Chapter 34 - 34

అందరూ తన రూపాన్ని చూసి తమకు తెలియకుండానే ఆమెకు చేతులు జోడించి మొక్కుతారు.

ఆమె చిరునవ్వు నవ్వుతుంది.

పిల్లలు అందరూ పులి మీదున్న భయాన్ని మరిచి ఆమెను వెళ్లి గట్టిగా కౌగిలించుకుంటారు.

కృష్ణ అసలు పేరు అరుంధతి అని చెప్పి, తనకు ఏమీ కాలేదని చెబుతూ వాళ్ళను ఓదారుస్తుంది.

పులిని చంపాల్సిన అవసరం లేదని ఊరి పెద్దను ఒప్పిస్తుంది.

వాళ్లు తడపడుతూ ఆమె మాటకు ఒప్పుకుంటారు.

ఎందుకంటే ఇక్కడ ప్రమాదకరమైన మృగం ఆ పెద్ద పులి కాదు.

అరుంధతి. ఆమె కళ్ళలోకి చూస్తుంటే ఆమె తలుచుకుంటే చిటికలో ఊరినే సర్వ నాశనం చేయగలిగే సత్తా ఊరి పెద్దకు కనిపిస్తుంది.

అతను ఆమెకు తల వంచి నమస్కరించి అడవి నుంచి తన ఇంటికి తీసుకెళ్లి ఒదిలి పెడతారు.

పిల్లలతో కలిసి పులి మీద స్వారీ చేస్తూ ఇంటికి చేరుకుంటారు.

ఆరు మాత్రం జరిగిన దృశ్యాన్ని దూరం నుంచి చూస్తూ ఉండిపోతాడు.

అతని గుండెలో ఏదో అలజడి మొదలువ్వుతుంది.

రాత్రంతా నిద్రపోకుండా అరుంధతి గురించే ఆలోచిస్తూ ఉండిపోతాడు.

ఆరు: అంటే... కృష్ణ అబ్బాయి కాదు... అమ్మాయి.. అంటే.. మొదటి నుంచీ నేను తనని... ఆ...

అతను అలా ఆలోచిస్తూ ఉండగా తన బుగ్గలు ఎరుపెక్కుతాయి.

సిగ్గుతో దిండుతో మొఖం దాచుకొని, మంచం మీద దొర్లుతాడు.

కళ్ళు మూసుకోగానే అరుంధతి మొఖ చిత్రాలు, తన నవ్వే కనిపిస్తుంది.

నిద్ర పట్టక పోవడంతో పైకి లేచి కిటికీ దెగ్గరకు వెళ్లి నించుంటాడు.

తన ఇంటి నుంచి చూస్తే అరుంధతి ఇల్లు కనిపిస్తుంది.

అరుంధతి ఇంట్లో దీపం వెలుగు కనిపిస్తుంది. అంటే తను మేలుకొని ఉండి ఉంటుందని ఆమెను ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని అనుకుంటాడు.

కిటికీ లోనుంచి బయటకు దూకి శబ్దం చేయకుండా రహస్యంగా ఆమె ఇంటి దెగ్గరకు చేరుకుంటాడు.

ఆమె కిటికీ తెరిచి ఉండటంతో అందులోకి తొంగి చూస్తాడు.

అలా తొంగి చూడగానే ఎదురుగా కిటికీలో పులి ఆవులిస్తూ కనిపిస్తుంది.

ఉలిక్కి పడి వెనక్కు పడిపోతాడు. అరుంధతి అతను వెనకున్న రాయికి గుద్దుకోకుండా అందుకొని పట్టుకుంటుంది.

ఆరు తన చేతుల్లో ఉంటూ కల్లార్పకుండా ఆమెను చూస్తూ ఉంటాడు.

చల్లగా గాలి వీస్తుంది.