అలా ఇద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు నిష్యబ్దంగా కూర్చొని జ్యూస్ తాగుతూ సమయం గడుపుతూ ఉండగా, జోగ్గింగ్కు వెళ్లిన రాజ..
రాజ జాగింగ్ చేసుకుంటూ పార్క్ దెగ్గరకు చేరుకుంటాడు.
చుట్టూ చాలా మంది అతని లాగే జాగింగ్, ఎక్సర్సైస్, యోగాలు చేస్తూ కనిపిస్తారు.
పార్క్ చుట్టూ కొన్ని రౌండ్లు కొట్టి, జిమ్ కి బయలుదేర బోతున్న సమయంలో ఒక వ్యక్తి తగులుతాడు.
కిరణ్: *ఉత్సాహంతో దెగ్గరకు పరుగులు తీస్తూ* ఏరా మావోయ్!
రాజ: *విసుగుతో* పొద్దున్నే వీడు తగిలాడెంటి? టైం బొక్క!
కిరణ్ దెగ్గరికొచ్చి వెనకాల నుంచి భుజం మీద చెయ్యి వేసి పలకరిస్తాడు.
కిరణ్: ఏం మావా?! చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం, కలిసి ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పనుకున్నాం.
బెస్ట్ ఫ్రెండ్ నేను! నన్ను చూసి చూడగానే మొఖం తిప్పుకొని పారిపోతున్నావ్? హా?
రాజ: నేను చదివే స్కూల్లకే నువ్వు కావాలని ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చావ్.
నేను ఎటెల్తె అటు నువ్వే తోకలగా వెంబడించావ్.
నేను తినే కంచంలో సైతం అన్ని సిగ్గు, మొహమాటం లేకుండా లాక్కుంటూ తిన్నావు.
దూరంగా పొమ్మన్నా హాస్టల్లో నా మంచం మీదే దొర్లి పనుకున్నావ్!
పొమ్మన్నా వినకుండా నువ్వే అన్నీ ఊహించేసుకుంటావ్.
నీకు తగిలితే ఈసారి ఏం చేస్తావో అనే అవాయిడ్ చేస్తున్న! అన్నీ తెలిసి కూడా నన్ను వెంబడిస్తున్నావంటే నేనేం అనుకోవాలి?
కిరణ్: *పెద్దగా స్మైల్ చేస్తూ* నువ్వు మేక! నేన్నీ తోక! హిహిహి..
రాజ: సంతోషించంలే!~
ఇద్దరూ పార్కులో కలిసి జాగింగ్ చేస్తూ ఉంటారు.
కిరణ్: అమ్మకి ఆక్సిడెంట్ అవబోయిందంట? అమ్మ ఎలా ఉంది? ఏం కాలేదు కదా?
ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళావంట? ఎవరా అమ్మాయ్? బాగుంటుందా?
రాజ:.... బాగా ఎంక్వయిరీ చేసే వచ్చినట్టున్నావ్? ఆమాత్రం తెలీదా?
కిరణ్: హిహిహి.. పోలీస్ అన్నాక ఆమాత్రం చెయ్యమా? మనిద్దరికీ వేరు వేరు డిస్ట్రిక్ట్ లో జాబ్ వేశారు గానీ లేకుంటే ఒకే చోట్లో పని చేసుండే వాళ్ళం.
హా.. బాబోయ్ దాహం వేసేస్తోంది. నీళ్ళేక్కడ దొరుకుతాయి..
అని మాట్లాడుతూ ఉండగా రాజా దెగ్గర ఉన్న బాటల్ వైపు చూస్తాడు.
అతని చేతిలోని బాటల్ తీసుకుంటాడు.
రాజ: *చిరాకుతో* నాది!
కిరణ్: ఏంటి?..
రాజ: ఆ బాటల్ నాది!
కిరణ్: ఇదా? బాటలే కదా? ఏమైన్ది?
అని చెబుతూ మూత ఓపెన్ చేసి తాగబోతాడు.
రాజ డబ్బాను లాక్కొని డబ్బా మొత్తం ఒకేసారి ఖాళీ చేసేస్తాడు.
కిరణ్: *షాక్తో* శాడిస్ట్ ఎదవ!