Chapter 25 - 25

అరుంధతి ఆ నీటిని తన నాన్న ఇచ్చిన బాటల్స్ లో ఆకులతో నింపి, మళ్ళీ ఆకులు, దాని పైన బరువుకి రాళ్లు ఉంచి వెళ్ళిపోతుంది.

తన చీకు దెగ్గరికి వెళ్లి వాడికి నీళ్లు తాగించి, తను కూడా కొన్ని నీళ్లు తాగుతుంది.

ఆమె చేతులు ఎర్రబడి ఉంటాయి.

చీకటి, నేల తడి వల్ల క్రిములు, కీటకాలు ఎక్కువ అవుతాయి.

అందుకే దోమలు ఆమె దెగ్గరకు కీటకాలు రాకుండా దూరం చేసేటందుకు ఎక్కువ పొగ వచ్చే చెట్టు మొదళ్ళను దారిలో ఏరుకొని వచ్చి, ఆమెకు చెట్టు తొర్రలో దొరికిన లైటర్ తో క్యాంప్ ఫైర్ వేసుకుంటుంది.

ఆమెకు అరటి చెట్టు నుంచి వచ్చే తప్పుడు పుదీనా మొక్కలు కనిపిస్తాయి.

వాటిని గుజ్జుగా చేసి ఒంటికి రాసుకుంటుంది. పుదీనా వాసనకి విషపురితమైన దోమలు, కీటకాలు దూరంగా ఉంటాయి.

కుంచం వరకూ ఆ పొగ వాసనకు దోమలు, పురుగులు లాంటివి దూరంగా ఉంటాయి.

ఆ నిప్పులో ఆమె నీటిలో పట్టిన చేపలను ఒక పుల్లకు గుచ్చి కాల్చుకొని తింటూ ఉంటుంది.

చీకు కూడా కొన్ని చేపలను తిని గమ్ముగా నిద్రపోతాడు.

ఆమె కూడా తిన్న తర్వాత చీకు మీద అనుకోని కళ్ళు మూసుకొని నిద్రపోతుంది.

@@@

అరుంధతి కళ్ళు తెరిచి చూస్తుంది. ఆమె కళ్ళ ఎదురుగా ఒక తెల్లటి సీలింగ్ ఉంటుంది.

నిద్ర లేచి తల పట్టుకొని కూర్చుంటుంది.

అరుంధతి: హా... మళ్ళీ అదే కల... ఫ్!....

అని గట్టిగా ఊపిరి వదిలి, బాత్రూంలోకి వెళ్లి బ్రష్ చేసి, ఫ్రెషప్ అవుతుంది.

దేవి ఆమెకు కొన్ని జతల బట్టలను ఇచ్చి ఉంటుంది.

వాటిలో మరొక జత తొడుక్కొని, దువ్వెనతో తల దువ్వుకొని ఫ్రీగా వదిలేస్తుంది.

తనను తను అద్దంలో సూటిగా చూసుకుంటుంది.

ఆమె కళ్ళు అచ్చం వాళ్ళ నాన్న కళ్ళు లాగే ఉంటాయి. వాటిని అద్దంలో చూస్తూ,

అరుంధతి: ఐ మిస్ యూ నాన్న..

అని చిన్న గొంతుతో అంటూ, కళ్ళు మూసుకొని మొఖం పక్కకు తిప్పేస్తుంది.

ఆమె గది నుంచి బయటకు వస్తుంది. టైం 4 అవుతుంటుంది.

బాల్కనీ దెగ్గరకు వెళ్లి నిలబడి చందమామను చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.

ఆమెకు చందమామలో చీకు కనిపిస్తుంది.

ఆమె వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉంటాయి. ఆమె తన వేలుతో వెంట్రుకలని వెనక్కి జరుపుకుంటుంది.

పక్కకు చూడగానే రాజ ఆమెను దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు.

ఆమె అతన్ని సైలెంటుగా చూసి అశ్చర్యబోతుంది.

అతను షర్ట్ లేకుండా ప్యాంటు మాత్రమే వేసుకొని ఉంటాడు.

అతను ఐపీయస్ ఆఫీసర్ కనుక చేసిన ఎక్సర్సైసులు, ట్రైనింగ్ వల్ల అతని శరీరం 6 పాక్ బాడీ కలిగి ఉంటుంది.

ఆమె అతని బాడీని చూస్తూ ఉండటం గమనించి ఆటిట్యూడ్ తో స్మైల్ చేస్తాడు.