ఆమెను ఒక ఐల్యాండ్ లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు.
ఆమె ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా అతను వెళిపోతుంటే చూస్తూ నిలబడి ఉంటుంది.
దూరంలో పొదల నుంచి ఏదో శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది.
అదొక పెద్ద పులి. కానీ.. ఆమె కళ్ళకు మాత్రం..
అరుంధతి: పిల్లి పిల్ల?
పులి: *Roar*
అంటూ ఒక్కసారిగా ఆమె మీదకు దూకి పంజాలతో దాడి చేస్తుంది.
అరుంధతి: అ-ఓ....
పులి ఆమె మీద పడి దొర్లుతుంది. అరుంధతి కింద సైలెంటుగా పనుకుంటుంది.
పులి ఆమె మీద దొర్లుతూ నాలికతో నాకుతూ ఉంటుంది.
అరుంధతి: హా.... నాన్న... ఈ చీకూని నాకు అంటగట్టేసి వెల్లావా?...
ఆమె మొఖంలో చిరాకు కనిపిస్తుంది.
చీకూ ఒక పెంపుడు పులి. ఆమెకు వాళ్ళ నాన్న బర్త్డే గిఫ్ట్ కింద దీన్ని ఇచ్చుంటాడు.
చీకుకి ఆవేశం, కోపం ఎక్కువ. ఈలోకంలో ఎవరి మాటా వినదు.
కానీ ఇద్దరి మాటకు మాత్రం కట్టుబడుతుంది.
రాకీ భాయ్, అరుంధతి లకు మాత్రమే కట్టుబడి ఉంటుంది.
లోకం దృష్టిలో చీకు బెంగల్ టైగర్ కావొచ్చు. ఈ అబ్బా కూతుర్ల ముందు ఇది పిల్లి పిల్ల మాత్రమే..
అరుంధతి: చీకు... నువ్వు చాలా బరువుగా ఉన్నావ్..
పైకి లేయ్..
అని అనగానే ఆమె పై నుంచి లేచి పక్కన కూర్చుంటుంది.
ఆమె పైకి లేచి పులి మీద ఎక్కి కూర్చుంటుంది.
అరుంధతి: పదా! అడవిలోకి వెళ్దాం! ఇక్కడ బోర్ కొడుతోంది!
అని చెప్పగానే *ROAR* అని గట్టిగా గర్జిస్తుంది.
@@@@@
అడవి లోపలకి వెళ్తారు. ఆమె అడవిలో చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కనిపిస్తుంది.
అరుంధతి: చీకు! ఆగు!
పులి ఆగుతుంది. ఆమె కిందకు దిగి చెట్టు దెగ్గరకు వెలుతుంది.
ఆ చెట్టు వేర్ల కింద పెద్ద గుంట ఉంటుంది. ఆమెకు అనుమానం వచ్చి అందులోకి తొంగి చుతుంది.
లోపల చీకటిగా ఉంటుంది. ఏవో వస్తువులు పాక్ చేసి దాచి ఉన్నట్టుగా అనిపించి ఒక కట్టెను తీసుకోని అందులోకి గుచ్చుతుంది.
*TAK* *TAK* *TAK*
(చెక్క పెట్టి శబ్దం)
అరుంధతి: హ్మ్.. నేను అనుమానించినట్టే గుంట లోపల ఏదో ఉంది.