Chapter 42 - 42

వాళ్లిద్దరూ వింత శబ్దాలు చేస్తూ ఉంటారు.

బయట ఉన్న వాళ్ళు ఆ బాత్రూం గది వైపు తేడాగా చూస్తూ గుటకలు మింగుతారు.

"మనం కూడా చేద్దామా?"

"పదా!... స్నానం చేద్దాం.."

"ఈ మధ్య తేడాగాళ్ళు ఎక్కువయ్యారు.."

"నీలాగే!..."

"ఇంకోసారి చెప్పూ? చేయకుంటే చూడు!"

"అయ్యబాబోయ్... నువ్వు తేడా మాత్రమే కాదు. మాడ!"

...

బయట వాళ్ళ మాటలు విని రాజ, కిరన్లు ఒకరినొకరు పై నుంచీ కిందకు చూసుకుంటారు.

కిరణ్: ఏం మావా అలా చూస్తున్నావ్? నాకు సిగ్గేస్తోంది!

అని చెబుతూ, ఒళ్ళు దాచుకొని వెనక్కు తిరిగి మెలికలు తిరుగుతూ ఆటపట్టిస్తాడు.

రాజా మొఖం చిరాగ్గా పెట్టి, ముడ్డి మీద ఒక్క తన్ను తన్నుతాడు.

దెబ్బకి గది బయటకు ఎగిరెల్లి నేల మీద పడతాడు.

బయట ఉన్న మిగతా వాళ్ళు అతను ఉన్నాడో పోయాడో చూద్దామని ఒక పుల్ల తీస్కొని వీపు మీద పొడుస్తారు.

కిరణ్: రే ఎవడ్రా అది.. ఆ....

అని నీరసంగా అంటాడు.

బతికే ఉన్నాడని తెలిసాక పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోడం కంటిన్యూ చేస్తారు.

కిరణ్ మెల్లగా లేచి పిర్రలు రుద్దుకుంటూ,

కిరణ్: నాటు సరసం! హిహిహిహి...

అని వెర్రోడిలా నవ్వుతాడు.

రాజ: బయటకి వచ్చానో వెనకాల కాదు! ఈసారి ముందు నుంచి తంతా!

కిరణ్: *చేతులడ్డు పెట్టుకొని* వామ్మో! వీడు తన్నినా తంతాడు.

నాకసలు పెళ్లి కాదు కదా కనీసం ఒక్క పిల్లతో కూడా లవ్లో పడలేదు.

నా వంశ వృక్షం జాగర్త చేసుకోవాలి. అసలే మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని.

అని గొనుక్కుంటూ చల్లగా పక్క బాత్రూం లోకి వెళ్లి సైలెంటుగా స్నానం చేస్తాడు.

@@@ @@@ @@@ @@@

ఇద్దరూ స్నానాలు చేసి డ్రెస్ వేసుకొని జిమ్ నుంచి బయటకు వస్తారు.

కిరణ్: *ఒళ్ళు విరుచుకుని ఆవులిస్తూ* హా.... ఆకలేస్తోంది మావా! హోటల్ కెళ్ళి ఏమైనా తిందాం పదా!

రాజ: నువ్వెళ్లు. నాకు వేరే పనుంది.