రాజ:... హ్మ్.. నిజమేనేమో..
అని చెప్పి, ఆలోచిస్తూ చందమామ వంక చూస్తాడు.
అతనికి అరుంధతి మొఖం కనపడగానే అశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తాడు.
చందమామలా ఆమె రూపం మెరవటం చూసి అతని గుండెలో గంట మోగుతుంది.
ఆమెను తాకమని చేతులు ముందుకు వెళుతుంటే అతను ఆ కోరికను అనుచుకొని చేతిని వెనక్కి తీసుకుంటాడు.
ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నిష్యబ్దంగా ఏకాంత సమయాన్ని గడిపేస్తారు.
సమయం తెల్లవారుజామున 5 అవడంతో అరుంధతి ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది.
రాజ హుడీ, జాగింగ్ షూస్ తొడుక్కొని జాగింగ్కు వెళ్ళబోతాడు.
అరుంధతి ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్ కలిపి బాటల్లో పోసి ఇస్తుంది.
రాజ మాములుగా ఎవరినీ పెద్దగా నమ్మడు. ఫార్మాలిటీ కింద బాటల్ను తీసుకోని జాగింగ్కు వెళ్తాడు.
అరుంధతి ఒళ్ళు విరుచుకొని, పోనీటైల్ వేసుకొని, పైటను నడుముకి కట్టుకుని, ఇంటి పనులు చేయడానికి సిద్ధం అవుతుంది.
అరుంధతి: *smirk* చూద్దాం ఎంత పనుందో!..
@@@ @@@ @@@ @@@
కొన్ని గంటల తరువాత,
సమయం ఉదయం 6:30 అవుతుంది.
రెడ్డయ్య స్నానం చేసి, రూం నుంచి మెట్ల కిందకు దిగుతూ ఉంటాడు.
రెడ్డయ్య: హ్మ్?. ఏంటి ఇల్లంతా ఖాళీగా కనిపిస్తోంది?
పనోళ్ళందరూ పనులు మానేసి ఎటెల్లారు?
*పెద్ద గొంతుతో* రే వీరయ్య! సోమయ్య! కనకరాజు!! ఎక్కడ చచ్చార్రా?!
అతని అరుపులు కేకలు వినిపించడంతో ముగ్గురూ హుటా హుటిన పరుగులు తీస్తూ వచ్చి తల దించుకొని, చేతులు కట్టుకొని నిలబడతారు.
రెడ్డయ్య: ఏంట్రా? పనులు చేయకుండా ఎక్కడ పెత్తనాలు కొడుతున్నారా?! హా?
*చిరాకుతో* మాట్లాడరే?!
వీరయ్య: *తడబడుతూ* అయ్యా.. పనులన్నీ అయిపోయాయయ్య..
రెడ్డయ్య కన్నెర్ర జేస్తాడు.
రెడ్డయ్య: ఏంట్రా? ఒల్లెలా ఉంది? హా?
అని కోపంతో అడుగుతూ, చుట్టూ ఉన్న పరిసరాలని సరిగ్గా గమనిస్తాడు.
చుట్టూ నేల శుభ్రంగా చిమ్మి, తడి గుడ్డ పెట్టి ఎండిపోయి ఉంటుంది.
మెట్లు, హాలు, మొత్తం శుభ్రంగా కనిపిస్తుంది.
హాల్లో ఉన్న సోఫాలు, వాటి మీదున్న దిండ్లు శుభ్రంగా కడిగి, ఎండబెట్టి సర్దినట్టుగా పర్ఫెక్టుగా కనిపిస్తాయి.
ఓసీడి అనబడే అతి శుభ్రత అనే జబ్బు అతనికి ఉంది.
పనివాళ్ళు రోజుకి 3 సార్లు ఇల్లు మొత్తం చిమ్మి, తడి గుడ్డ పెట్టి, అద్దాలు అన్నీ తుడిచి, సోఫా కవర్లు మారుస్తూ ఉండేవాళ్ళు.
పని ఒత్తిడి ఎక్కువ కావడంతో వాళ్లకు రోజంతా పట్టేది.
రెడ్డయ్య చుట్టూ దీక్షగా చూసాక, ఇన్నేళ్లలో మొదటిసారి ఇల్లంతా శుభ్రంగా ఉందన్న ఫీలింగ్ అతనిలో కలుగుతుంది.
అతని మొఖం ఆనందంతో వెలిగిపోతుంది.
రెడ్డయ్య: ఇల్లు చాలా శుభ్రంగా ఉంది! రోజూ ఇలాగే పని చేయాలి! మీ అందరి జీతాలు పది వేలు పెంచుతున్న! ఈరోజున్నట్టే అన్నీ పనులు చక్కగా చేయండి!
వీరయ్య: *తడబడుతూ* అయ్యా.. ఈ పనులన్నీ సేసింది మేం కాదయ్యా..
అని చెబుతూ, ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమోనని భయంతో తల దించుకొని చేతులు పిసుక్కుంటూ ఉంటాడు.
రెడ్డయ్య: *నవ్వు ఆగిపోతుంది* ఎవరు?!
వీరయ్య: *దారి చూపిస్తూ* సూపిత్తాం రండయ్య..
రెడ్డయ్య అతని వెనకే వెళుతూ ఉంటాడు. వీళ్ళు పనులు మాని వేరే వ్యక్తుల చేత పనులు చేయించారని తెలిసి, వాళ్ళ నిర్లక్ష్యం మీద కోపం పెంచుకుంటాడు.
ఇంటి నుంచి పెరట్లోకి వెళ్ళగానే అతనికి చల్ల గాలి తలను తాకుతుంది.
పక్షుల కిల కిల మని కూయడం వినిపిస్తాయి. అతని ఇంటి పెరటు నిజంగా అతనిదేనా అనేట్టుగా మారిపోయి ఉంటుంది.
అతని అడుగు ఒక్క క్షణం ఆగుతుంది.
పాతికెళ్ళ క్రితం, రెడ్డయ్య తన తల్లిదండ్రులతో కలిసి పొలాల్లో సరదాగా తిరుగుతూ పనులు చేసిన మధుర క్షణాలు అతనికి గుర్తుకొస్తాయి.
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రాగానే అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.
వీరయ్య: *ఒకరిని చూపిస్తూ* కొత్తగా వచ్చిన మేడమే ఇవన్నీ చేసిందయ్యా..
అని చెప్తాడు.
రెడ్డయ్య ఆమెను కల్లార్పకుండా చూస్తూ నిలబడిపోతాడు.
ఆమె మొక్కలున్న నేలను శుభ్రం చేస్తూ ఉంటే ఆ దృశ్యంలో తన స్థానంలో అతనికి తన అమ్మ కనిపిస్తుంది.
రెడ్డయ్య: అమ్మ...? *కనిళ్ళు కారుస్తూ*