లోపల చీకటిగా ఉంటుంది. ఏవో వస్తువులు పాక్ చేసి దాచి ఉన్నట్టుగా అనిపించి ఒక కట్టెను తీసుకోని అందులోకి గుచ్చుతుంది.
*TAK* *TAK* *TAK*
(చెక్క పెట్టి శబ్దం)
అరుంధతి: హ్మ్.. నేను అనుమానించినట్టే గుంట లోపల ఏదో ఉంది.
@@@
చుట్టు పక్కల ఉన్న చెట్టు కాడలను తెంపి తాడుగా చీకు నడుముకు కడుతుంది.
అరుంధతి: చీకు! నేను చెప్పినప్పుడు ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళు!
ఆమె ఒక చివర చీకు నడుముకి కట్టి, మరో చివర గుంటలో ఉన్న డబ్బా యొక్క రంధ్రానికి కడుతుంది.
అరుంధతి: చీకు! కదులు!!
ఆమె అనుమతి ఇవ్వగానే చీకు పైకి లేచి అడుగులో అడుగు వేస్తూ వెలుతుంది.
నిదానంగా పెట్టి పైకి వస్తూ ఉంటుంది.
పెట్టెను పూర్తిగా పైకి లాగి పక్కన పడేస్తుంది.
దాన్ని తెరవడానికి ఎటువంటి అవకాశం లేకుండా చుట్టూ గట్టిగా మేకులు కొట్టేసి, ఫెవిక్విక్ తో అతికించేసి ఉంటుంది.
అరుంధతి: నా బాబు ఉన్నాడే....
అంటూ తల పట్టుకుంటుంది.
హృలికాప్టర్లో వెళుతున్న వ్యక్తి చెవిలో వేలెట్టి తిప్పుకుంటూ,
"ఆర్ యూ కస్సింగ్ మీ?.. మమ్మీ?.."
అంటూ మందు మత్తులో తనలో తను అడుగుతూ హెలికాప్టర్ బయట వేలాడుతూ షూటింగ్ చేస్తూ ఉంటాడు.
శత్రువులు అతన్ని చంపాలని వెంబడిస్తూ షూట్ చేస్తూ ఉంటారు.
అతను అవేవి పట్టించుకోకుండా మందు సీసా తీసుకోని గటా గటా తాగేసి, పెద్ద సైజ్ గన్ తీసుకోని హెలికాప్టర్ నుంచి బయటకొచ్చి గాల్లో బుల్లెట్లు కాలుస్తూ ఉంటాడు.
"ఐ హేట్ వైలెన్స్! ఐ అవాయిడ్! బట్ వైలెన్స్ లవ్స్ మీ! ఐ కాంట్ అవాయిడ్!"
అని అంటూ ఒక మిసైల్ వెపన్ తీసుకోని ఎదురుగా ఉన్న సెత్రువుల హెలికాప్టర్ మీద అటాక్ చేస్తాడు.
ఆ ఒత్తిడికి అతను తన హెలికాప్టర్ లోకి వెనక్కి పడి, పనుకొని మిగతా మందు తాగుతూ, కళ్ళు మూసుకొని తన భార్య మొఖం గుర్తుకు తెచ్చుకొని స్మైల్ ఇస్తాడు.
శత్రువుల హెలికాప్టర్ *BAM!!* అని బ్లాస్ట్ అయిపోతుంది.
అతను స్మైల్ చేస్తూ నిద్రపోతాడు.
పైలట్ హెలికాప్టర్ ని వేగంగా పోనిస్తూ వెలుతాడు.
పైలట్: 😭 హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ ని చంపేసినట్టు ఏంటి నాకీ పరిస్థితి?.. ఆ....
అంటూ ఏడుస్తూ మరింత వేగం పెంచుతూ వెలుతాడు.
"హిహిహిహి..."
***