Chapter 36 - 36

ఆరు: ఈ పిల్లను చూస్తే నాలో భయం పుట్టాలి గానీ.. ప్రేమా, గౌరవం, నమ్మకం పుడుతోందేంటి?... నాకేమైంది?..

అని అతను ఆలోచిస్తుంటాడు. చిరునవ్వుతో ఆమె చెయ్యి పట్టుకొని రాత్రంతా ఆడుకుంటూ గడిపేస్తారు.

అలా వారం రోజుల సమయంలోనే ఆ ఊరి పిల్లలతో విడిపోలేని బంధాన్ని ముడి వేసుకుంటుంది.

తను అక్కడి పిల్లలతో గడిపిన క్షణాలను, అనుభవాలను తన మనసులో భద్రంగా దాచుకుంటుంది.

పిల్లలందరూ కన్నీరు మున్నిరవ్వుతారు. ఎందుకంటే అరుంధతి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది.

రాత్రి వేళ సమయంలో తన నాన్న స్వయంగా వచ్చి తనను హెలికాప్టర్లో ఎక్కించుకుని బయలుదేరుతాడు.

అరుంధతి పెద్ద పులిని తనతో తీసుకుని వెళ్తుంది.

అరుంధతికి తన స్నేహితులకు గూడ్ బాయ్ చెప్పే అవకాశం కూడా దొరికి ఉండదు.

ఆమె చెప్పకుండా వెళ్ళిపోయిందని పిల్లలు అందరూ రోజుల పాటు ఏడుస్తారు.

ఆరు తన గుండెను రాయి చేసుకోని ఆమెను, తనతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ ఉండిపోతాడు.

అతను కళ్ళ నుంచి కారిన నీళ్లకు హద్దులు లేవు.

ప్రతీ రోజూ ఆకాశంలోకి చూస్తూ అరుంధతి తిరిగి వస్తుందని ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉండి ఉంటాడు.

ఆకాశంలోని చందమామలో ఆమె నవ్వుని చూస్తూ కాలాన్ని ఒంటరిగా గడిపేస్తాడు.

ఏదోకరోజు ఆమె తిరిగి వస్తుందని నమ్మకంతో, తను ఉండి వెళ్లిన ఇంటిని శుభ్రంగా ఉంచుతూ, ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ జ్ఞాపకాలను తిరగేస్తూ ఉంటాడు.

26 సంత్సరాల వయసులో ఉన్న ఆరు, రాత్రి వేళ తన ఇంటి ఎదురుగా నిలబడి ఆకాశంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు.

ఆరు: ఎలా ఉన్నావ్? నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, క్షేమంగా ఉంటే చాలు..

అని చెబుతూ చిరునవ్వు నవ్వుతాడు. అతని చేతిలో అరుంధతి చిన్నతనంలో తలకు ఆభరణంగా దారించిన నెమలి ఈక ఉంటుంది.

ఆరు: నా జీవితాంతం నీకోసం ఎదురుచూస్తూనే ఉంటాను. సంతోషంగా ఉండు కృష్ణ.

తన గొంతులో అమితమైన ప్రేమ, అభిమానాలతో పాటుగా భక్తి, నమ్మకం కూడా కనిపిస్తుంది.

మరో వైపు అదే సమయంలో మేడ మిద్ది మీదున్న అరుంధతి తనను గుర్తు చేసుకుంటూ చిన్నగా స్మైల్ చేస్తుంది.

రాజ ఆమె పెదాల మీద ఉన్న నవ్వుని గమనిస్తూ ఉంటాడు.

అరుంధతి: ప్రేమ, అభిమాననం కంటే అరుదైనది ఏమిటో తెలుసా?

అని అడుగుతూ రాజాను చూస్తుంది. అతను సమాధానం గురించి ఆలోచిస్తూ ఆమెను కల్లార్పకుండా చూస్తుంటాడు.

ఆమె చిన్నగా స్మైల్ చేస్తూ, గాలికి ఎగురుతున్న తన తల వెంట్రుకలను చెవి వెనక్కి జరుపుతూ,

అరుంధతి: నమ్మకంతో కూడిన భక్తి.. వీటిని పొందడం ఆ వ్యక్తి తన జీవితంలో చేసుకున్న అదృష్టం..

రాజ:... హ్మ్.. నిజమేనేమో..

అని చెప్పి, ఆలోచిస్తూ చందమామ వంక చూస్తాడు.

అతనికి అరుంధతి మొఖం కనపడగానే అశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తాడు.