Chapter 38 - 38

ఆమె మొక్కలున్న నేలను శుభ్రం చేస్తూ ఉంటే ఆ దృశ్యంలో తన స్థానంలో అతనికి తన అమ్మ కనిపిస్తుంది.

రెడ్డయ్య: అమ్మ...? *కనిళ్ళు కారుస్తూ*

రెడ్డయ్య కళ్ళు తుడుచుకొని చూడగానే, ఎదురుగా అతని అమ్మకు బదులుగా అరుంధతి కనిపిస్తుంది.

అతను పెదాలు కొరుక్కుంటాడు. ఎన్నో సంత్సరాల తర్వాత అరుంధతి వల్ల అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు.

ఆ అనుభూతి గుర్తుకురాగానే తనను తాను మర్చిపోయుంటాడు.

అందరినీ దాటుకుని, చేతులకున్న చొక్కాని పైకి లాగి మడత పెడతాడు. 

ఆమె పక్కన మోకాళ్ళ మీద చెట్ల వేర్ల అంచుల్లో ఉన్న ఆకులను, రాళ్లను, ఇతర వస్తువుల ముక్కలను ఏరడం మొదలు పెడతాడు.

అరుంధతి అతన్ని గమనించి కూడా పట్టించుకోకుండా పని మీద దృష్టిని ఉంచుతుంది.

రెడ్డయ్య ఆమెలో ఉన్న ఏకాగ్రతను మనసులో మెచ్చుకుంటాడు.

ఇద్దరూ వాళ్లకు తెలిసిన పాత పద్ధతుల్లో పెరట్లోని చెట్లను శుభ్రం చేసి, ఎరువుని వేసి, డెకరేషన్ మొక్కలకు రూపాన్ని ఇచ్చే విధంగా కత్తిరించి పనులన్నీ వేగంగా చేసేస్తారు.

రెడ్డయ్య లా చదవకముందు, చిన్నతంలో తల్లిదండ్రుల వద్ద వ్యవసాయాన్ని నేర్చుకొని ఉంటాడు.

అతను నేర్చుకున్న పద్ధతులు ఈ కాలం రైతులకు అవగాహన ఏమాత్రం లేదు.

నేర్చుకున్న వ్యవసాయాన్ని పక్కన పెట్టి, లా చదివి లక్ష్యం వైపు అడుగులు వేసి జడ్జ్ అవుతాడు.

అతని జీవితంలో ఎన్నో రకాల వ్యక్తులను చుసిన రెడ్డయ్యకు అరుంధతి ఆసక్తిగా అనిపిస్తుంది.

రెడ్డయ్య, అరుంధతి ఇద్దరూ చేతులు, కళ్ళను సబ్బుతో శుభ్రంగా కడుక్కుని చేతులను టవల్తో తుడుచుకుంటూ ఉంటారు.

రెడ్డయ్య: అక్కడ కూర్చుందామా?

అని ఎదురుగా ఉన్న సిట్టింగ్ హాల్ చూపిస్తాడు.

పెరట్లో కూర్చొని చెట్లను, ప్రకృతిని ఆస్వాదించడానికి, పిల్లలు కూర్చొని చదువుకోవడానికి, పెద్దలు మనస్సంతిగా విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంటుందా ప్రదేశం.

అరుంధతి పెదాల మీద స్మైల్ తో సరే అని తల ఊపుతుంది.

అరుంధతి: ఒక్క నిమిషం సార్,..

అని చెప్పి ఇంట్లోకి బయలుదేరుతుంది. అతను వెళ్లి సిట్టింగ్ హాల్లో కూర్చొని టవల్తో మొహం తుడుచుకుంటూ ఉంటాడు.

అరుంధతి ఎదురుగా వచ్చి నిలబడుతుంది.

అరుంధతి: ఇదిగోండి సార్.

అని చెబుతూ, చేత్తో కోసి, పిండిన పళ్ళ రసాలను గ్లాసులో అందిస్తుంది.

అతను టవల్ పక్కన పెట్టి ఒక గ్లాస్ తీసుకోని ఒక సిప్ తీసుకుంటాడు.

@@@

రెడ్డయ్య అమ్మ: అరెరే! ఒళ్ళంతా మట్టే! పొలంలో వెళ్లకుండా చదువుకోమని ఎన్ని సార్లు చెప్పాలి నీకు?!

10 ఏళ్ళ వయసుగల రెడ్డయ్య: నాన్న గారు ఒంటరిగా కష్టపడుతున్నారు కదమ్మా? అందుకే..

వాళ్ళ నాన్న నవ్వుతూ బాబు తల రుద్దుతాడు.

రెడ్డయ్య నాన్న: నా కొడుకు బంగారం!

రెడ్డయ్య అమ్మ: ఇద్దరూ కూర్చోండి! బాగా అలసిపోయుంటారు! ఇవి తాగండి!

రెడ్డయ్య: ఏంటమ్మా అవి?

రెడ్డయ్య అమ్మ: నీకిష్టం కదా అని టెంకాయ నీళ్లు, పళ్ళరసం, కుంచం తేనె కలిపి చేశాను.

రెడ్డయ్య: అయ్!! నా ఫేవరెట్!! యమ్మీ!

రెడ్డయ్య నాన్న: చూసావా? నా కొడుకు ఇంగిలిసు ఎలా మాట్లాడుతున్నాడో?! ఇంగిలిసు దొరలు వింటే మెచ్చుకోడం ఖాయం!

రెడ్డయ్య అమ్మ: హహహ.. మీరూ మీ చాదస్తం.

@@@

అరుంధతి అతని వంక చూస్తూ నిలబడి ఉంటుంది.

రెడ్డయ్య: ఇది.. ఎక్కడ నేర్చుకున్నావు?..

అరుంధతి: అం.. అది...