"నింగల్డు పేరెండాను కుట్టి?"
నీ పేరేంటి అబ్బాయ్?
"ఎందె పేరు కృష్ణ"
నా పేరు కృష్ణ.
అని ఆమె మగ గొంతుతో వాళ్ళతో చెబుతుంది.
తన గొంతు విని వాళ్ళందరూ మైమరిచిపోతారు.
"కృష్ణానో? నింగల్డె పేరు నల్లాదాను"
కృష్ణ? నీ పేరు చాలా బాగుంది.
అని ముసిముసిగా సిగ్గు పడుతూ నవ్వుతారు.
తను కూడా కృష్ణుడిలాగే కాసేపు వాళ్ళని ఆటపట్టించాలని నిర్ణయించుకుంటుంది.
{అందరి భాషను డైరెక్టుగా తెలుగులోనే ట్రాన్స్లెట్ చేసి రాస్తాను.}
కృష్ణ: నా పేరు ఎంత అందంగా ఉందో మీరు కూడా అంతే అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎంతసేపు చూస్తున్నా మనసుకి తృప్తి గలగడం లేదు.
అంటూ మెత్తని గొంతుతో చెబుతాడు.
వాళ్ళందరూ తమ గురించే చెబుతూ పొగుడుతున్నాడని అనుకోని తమలో తాము మురిసిపోతూ మూసి ముసిగా నవ్వుతూ ఉంటారు.
కృష్ణకు వాళ్ళ నవ్వులు ముద్దుగా అనిపిస్తాయి.
"కృష్ణ.. మాతో ఆడుకోవడానికి వస్తావా?"
అని ఒకరు మొహమాటంగా అడుగుతారు.
కృష్ణ: తప్పకుండా!
అని చెబుతూ కిటికీ లోనుంచి కిందకు దూకుతాడు.
వాళ్లు సినిమా హీరోని చూసినట్టుగా ఆసక్తితో చూస్తూ ఉంటారు.
కృష్ణ: ఎక్కడికి వెళదాం? మీరే చెప్పండి.
అని అడుగుతాడు.
"నువ్వు అచ్చం శ్రీ కృష్ణుడిలాగే మాట్లాడుతున్నావ్ తెలుసా? నీ గొంతు వింటుంటే నాకు పొట్టలో బుటర్ ఫ్లైస్ ఎగురుతున్నాయి."
"నాక్కూడా.."
"నాకు కూడా.."
"హా! నేనూ అదే చెపుదాం అనుకుంటున్నా!"
....
కృష్ణ: అలాగే మరి. మరి మీ కృష్ణుడి లీలలు చూడక తప్పదుగా?
అని అంటూ స్మైల్ చేస్తాడు.
వాళ్లు నవ్వుతూ తన చెయ్యి పట్టుకొని వాళ్ళ వెంట తీసుకోని వెళతారు.
@@@@
అదొక అడవి ప్రాంతం. చుట్టూ చెట్లు, పొలాలు అందమయిన పూలతో కప్పబడి ఉంటుంది.
లోపలకు వెళ్ళగానే ఎదురుగా ఒక రాతి కట్టడం ఉంటుంది.
చుట్టూ నేల మీద రాళ్లతో శుభ్రంగా పరచబడి ఉంటుంది.
అక్కడ చాలా మంది పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు.
వాళ్ళ చేతిలో రకరకాల ట్రెడిషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి.
"మేము ఇక్కడ సంగీతం, నృత్యం సాధన చేస్తూ ఉంటాం."
అని ఒక అమ్మాయి వివరాలు చెబుతూ ఉంటుంది.
అప్పుడే, అంతమంది అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయిని చూసి వాళ్లలో కొందరు అబ్బాయిలకు జెలసి వస్తుంది.
.....
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.