Chapter 33 - 33•

పులి తన బలం అంతా ఉపయోగిస్తూ అతని మీద దాడులు చేస్తుంది.

కృష్ణ పులి పంజాల దాడుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

పులి తన పంజాలను అతని మీద విసురుతూ ఉంటుంది.

కృష్ణ వేగంగా తప్పుకుంటూ ఉంటాడు.

పులి తన పంజాలతో చుట్టు పక్కలున్న అరటి చెట్లను ధ్వంసం చేసేస్తుంది.

కృష్ణ ఒక అరటి చెట్టు దుంగ మీదకు ఎక్కి పులి ఎదురుగా దూకుతాడు.

పులి పంజాలతో, కోరలతో అతని ఎదురుగా దూకుతుంది.

ఆ దృశ్యాన్ని పిల్లలు అందరూ పూర్తి అశ్చర్యంతో చూస్తూ ఉంటారు.

అందరి పెదవుల మీద పలికిన పేరు ఒకటే..

"బాల మురుగన్.."

పులి అతని మీద చేయాలనుకున్న దాడిని మిస్ అవుతుంది.

కృష్ణ పులి మెడ పట్టుకుని వీపు మీదకు ఎక్కుతాడు.

పులి అతన్ని కరవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది.

కృష్ణ పులికి అందకుండా వీపు మీద నక్కి అటు ఇటూ కదులుతూ ఉంటాడు.

పులికి చిరాకుగా అనిపించి అడవిలోకి పరుగులు తీస్తుంది.

కృష్ణ తన వీపు మీదే ఉండి ఉంటాడు.

పిల్లలందరూ దడుచుకొని ఊరిలోకి పరుగులు తీస్తారు.

తమ ఊరి పెద్దలకు వార్త చేరుతుంది. మొత్తం ఊరంతా కృష్ణ కోసం వెతుకులాట మొదలు పెడుతుంది.

ఆడ మగ పిల్లా పెద్దా ముసలి ముతకా అందరూ కృష్ణ కోసం గాలింపు చేస్తుంటారు.

చీకటి పడుతుంది. అందరి మనసులలో కృష్ణ ప్రాణాలు కొలిపోయి ఉంటాడని అనుకుంటారు.

కనీసం తన శవం యొక్క ఆనవాళ్లు దొరికినా చాలని అనుకుంటారు.

ఆరు, మిగతా పిల్లలు కృష్ణ కోసం కన్నీళ్లు పెట్టుకుంటారు.

ఆరు: ఇదంతా నా వల్లే.. నన్ను కాపాడటం కోసం వాడు ఇలా.. ఇలా.. అంతా నా వల్లే...

అని తనను తాను దూషించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

పెద్దలు ఇంటికి వెళ్ళమని మందలిస్తున్నా వాళ్లు కృష్ణ ఆచూకీ దొరికే వరకూ ఇంటికి వెళ్ళమని పట్టు పట్టి వెంట వస్తుంటారు.

లాంతర్లు పట్టుకొని, ఆయుధలతో అడవిని గాలిస్తూ ఉండగా వాళ్లకు పులి అడుగు జాడలు కనిపిస్తాయి.

అందరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కృష్ణ శవం గానీ చినిగి పడిన దుస్తుల ముక్కలు గానీ కనిపిస్తాయేమో అని వేగంగా గాలిస్తూ ఉంటారు.

అంతలో వాళ్ళను ఏదో భయంకరమైన మృగం గమనిస్తున్నట్టుగా వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది.

అందరూ ఒక్కసారిగా ఆయుధాలను చేత పట్టి అలర్ట్ అవుతారు.

ఎదురుగా లంతరులను ఒక చోట చేర్చుతారు.

వాళ్ళ ఎదురుగా చినిగిన దుస్తుల్లో, గాలికి ఎగురుతున్న పొడవైన జుట్టుతో, పులిని సైతం ఓడించి మృగ రాజులా కనిపిస్తున్న 7-9 ఏళ్ళ యువతి వాళ్లకు కనిపిస్తుంది.

ఊరి పెద్ద: "బాల మురుగన్..."

అందరూ తన రూపాన్ని చూసి తమకు తెలియకుండానే ఆమెకు చేతులు జోడించి మొక్కుతారు.

ఆమె చిరునవ్వు నవ్వుతుంది.