Chapter 39 - 39

అరుంధతి అతని వంక చూస్తూ నిలబడి ఉంటుంది.

రెడ్డయ్య: ఇది.. ఎక్కడ నేర్చుకున్నావు?..

అరుంధతి: అం.. అది...

నేను చిన్నప్పుడు మా బంధువుల ఊరికి వెళ్లేదాన్ని.

అప్పుడు వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను.

ఏమైనా లోపాలున్నాయా సార్?

రెడ్డయ్య: హ్మ్! ఏం లోపాలు లేవు! ఇక నుంచి రోజూ పొద్దున నాకు ఈ డ్రింక్ చేసి ఇవ్వు.

రుచిలో ఏమాత్రం తేడా రాకూడదు!

అని గంబీరమైన గొంతుతో ఆర్డర్ వేస్తాడు.

అరుంధతి: తప్పకుండా సార్.

అని చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది.

రెడ్డయ్య ఎప్పుడు కనిపించినా ఇతరుల మనసులో తడబాటు కలుగుతుంది.

అతను కనబడగానే చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి మరీ అతన్ని నమస్కరిస్తూ తల వంచుకొని నిలబడుతారు.

రెడ్డయ్య వస్తున్నాడని తెలిస్తే చాలు కొండమంది భయంతో దూరంగా పారిపోతారు కూడా.

అతను వెళ్లిపోయాడని తెలిసే వరకూ దూరంగా పారిపోతూ దాక్కొని ఉంటారు.

మరికొందరు అయితే భయం వల్ల అతను అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం కూడా ఇవ్వలేక పోతారు.

రెడ్డయ్య ఎదురుగా ఎటువంటి తడబాటు లేకుండా నిలబడిన మొట్ట మొదటి అమ్మాయి అరుంధతి.

ఆమె సరైన సమయంలో పూర్తి గౌరవం చూపిస్తుంది.

పని చేస్తున్నప్పుడు ఎవరు అడ్డు వచ్చినా ఏకగ్రత మరవకుండా పనిలో నిమగ్నమయి ఉండటం అతనికి నచ్చుతుంది.

తన సొంత పిల్లలు కూడా అరుంధతి అంత మెరుగ్గా పని చేయలేరేమో అని ఆలోచిస్తూ ఉంటాడు.

రెడ్డయ్య ఆమెను గమనిస్తూ జ్యూస్ తాగుతుంటాడు.

ఆమె ఎదురుగా నిలబడి ఉంటుంది. అతను చూడగానే స్మైల్ చేస్తుంది.

ఆమె నవ్వు చూసి అతనికి అశ్చర్యం వేస్తుంది.

కుంచం కూడా తడబాటు చూపని నవ్వది.

అరుంధతి: ఇంకుంచం జ్యూస్ పొయ్యమంటారా సార్?

రెడ్డయ్య గ్లాస్ వైపుగా చూస్తాడు. గ్లాస్ ఖాళీగా ఉంటుంది.

చాలా సేపటి నుంచి ఆలోచనలో పడి ఖాళీ గ్లాస్ పట్టుకొని ఉండుంటాడు. అది గుర్తుకొచ్చింది అంబారేస్ అవుతాడు.

రెడ్డయ్య: *దగ్గుతో కవర్ చేస్కుంటూ* హ్మ్! ఇంకో గ్లాస్ ఇవ్వు!

అరుంధతి: *స్మైల్ చేస్తూ* ఓకే సార్.

అతని గ్లాస్ నింపుతూ ఉంటుంది.

రెడ్డయ్య: నువ్వు కూడా కూర్చొని జ్యూస్ తాగు. పని చేసి అలిసిపోయుంటావ్.

అరుంధతి: *స్మైల్ చేస్తూ* ఓకే సార్.

రెడ్డయ్య: హ్మ్!

అలా ఇద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు నిష్యబ్దంగా కూర్చొని జ్యూస్ తాగుతూ సమయం గడుపుతూ ఉండగా, జోగ్గింగ్కు వెళ్లిన రాజ..

...

రాజ: *చిరాకుతో* నాది!

కిరణ్: ఏంటి?..

రాజ: ఆ బాటల్ నాది!

కిరణ్: ఇదా? బాటలే కదా? ఏమైన్ది?

అని చెబుతూ మూత తీసుకోని తాగబోతాడు.

రాజ డబ్బాను లాక్కొని డబ్బా మొత్తం ఒకేసారి ఖాళీ చేసేస్తాడు.

కిరణ్: *షాక్తో* శాడిస్ట్ ఎదవ!