Chapter 26 - 26

ఆమె అతన్ని సైలెంటుగా చూసి అశ్చర్యబోతుంది.

అతను షర్ట్ లేకుండా ప్యాంటు మాత్రమే వేసుకొని ఉంటాడు.

అతను ఐపీయస్ ఆఫీసర్ కనుక చేసిన ఎక్సర్సైసులు, ట్రైనింగ్ వల్ల అతని శరీరం 6 పాక్ బాడీ కలిగి ఉంటుంది.

ఆమె అతని బాడీని చూస్తూ ఉండటం గమనించి ఆటిట్యూడ్ తో స్మైల్ చేస్తాడు.

ఆమె అతన్ని చూసి స్మైల్ ఇస్తూ ఉంటుంది.

రాజ: కొత్త చోటు కదా? సరిగ్గా నిద్ర పట్టలేదా?

అరుంధతి: పర్లేదు సార్. నేను కొన్ని రోజులే కదా ఇక్కడ ఉంటాను.

అని స్మైల్ చేస్తూ చెబుతుంది.

అతను విలన్లా స్మైల్ ఇస్తాడు.

రాజ: అది డిసైడ్ చేసేది నువ్వు కాదు.

అని చెబుతూ బాల్కనీ నుంచి దూకి ఆమె ఎదురుగా నిలబడుతాడు.

ఆమె షాక్తో కళ్ళు పెద్దవి చేసి, రెండు అడుగులు వెనక్కి వేస్తుంది.

అతను ఆమె దెగ్గరకు నడుచుకొని వచ్చి ఆమె ఎదురుగా నిలబడుతాడు.

ఆమె వెనక్కి జరిగి, చూపులు తిప్పుకుంటుంది.

రాజ: దూరం నుంచి ఏం కనిపిస్తుంది? ఎదురుగా ఉన్నాను ఇప్పుడు చూడు నన్ను.

అని చెప్పి ఆమె మొఖంలో మొఖం పెట్టి చెప్తాడు.

ఆమె సిగ్గు పడుతూ అతన్ని ఒకసారి కిందకు పైకి చూసి కళ్ళు మూసుకొని పక్కకు తిరుగుతుంది.

అరుంధతి: సారీ సార్. నా హద్దులో నేను ఉంటాను.

అని నర్వస్గా తల వంచుకొని చెబుతుంది.

అతను అరుంధతిని దీర్గంగా చూస్తూ ఉంటాడు.

ఆమె మెల్లగా కళ్ళు పైకి ఎత్తి చూస్తుంది.

ఇద్దరి వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉంటాయి.

రాజ ఆమె వెంట్రుకలను వేలితో చెవి వెనుకకు జరుపుతాడు.

ఆమె వేలు తగలగానే ఉలిక్కిపడుతుంది.

అతను చేతిని వెనక్కి తీసుకోగానే, ఆమె చిన్న స్మైల్ ఇస్తుంది.

మెల్లగా పక్కకు జరిగి బాల్కని చివర నిలబడుతుంది.

అతను కూడా ఆమె పక్కన నిలబడుతాడు.

ఇద్దరూ ఒకేసారి చందమామను చూస్తారు.

చల్లగా గాలి వీస్తూ ఉంటుంది.

రాజ: మీ నాన్న గుర్తొస్తున్నాడా?

అరుంధతి: ఆయన గుర్తుకురాని క్షణమే లేదు సార్.

ఆమెను చూస్తూ ఉంటాడు.

రాజ: మరి ఇంకెవరిని గుర్తుకు చేసుకుంటున్నావ్? నీ బాయ్ ఫ్రెండ్ నా?

అని చేతులు కట్టుకొని సీరియస్గా అడుగుతాడు.

ఆమె స్మైల్ ఇస్తుంది.

అరుంధతి: అవును సార్. నా బాయ్ ఫ్రెండునే గుర్తు చేసుకుంటున్నాను.

అని స్మైల్ చేస్తూ అంటుంది.

అతను గట్టిగా పిడికిలిని బిగిస్తాడు.

రాజ: ఎవడు వాడు?!

అతని గొంతులో జీలసి తెలుస్తుంది.

అరుంధతి: వాడి పేరు...