరువాత, పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ తీస్కొని వాటికి పూసి బాగా మిక్స్ చేసి ఆ బౌల్ పైన ప్లాస్టిక్ రాప్ చేసి మారినేట్ అవ్వడానికి టేబుల్ పక్కన పెడుతుంది.

సరిపడా ఉల్లిపాయలు, టమాటాలు తీసుకోని తరిగి టేబుల్ పక్కన పెట్టుకుంటుంది.

ఫ్రెష్ అల్లం, వెల్లుల్లి తీసుకోని శుభ్రంగా కడిగి, కోసి మెత్తగా దంచి పేస్టులా చేస్తుంది.

సరిపడా ఉల్లిపాయలు, టమాటాలు మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకుంటుంది.

ఒక బాండలి తీస్కొని కొంచం ఆయిల్ వేసి మసాలా సామాన్లు ఒక్కోటి వేసి వేగాక ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఎర్రగా అయ్యే వరకూ వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేగనిస్తుంది.

అందులో టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుతుంది.

కుంచెం వేగాక అందులో మసాలాలు వేసి ఎర్రగా పేస్ట్ లాగా బాగా వేగనిస్తుంది.

అందులో ఉడికిన చికెన్ ముక్కలు, నీళ్లు పోసి

కలిపి మూత పెట్టేస్తుంది. స్టవ్ హీట్ మీడియం కి పెడుతుంది.

***

(డబ్బున్నోళ్ల వంట గది ఇది. 3-4+ స్టవ్స్ ఉంటాయి.)

ఇంకో స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోస్తుంది. ఆయిల్ వేడి అవ్వనిస్తుంది.

మారినట్ అయిన చికెన్ లెగ్ పీసులు తీసుకోని వాటిని ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసి లైట్ బ్రౌన్ వచ్చే వరకూ ఫ్రై చేసి పక్కన పెడుతుంది.

అవి చల్లారాక ఇంకోసారి లో హీట్లో ఫ్రై చేస్తుంది.

ప్లేట్లో టిష్యూ పేపర్స్ పెట్టి వాటిని లైన్ గా పెడుతుంది.

ఆయిల్ టిష్యూస్ లోకి ఇంకిన తరువాత ఇంకో ప్లేట్ లోకి మార్చి ఆనియన్, లెమన్ కోసి డెకొరేట్ చేస్తుంది.

అప్పటికే చికెన్ కూర రెడీ అయిపోయి ఉంటుంది.

స్టవ్లు ఆఫ్ చేసి కూరని మరో బౌల్లో నింపి కిచెన్ నుంచి టేబుల్ మీద సర్దుతుంది.

***

శ్రీదేవమ్మ: అప్పుడే అయిపోయిందా?

దేవకి: వాసన కూడా చాలా బాగుందిరా!

శ్రీదేవమ్మ: వంటలు అవ్వగానే నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాము.

కానీ మాకంటే నువ్వే ముందు వంటలు పూర్తి చేసేసావు.

అని అశ్చర్యంగా కూరలను చూస్తుంది.

అరుంధతి: ఒకసారి టేస్ట్ చేసి చూస్తారా? ఏమైనా తక్కువ ఎక్కువలు ఉన్నాయేమో.

ఇద్దరూ సరే అని చెప్పి కుంచం కూర, కుంచం చికెన్ టేస్ట్ చేస్తారు.

ఇద్దరికీ నోటి వెంట మాట మాటలు రావు.

అరుంధతి: ఏమైంది?..