రాజ డబ్బాను లాక్కొని డబ్బా మొత్తం ఒకేసారి ఖాళీ చేసేస్తాడు.
కిరణ్: *షాక్తో* శాడిస్ట్ ఎదవ!
దాహం వేస్తుంటే నీళ్లు పీక్కుని తాగితావా?!
ఏముంది దాంట్లో? మందా? నువ్వు నాకు తెలీకుండా మందు కూడా తాగడం మొదలెట్టావా?! హా?!
అని అడుగుతూ చేతిలో నుంచి డబ్బా పీక్కుని వాసన చూస్తాడు.
కిరణ్: వాసన ఏం లేదే.. మందు కాదా? ఎనర్జీ డ్రింకా? దీని కోసమా నా చేతుల్లో నుంచి సడెన్గా పీక్కుని తాగావ్?!
రాజ: హ్మ్.. నా వస్తువులు తాకొద్దని ఎన్ని సార్లు చెప్పాలి నీకు?
కిరణ్: ఏంది మావా?! నా వస్తువులు నీవి కావా? నీ వస్తువులు నావి కావా?
రాజ: కావు! నీవి నీవే! నావి నావే! ఈ ఇలాగా!
బాటల్ పీక్కుని, జింకు బయలుదేరుతాడు.
కిరణ్: హా!~ సరిపోయింది~
ఉండ్రా! నేనూ వస్తున్నా!..
అని చెబుతూ వెనకాలే పరుగులు తీస్తాడు.
ఇద్దరూ జింకి వెళ్లి వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు.
కిరణ్: మావా? మీ ఇంటికొచ్చిందే? ఆ పిల్ల పేరేంటి?
రాజ: నీకెందుకురా? మూస్కొని ఎక్సర్సైస్ చేయ్!
కిరణ్: *మొండి చేస్తూ* అహు అహు అహు మావా! చెప్పరా!!
రాజ: *విసుక్కుంటూ* ఆ పిల్ల పేరు అరుంధతి.
కిరణ్: అరుంధతా? హ్మ్.. పేరు పాతదైనా బాగుంది. పిల్ల బాగుంటదా?
రాజ అతని వంక సీరియస్గా చూస్తాడు.
కిరణ్: *ఉలిక్కి పడి* బోయ్... తూ! తూ!
అలా సూడకారా! గుండె పాంట్లోకి జారిపోయింది!
అయినా.. *సిగ్గు పడుతూ* నువ్వు అలా మొఖం పెట్టవంటే పిల్ల బాగానే ఉండుంటుంది.
అరుంధతి.. అరుంధతి..
*ఉత్సాహంతో* మా ఇద్దరి జంట ఎలా ఉంటుందంటావ్? హా?
రాజ: అరుంధతి పశుపతుల్లా ఉంటారు. కొట్టుకు సావండి!
అని విసుక్కుంటూ, పైకి లేచి టవల్తో ఒళ్ళు తుడుచుకుంటూ, బాత్రూమ్లో స్నానం చేస్తూ ఉంటాడు.
కిరణ్ అతన్నే వెంబడిస్తూ బాత్రూంలోకి కూడా వెళ్లిపోతాడు.
రాజ, కిరన్లు పక్క పక్క బాత్రూంల్లో స్నానం చేస్తూ ఉంటారు.
జిమ్లో స్నానం చేసే బాత్రూం లకు తలుపులు ఉండవు. కర్టెన్ మాత్రమే ఉంటుంది.
కిరణ్: మసక మసక చీకటిలో..
మల్లె తోట వెనకాల..
మాపటేలా తెలుసుకో..
నాకు అరుంధతి దొరుకుతుంది దొరుకుతుంది..
అని పాటలు పడుతూ స్నానం చేస్తూ ఉంటాడు.
రాజ వాడి పాటలు విని చిరాకు పడుతూ ఉంటారు.
రాజ: నీయబ్బా! గొంతు తగ్గించు!
కిరణ్ స్నానం ఆపి రాజా స్నానం చేస్తున్న బాత్రూం కర్తెన్ లోపల తల దూర్చి తొంగి చూస్తూ,
కిరణ్: ఏం మావా పాట బాలేదా? కొత్తగా పడతా చూడు!
*పాటకు తగినట్టుగా మెలికలు తిరుగుతూ డాన్స్ చేస్తూ*
వేయ్రా చేయ్ వేయ్రా ఎక్కడెక్కడో చేయ్ వేయ్రా
ఎక్కడెక్కడో చేయ్ వేయ్రా అక్కడేదో చేసేయ్రా!
అని పడుతూ ఉండగా, రాజాకు చిరాకొచ్చి,
రాజ: అరె ఛీ! అవతలపో!
అని షాంపూ డబ్బా తీసుకోని కొడతాడు.
తప్పించుకోడానికి ప్రయత్నించగా, రాజా వాడ్ని పట్టుకొని గదిలోకి లాగి వీపు పగల కొడతాడు.
*ఆహ్... హూ... మెల్లగా.. మెల్లగా.. ఔ...*
అని శబ్దాలు చేస్తూ ఉంటారు. బయట ఉన్న వాళ్ళు ఆ బాత్రూం గది వైపు తేడాగా చూస్తూ గుటకలు మింగుతారు.
"మనం కూడా చేద్దామా?"
"పదా!... స్నానం చేద్దాం.."
...