దెగ్గరికెళ్లి చూడబోతారు. ఆరు తన చేతిని ముందుకి చాపి మొక్కను జరుపబోతాడు.
భయం వల్ల అతని ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంటుంది. వణుకుతున్న చేత్తో చెట్ల ఆకులను వేగంగా జరుపుతాడు.
అప్పుడు అక్కడ ఏమీ కనిపించదు. వాళ్ళందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకోని వెనక్కు తిరుగుతారు.
వెంటనే ఆరు మీదకు ఒక బెంగాల్ టైగర్ దాడి చేయడానికి దూకుతుంది.
అతని మీదకు పంజాతో దాడి చేస్తుంది. అతని చేతి మీద పంజా గుర్తులు పడతాయి.
ఇతర పిల్లలు భయంతో తలో దిక్కులోకి పరుగులు తీస్తారు.
ఆరు గాయపడిన చేత్తో నేల మీద పడి ఉంటాడు.
బెంగాల్ టైగర్ అతన్ని చంపి తినడానికి పీక పట్టుకొని కొరకబోతుంది.
భయంతో నేల మీద కూర్చొని, గట్టిగా కళ్ళు మూసుకొని, రెండూ చేతులు మొక్కుతూ..
ఆరు: బాల మురుగుగన్.. నన్ను రక్షించండి...
అని బయటకు గట్టిగా అరుస్తాడు. అతని గొంతులో ప్రాణభయం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.
పులి ఇంకా తన మీద దాడి చెయ్యలేదేంటా అని నిదానంగా ఒక కన్ను తెరిచి చూస్తాడు.
అతని మొఖం మీద ఒక నెమలి ఈక రాలుతుంది.
ఈకను చేతిలోకి తీసుకోని చూస్తూ, చూపుని ముందుకు తిప్పుతాడు.
ఎదురుగా బంగాల్ టైగర్ కోరలను రెండు చేతులతో పట్టుకొని ఆపి ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు.
అతని ఒంటి మీద ఉన్న పై చొక్కా చినిగి చేతులు, భుజం, నడుము కనిపిస్తుంది.
శరీరం మొత్తం కండలు తిరిగి, నరాలు కనిపిస్తుంటాయి.
ఆ వ్యక్తి వెంట్రుకలు సముద్రపు అలల్లా గాల్లో తేలుతూ ఉంటాయి.
అతన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా కనిపిస్తాడు.
ఆరు: బాల మురుగన్..
కృష్ణ (అరుంధతి) అతన్ని చూసి చిన్న నవ్వు నవ్వుతాడు.
ఆరు గుండెలో అలజడి తెలుస్తుంది. ఇంత సేపూ తన మనసులో కలిగిన భావాలాన్ని
పులి అతని బలానికి నోటిని కదపలేక పోతూ ఉంటుంది.
అతని బలంతో పులిని వెనక్కు నెడుతూ వెళుతుంటాడు.
పులి తన బలం అంతా ఉపయోగిస్తూ అతని మీద దాడులు చేస్తుంది.
కృష్ణ పులి పంజాల దాడుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.