ఆరు: మేము నీతో మాట్లాడుదాం అని వచ్చాం. గొడవకి కాదు!! మగాడిలా ముందుకిరా!!
అని చిరాకుతో అరుస్తాడు.
కృష్ణ: నాకు సిగ్గు బాబూ! మీరేమో అంతమంది ఉన్నారు. నన్ను పక్కకు తీసుకెళ్లి ఏమైనా చేస్తే?
నాకు భయం వేస్తోంది.
అని అమాయకంగా మాట్లాడుతూ ఒక అమ్మాయి వెనుక దాక్కుంటాడు.
అమ్మాయిలు తనని కాపాడటానికి అడ్డుగా నిలబడుతారు.
అమ్మాయిలను గమనించి అబ్బాయిలందరూ పళ్ళు కొరుకుతూ దూరంగా వెళ్ళిపోతారు.
కృష్ణ: హ్మ్... కొత్త కధ మొదలువ్వ బోతొందన్నమాట!.. హిహిహి..
తనలో తాను మాట్లాడుకుంటూ స్మైల్ చేస్తాడు.
@@@
అమ్మాయిలు కృష్ణను ఊరు మొత్తం తిప్పి చూపిస్తారు.
వాళ్ళ ఊరిలోని వింతలు, విచిత్రాలు, ఆచారాల గురించి వివరిస్తారు.
కృష్ణ వాళ్ళ నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాడు.
"మనం తోటకు వెళ్దామా?! అక్కడ అరటి పళ్ళు కోసుకొని తినొచ్చు!"
కృష్ణ: మీరు ఎలా అంటే అలా!
వాళ్ళతో కలిసి తోటలోకి వెళ్తాడు. తోట మొత్తం అందమైన చెట్లతో నిండి ఉంటుంది.
చుట్టూ అరటి చెట్లు నాటి ఉండటం వల్ల పిల్లలు దాగుడు మూతలు ఆడటానికి అనువుగా ఉంటుంది.
కృష్ణ వాళ్ళతో ఆనందంగా తిరుగుతూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటాడు.
వాళ్ళను కొందరు చెట్ల వెనక నుంచి దొంగ చాటుగా గమనిస్తూ ఉంటారు.
ఆరు: అనా కొడుకుని ఏదయినా చెయ్యాలిరా!
"అవున్రా! ఆడవాళ్ళను తలెత్తి చూడటానికే మనకు సిగ్గేస్తుంది! వాడసలు అలా ఎలా నవ్వుతూ రాసుకు పూసుకొని తిరుగుతున్నాడు?"
"వాడికి అలవాటేమో?! లేకుంటే అంత చనువుగా ఎలా ఉంటాడు?!"
"కుంచం కూడా సిగ్గులేకుండా చూడు ఎలా నవ్వుతున్నాడో!"
...
వాళ్లు అసూయతో వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు.
*GRRR*
అప్పుడే ఏదో వింత శబ్దం వినిపిస్తుంది.
ఆ శబ్దం ఏంటని దిక్కులు చూస్తారు. చుట్టు పక్కల ఖాళీగా నిష్యబ్దంతో నిండి ఉంటుంది.
ఏమీ లేదని అనుకోని తిరిగి మాటల్లో పడతారు.
అప్పుడే చెట్ల మధ్యలో ఏదో అలజడి తెలుస్తుంది.
దెగ్గరికెళ్లి చూడబోతారు. ఆరు తన చేతిని ముందుకి చాపి మొక్కను జరుపబోతాడు.
భయం వల్ల అతని ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంటుంది. వణుకుతున్న చేత్తో చెట్ల ఆకులను వేగంగా జరుపుతాడు. అప్పుడు..