Chapter 30 - 30

అమ్మాయిలతో పాటుగా, అబ్బాయిలు కూడా నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ ఉండుంటారు.

అతను నవ్వుతుంటే స్వయంగా మన్మధుడు వాళ్ళ గుండెలో బాణం గుచ్చినట్టుగా అనిపిస్తుంది.

కృష్ణ: కొత్త మిత్రులారా. చెప్పండి ఏ పని మీద వచ్చారు?

ఆమె గొంతు కూడా చాలా మృదువుగా ఉండటంతో వాళ్లకు మాటలు రావు.

సాంబ: నువ్వు ఎవరు? ఎప్పుడు చుట్టు పక్కల చూడలేదు?

కృష్ణ: నేను కొన్ని రోజుల క్రొతం ఈ ఊరికి వేకెషన్ కోసం వచ్చాను.

ఆరు: వస్తే వచ్చావ్! ఏంటి ఈ పనులు?

కృష్ణ: నేనేం చేశాను?

అని అమాయకంగా అడుగుతాడు.

ఆరు: ఏం చేసావా? నువ్వేం చేస్తున్నావో నీక్కూడా తెలీకుండానే చేస్తున్నావా? మేము నమ్మాలా? హా?

అని చిరాకుగా అంటాడు.

కృష్ణ: ఏమో బాబూ. నాకేం తెలీదు. మీరయినా చెప్పండి గోపికలూ. నేనేం తప్పు చేశాను?

అని వాళ్ళ వైపు అమాయకంగా చూస్తూ నిట్టూరుస్తాడు.

కృష్ణ నిట్టూర్చగానే వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

"కృష్ణ చేసిన తప్పేంటి అసలు? ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు?"

అని ఒకరి తరువాత ఒకరు వాళ్ళను నిలదీస్తారు.

కృష్ణ వాళ్ళ వెనుక దాక్కొని అమాయకంగా చూస్తుంటాడు.

ఆరు చిరాకుతో అటు ఇటూ చూస్తున్నప్పుడు, కృష్ణ వాళ్ళను చూసి స్మైల్ చేయడం గమనిస్తాడు. కృష్ణ అతనికి కన్ను కొడతాడు.

ఆరు చిరాకుతో నోరు తెరుచుకొని, కృష్ణనే చూస్తుంటాడు.

కృష్ణ కావాలనే అమాయకంగా అమ్మాయిల మధ్యలో ఉంటూ నటిస్తున్నాడని అర్ధం చేసుకుంటాడు.

ఆరు: మేమేం ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి రాలేదు.

మీ మధ్యలో కొత్త అబ్బాయి కనిపిస్తే పలకరిద్దామని వచ్చాం అంతే!

మగవాళ్ళు ఆడపిల్లతో మాట్లాడితే తప్పు గానీ, మగవాళ్ళు మగ వాళ్ళతో మాట్లాడకూడదా?

అని తెలివిగా మాట్లాడుతాడు. కృష్ణ వాడి తెలివిని చూసి చిరునవ్వు నవ్వుతాడు.

కృష్ణ: ఆ మాట కుంచం ముందుగానే చెప్పొచ్చుగా?

మీరంతా గుంపుగా మా మీదకి వచ్చేసరికి మేము చాలా భయపడిపోయాము తెలుసా?

ఏదో గొడవకి వచ్చినట్టు వచ్చారు మీరంతా.

అని అంటూ అమ్మాయిల వెనుక దాక్కుంటాడు.

ఆరు చిరాకుతో పళ్ళు కొరుకుతాడు.

ఆరు: మగాడివాయుండి పిరికోడిలా అమ్మాయిల వెనుక దాక్కుంటావ్ ఏంటి?

మేము నీతో మాట్లాడుదాం అని వచ్చాం. గొడవకి కాదు!! మగాడిలా ముందుకిరా!!

అని చిరాకుతో అరుస్తాడు.