చీకటి అవబోతుంది. ఆమె దెగ్గరలో ఉన్న ఒక టెంకాయ చెట్టుని గమనిస్తుంది.
అది చాలా ఎత్తులో ఉండటం వల్ల ఎక్కడం గురించి ఆలోచన మానుకుంటుంది.
అరుంధతి: ఈ చెట్టు ఎక్కగలిగితే కావాల్సిన అన్ని టెంకాయలు దొరుకుతాయి.
బట్ చాలా ఎత్తు ఉందిది. కింద పడితే ఎముకలు ఇరగడం మాత్రం ఖాయమే!~
ఆమె ఆలోచిస్తూ పైకి చూస్తుంది.
అలా కొబ్బరికాయ చెట్టుని చూస్తూ పక్కకు చూస్తుంది.
ఆమెకు కుంచం దూరంలో అరటి చెట్టు కనిపిస్తుంది.
ఆమె చేతిలోని పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ చెట్టు దెగ్గరకు వెలుతుంది.
చెట్టుకి పచ్చి అరటి పళ్ళు మాత్రమే ఉంటాయి.
ఆమె చెట్టుని చుట్టూ తిరిగి చూస్తుంది. దూరంలో మరిన్ని అరటి చెట్లు ఉంటాయి.
*టక్ టక్*
అలా ఒక్కో చెట్టుని తడుతూ వెలుతుంది.
వాటిలో ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకుని వేలుతో తడుతూ ఉంటుంది.
*టక్ టక్ టక్*
ఆమె చిన్న చాకుని చేతిలోకి తీసుకోని ఆ అరటి చెట్టుని సప్ మని సగానికి అడ్డంగా నరుకుతుంది.
చెట్టు లేతగా ఉండటం వల్ల ఒక్క వేటుకే తెగి నేల మీద పడుతుంది.
ఆమె మిగతా చెట్టుని చూస్తూ కత్తితో ఒక గుంట ఆకారంలోకి కోస్తుంది.
ఆ తర్వాత ఒక పెద్ద అరటి ఆకుని ముక్కలుగా చేసి ఆ నరికిన చెట్టు మీద పెట్టి గాలికి ఆకులు ఎగిరిపోకుండా చుట్టూ చిన్న రాళ్లను పెడుతుంది.
ఆతర్వాత కొన్ని చెట్లని నరికి అలానే చేస్తుంది.
కొన్ని నిమిషాల తరువాత ఒక్కో చెట్టు దెగ్గరకు వచ్చి నిలబడుతుంది.
రాళ్లు, ఆకులను జరిపి చూస్తుంది.
ప్రతీ చెట్టు మొదల్లో కొన్ని నీళ్లు వచ్చి చేరి ఉంటాయి.
ఆమె చిన్నగా స్మైల్ ఇస్తుంది.
అరటి చెట్లు ఎక్కువ నీటి సాతాన్ని కలిగి ఉంటాయి.
భూమిలోని ఉప్పు నీళ్లని మంచి నీళ్లుగా ప్రాసెస్ చేసుకొని, అరటి చెట్టు ఎదుగుతుంది.
అరటి చెట్టుని మధ్యకు కోసి దాని మధ్యలో గుంట ఆకారంలోకి కోయడం వల్ల చెట్టు మొత్తానికి అందాల్సిన నీరు అక్కడే ఆగిపోయి చిన్న నీటి ద్రావణ్ణి వదిలేస్తుంది.
అరుంధతి ఆ నీటిని తన నాన్న ఇచ్చిన బాటల్స్ లో ఆకులతో నింపి, మళ్ళీ ఆకులు, దాని పైన బరువుకి రాళ్లు ఉంచి వెళ్ళిపోతుంది.
తన చీకు దెగ్గరికి వెళ్లి వాడికి నీళ్లు తాగించి, తను కూడా కొన్ని నీళ్లు తాగుతుంది.
ఆమె చేతులు ఎర్రబడి ఉంటాయి.