Chapter 35 - 35

ఆరు తన చేతుల్లో ఉంటూ కల్లార్పకుండా ఆమెను చూస్తూ ఉంటాడు.

చల్లగా గాలి వీస్తుంది.

అరుంధతి వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉంటే ఆరు సిగ్గు పడుతూ చూస్తూ ఉంటాడు.

ఆరు: న-న-న నన్ను ది-ది-ది దింపు.. నె-నె-నె నేను బాగానే ఉన్నాను..

అంటూ నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు.

ఆమె చిన్నగా నవ్వుతూ, తనను పక్కకు ఒదులుతుంది.

ఆరు మొహమాట పడుతూ నేల మీద కాలితో ముగ్గులేస్తూ ఉంటాడు.

ఆమె ఆరుని చూసి లోలోపల నవ్వుతూ ఉంటుంది.

అరుంధతి తన తల వెంట్రుకలను చెవి వెనక్కి వేలితో జరుపుతూ,

అరుంధతి: బయట చలి ఎక్కువగా ఉంది. ఇంట్లోకి వెళ్దాం వస్తావా?

అని అడుగుతుంది. ఆరు ఆమె అందాన్ని చూసి నోరు తెరిచేస్తాడు.

తనకే తెలీకుండా ఆమె వెనకే వెళ్ళిపోతాడు.

ఆరు ఇంట్లోకి అడుగు పెట్టగానే పులి పరిగెట్టుకుంటూ రావటాన్ని చూసి భయంతో తనకు తెలీకుండానే గోడ అనుకోని అరుంధతిని వెనుక నుంచి కౌగిలించుకుంటాడు.

అరుంధతి: హహహహ...

అంటూ చిలిపిగా నవ్వుతుంది.

ఆరు కళ్ళు తెరిచి నక్కుతూ పులిని గమనిస్తాడు. తీరా చూస్తే అతను గోడ అనుకోని అరుంధతిని కౌగిలించుకొని ఉండటం చూసి బిత్తరపోయి రెండు చేతులు పైకి ఎత్తి పోలీస్కు దొరికి పోయిన దొంగలా కదలకుండా నిలబడుతాడు.

అరుంధతి అపోకోలేక పొట్ట పట్టుకొని నవ్వేస్తుంది.

ఆమె ఎదురుగా కుక్క పిల్లలా తోక ఊపుతూ అణిగి మణిగి ఉన్న పెద్ద పులిని చూసి భయపడాలో..

పులినే అదుపులోకి తెచ్చుకుని ఎదురుగా కుక్క పిల్లలా కూర్చో బెట్టి, ఎటువంటి హాని చెయ్యనట్టుగా అమాయకంగా నవ్వుతున్న అరుంధతిని చూసి భయపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.

పులి స్థావరంలోకి వెళ్లి చిక్కుకుంటే గాయాలతో అయినా బయట పడే వీలుంటుంది.

అరుంధతి పెద్ద పులి కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరం అని అప్పుడే ఆరు అర్ధం చేసుకుంటాడు.

అరుంధతి తన చెయ్యి చాపి పులితో ఆడుకుందామని పిలుస్తుంది.

ఆరు: ఈ పిల్లను చూస్తే నాలో భయం పుట్టాలి గానీ.. ప్రేమా, గౌరవం, నమ్మకం పుడుతోందేంటి?... నాకేమైంది?..

అని అతను ఆలోచిస్తుంటాడు. చిరునవ్వుతో ఆమె చెయ్యి పట్టుకొని రాత్రంతా ఆడుకుంటూ గడిపేస్తారు.