Chapter 23 - 23

ఆమె గుర్రపు స్వారీ చేస్తున్నట్టుగా, సొర చేప వీపు మీదకు ఎక్కి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

దూరంలో చీకు (బెంగాల్ టైగర్) ఈదుతూ, నోట్లో ఒక చిన్న చేప పట్టుకొని రాయి అంచున ఎక్కి కూర్చొని తింటూ ఉంటుంది.

చీకు (బెంగాల్ టైగర్): పాపం.. జాలేస్తోంది.. వాడ్ని చూస్తుంటే గతంలో నన్ను నేను చూసుకున్నట్టే ఉంది.. చూ చూ చూ...

అని ఆలోచిస్తూ సొర చేప మీద జాలి పడుతుంది.

@@@

సొర చేప మదం అణిచి దాన్ని బానిస చేసుకుంటుంది.

అరుంధతి: హు!... హూ....!!

ఇంకా వేగం పెంచు!!! హీ....యా!!!!

ఆమె సొర చేప మీద నిలబడి ఉంటుంది. సొర చేప నిరుత్సాహంతో, జీవితం మీద ఆశలు వదిలేసుకొని ఆమె చెప్పినట్టుగా వేగంగా ఈదుతూ ఉంటుంది.

సొర చేప: మమ్మే... నన్ను ఈ రాక్షసి నుంచి ఎవడైనా కాపాడండే..... బా...

అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఈదుతూ ఉంటుంది.

చీకు (బెంగాల్ టైగర్) దూరంలో బండ మీద కూర్చొని శాడిస్తులా నవ్వుతూ వెక్కిరిస్తూ ఉంటుంది.

సొర చేప: ఒసేయ్! పిల్లి!! నిన్ను ఏసేస్తా!!!

చీకు (బెంగాల్ టైగర్): ఏడ్చావ్లే~ నేను పిల్లి అయితే నువ్వెంటి? చేప? గుట్టుక్కున మింగేస్తా ఎక్కువ చేశావంటే! మూస్కొని ఈదు!

సొర చేప: ఈదితే నన్ను వదిలేస్తుందా?

చీకు (బెంగాల్ టైగర్): నాలాగే అలవాటైయిపోద్ది! హిహిహిహి...

సొర చేప: శాడిస్ట్ సచ్చినోల్లారా!!!...

అరుంధతి: ఏయ్! ఫాస్టుగా ఈదు!!

సొర చేప: తున్న!! తున్నా!! ఈదుతున్నా!!...

@@@

అలా బాగా ఆడుకొని, అదే టైంలో కొన్ని చేపలు పట్టుకొని సముద్రం ఒడ్డున ఒక క్యాంప్ రెడీ చేసుకుంటుంది.

అరుంధతి: ఇక్కడ ఉప్పు నీళ్లు ఉన్నాయి తప్ప! మంచినీళ్లు లేవు!!

గొంతు దాహం వల్ల ఎండిపోయింది. ఇలాగే ఉప్పు చేపలు తింటూ ఉంటే నేను అనారోగ్యానికి గురై చనిపోవడం ఖాయం!

చీకటి అవబోతుంది. ఆమె దెగ్గరలో ఉన్న ఒక టెంకాయ చెట్టుని గమనిస్తుంది.

అది చాలా ఎత్తులో ఉండటం వల్ల ఎక్కడం గురించి ఆలోచన మానుకుంటుంది.

అరుంధతి: ఈ చెట్టు ఎక్కగలిగితే కావాల్సిన అన్ని టెంకాయలు దొరుకుతాయి.

బట్ చాలా ఎత్తు ఉందిది. కింద పడితే ఎముకలు ఇరగడం మాత్రం ఖాయమే!~