Chapter 27 - 27

అరుంధతి: అవును సార్. నా బాయ్ ఫ్రెండునే గుర్తు చేసుకుంటున్నాను.

అని స్మైల్ చేస్తూ అంటుంది.

అతను గట్టిగా పిడికిలిని బిగిస్తాడు.

రాజ: ఎవడు వాడు?!

అతని గొంతులో జీలసి తెలుస్తుంది.

అరుంధతి: వాడి పేరు చీకు.

రాజ: చీకు? అదేం పేరు? ఎక్కడ కలిసావ్ వాడిని?

అని అడుగుతూ విసుగ్గా మొఖం పెడుతాడు.

అరుంధతి: చీకు నా జీవితంలోనే కలిసిన మొదటి ఫ్రెండ్...

అని స్మైల్ ఇస్తూ చందమామని చూస్తుంది. అందులో చీకు బొమ్మని ఉహించుకొని మరింత పెద్దగా స్మైల్ చేస్తుంది.

ఆమె స్మైల్ చూసి రాజ గుండెలో గంట మోగుతుంది.

రాజ: ఇప్పటి వరకూ నువ్వు నవ్వుతూనే ఉన్నా..

ఈ నవ్వు ఎందుకు?..

అసలైనదిగా అనిపిస్తోంది నాకు?..

వాడు ఎవడై ఉంటాడు?..

అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు.

ఆమె కళ్ళు మూసుకుంటుంది.

@@@

ఆమె కేరళాలోని ఒక మారు మూల ప్రదేశంలో ఉంటుంది.

అరుంధతి ఒక రహస్యమయిన ఇంట్లో, అబ్బాయిగా వేషం మార్చుకొని ఉంటుంది.

ఆమె జుట్టు, దుస్తులు, వేష భాషలు అన్నీ అబ్బాయిల స్టైల్ లోనే ఉంటాయి.

ఆమె కొన్ని రోజులుగా అక్కడి గుడారంలో ఉంటుంది.

ఆమె ఇంట్లో కూర్చొని *30 రోజుల్లో మలయాళం నేర్చుకోవడం ఎలా?* అనబడే పుస్తకం చదువుతూ ఉంటుంది.

దూరంలో పిల్లలు అందరూ గుంపులుగా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు.

ఆమె వాళ్ళను గమనిస్తూ ఉంటుంది.

వాళ్లు ఆడుకుంటూ ఉండగా వారిలో ఒకరు అరుంధతిని గమనిస్తారు.

అరుంధతి స్మైల్ చేస్తుంది.

అందరూ అమ్మాయిలే ఆయుంటారు. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి నవ్వారని వాళ్లు అనుకుంటారు.

ఆ అమ్మాయి సిగ్గు పడుతూ తల దించుకుంటుంది.

ఏమైందని అందరూ అడుగుతూ ఉండగా ఆమె ఒక దిక్కుకి వేలుని చూపిస్తుంది. అందరూ అరుంధతి వైపుగా చూస్తారు.

అందమయిన తల వెంట్రుకలతో, తెల్లని బాలమయిన శరీరం, ఒక్క చూపుతో అమ్మాయిల మనసులు దోచేసే కళ్ళు.

చిన్న నవ్వుతో ప్రేమలో పడేసే మొఖం తనది.

అమ్మాయిలు అందరూ తనను చూసి అబ్బాయి అనుకోని సిగ్గు పడుతూ తల దించుకొని దొంగ చూపులు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.

అరుంధతి వాళ్ళను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది.

వాళ్లు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి ఆమె కూర్చొని ఉన్న కిటికీ బయట నిలబడుతారు.

"నింగల్డు పేరెండాను కుట్టి?"

నీ పేరేంటి అబ్బాయ్?

"ఎందె పేరు కృష్ణ"

నా పేరు కృష్ణ.

అని ఆమె మగ గొంతుతో వాళ్ళతో చెబుతుంది.

తన గొంతు విని వాళ్ళందరూ మైమరిచిపోతారు.

"కృష్ణానో? నింగల్డె పేరు నల్లాదాను"

కృష్ణ? నీ పేరు చాలా బాగుంది.

అని ముసిముసిగా సిగ్గు పడుతూ నవ్వుతారు.

తను కూడా కృష్ణుడిలాగే కాసేపు వాళ్ళని ఆటపట్టించాలని నిర్ణయించుకుంటుంది.