కిరణ్: *ఒళ్ళు విరుచుకుని ఆవులిస్తూ* హా.... ఆకలేస్తోంది మావా! హోటల్ కెళ్ళి ఏమైనా తిందాం పదా!
రాజ: నువ్వెళ్లు. నాకు వేరే పనుంది.
కిరణ్: నాకు తెలీకుండా నీకేం పనుంది మావా?
నిజం చెప్పూ! నన్ను ఒదిలించుకోడానికేగా అలా అంటున్నావ్?
నేను ఎక్కడికి పోను! కుక్క పిల్లలా నీ వెనకే వస్తాను.
రాజ: కుక్కవని ఒప్పుకున్నావ్.
కిరణ్: మావా...
రాజ: నోరుమూసుకుని కొంపకి పో!
కిరణ్: *మొండి చేస్తూ* హా... నేను పోను! నీతోనే వస్తాను!! లేకుంటే నాతో హోటల్కి తినడానికి రా!!
రాజ: *తల పట్టుకొని* నాకు హోటల్లో తినాలని లేదు. ఇంటికెళ్లి భోజనం చేస్తాను.
కిరణ్: ఓహో! అయితే నేనూ వస్తాను! పదా!
రాజ: నో!
కిరణ్: *కన్నింగ్ గా నవ్వుతూ* హిహిహి...
@@@ @@@ @@@
రాజాని విసిగించి వెంట తీసుకెళ్లమని బ్రతిమాలుతాడు.
రాజా ఒప్పుకోకుండా కిరణ్ నుంచి తప్పించుకొని ఇంటి దెగ్గరకు చేరుకుంటాడు.
అతనికంటే ముందే కిరణ్ ఇంటి ముందు నిలబడి నవ్వుతూ రాజాను పలకరిస్తాడు.
కిరణ్: ఏంటి మావా లేటు?
రాజ: చెప్పుకి పట్టిన బాబల్గంరా నువ్వు!
రాజ తల పట్టుకొని అతన్ని తోడు పెట్టుకొని ఇంట్లోకి వెళ్తాడు.
కిరణ్ మాట్లాడుతూ ఉండగా ఇంటి పరిసరాలను గమనిస్తాడు.
కిరణ్: మావా! ఇల్లేంట్రా ఇలా ఉంది?
రాజ: ఏమైంది? బానే ఉందిగా?
కిరణ్: బానే ఉందిగానా? చాలా బాగుందిరా!! సూపర్గా ఉంది! పనోళ్లను మార్చావా ఏంటి? పేరటంతా ఇంత అందంగా మార్చేశారు?
రాజ చుట్టూ గమనిస్తాడు.
రాజ: హ్మ్... నేను పొద్దున చూసినప్పుడు ఇలా లేదు.. ఎవరు చేసుంటారు?..
*మనసులో* బహుశా.. తనా?
అని ఆలోచిస్తూ తలుపు తెరవబోతారు.
అప్పుడే అరుంధతి ఇంటి తలుపుని తెరుస్తుంది.
అరుంధతి చిరునవ్వుతో వాళ్ళిద్దరినీ లోపలికి ఆహ్వానిస్తుంది.
రాజా ఇంట్లోకి వెళుతుంటాడు. పక్కకు చూస్తే కిరణ్ కనిపించడు. వెనక్కి తిరిగి చూడగా...
కిరణ్ కల్లార్పకుండా నోరు తెరుచుకొని అరుంధతిని చూస్తూ ఉండిపోతాడు.
అతని కళ్ళు ఆమె మీద లాక్ అయిపోతాయి.