Chapter 22 - 22

ఆమె మోకానికి చెయ్యి అడ్డుగా పెట్టె ఆ బాక్స్ దెగ్గరకు వెలుతుంది.

పెట్టె బయట మొత్తం బద్ధలుగా పగిలిపోతాయి.

అందులో మరొక పెట్టి ఉంటుంది.

ఈసారి దాన్ని రాయితో కొట్టగానే పగులుతుంది.

పెట్టెను తెరిచి చూడగానే ఆమె కళ్ళు అశ్చర్యంతో పెద్దవి అవుతాయి.

అందులో రకరకాల పుస్తకాలు, ఒక వాయిస్ రికార్డర్, ఒక ఫిషర్ స్పేస్ పెన్స్ బాక్స్ ఉంటుంది.

ఆమె వాటిని ఒక్కొక్కటిగా తెరిచి చూస్తుంది.

పుస్తకాల పేర్లు:

1. చేపలు పట్టడం ఎలా? ఎన్సైక్లోపీడియా.

2. వేటాడటం ఎలా? ఎన్సైక్లోపీడియా.

3. అడవి చెట్ల ఎన్సైక్లోపీడియా.

4. మినరల్స్ ఎన్సైక్లోపీడియా.

5. కీటకాలు, విష పురుగుల ఎన్సైక్లోపీడియా.

...

అలా మొత్తం మొత్తం 7 లావు పుస్తకాలు ఉంటాయి. అందులో 2 ఖాళీ పుస్తకాలు అయింటాయి.

అడుగున పదునైనా కత్తులు, కొన్ని గాజు టెస్ట్ ట్యూబ్ బాటల్స్, జత బట్టలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, లాంటివి జాగర్త చేసి ఉంటాయి.

అరుంధతి: బాంబులు పెట్టి పెల్చినా చిన్న గీత పడలేదు అంటే అధ్బుతమే~

ఆమె ఒక చెట్టు గట్టు మీద కూర్చొని ఒక పుస్తకం చదవటం మొదలు పెడుతుంది.

@@@@

సమయం: సాయంత్రం 6 అవుతుంది.

ప్రదేశం: సముద్రం, రాతి బండ మీదకు ఎక్కి, అంచున నిలబడి ఉంటుంది. ఆమె చేతిలో రెండు పొడవాటి పదునైన కత్తులు ఉంటాయి.

చల్లగా గాలి వీస్తూ ఉంటుంది. సముద్రపు అలలు ఒకటి తరువాత ఒకటి ఆమె కాలి అంచును తాకి నమస్కరిస్తూ ఉంటాయి.

ఆమె వెనుక చీకు (బెంగాల్ టైగర్) నిలబడి ఉంటుంది.

నీటిలో ఏదో చేప కదులుతున్నట్టుగా నీడ కనిపిస్తుంది.

అరుంధతి: చీకు! పదా వేటాడుదాం!

అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్లి నీటిలోకి అమాంతం దూకుతుంది.

చీకు ఆమె చెప్పినట్టుగానే దుకాడానికి సిద్ధం అవుతుంది.

*disssh* (నీటిలోకి దూకిన శబ్దం)

కొన్ని క్షణాల వరకూ నీటిలో ఎటువంటి అలజడి ఉండదు.

అప్పుడే,

*shwaaa* (నీటి శబ్దం)

అరుంధతి ఒక సొరచేప మీద వేలాడుతూ బయటకు వస్తుంది.

ఆ చేప నోరంతా రక్తంతో తడిచి పోయి ఉంటుంది.

అరుంధతి: అహహహహ..... హుహూ...

నాకు ఇంకో పెట్ దొరికేసింది నాన్నా!!!....

అని నవ్వుతూ అరుస్తూ చెబుతుంది.

సొరచేప ఆమెను చంపి తినడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఆమె గుర్రపు స్వారీ చేస్తున్నట్టుగా, సొర చేప వీపు మీదకు ఎక్కి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

దూరంలో చీకు (బెంగాల్ టైగర్) ఈదుతూ, నోట్లో ఒక చిన్న చేప పట్టుకొని రాయి అంచున ఎక్కి కూర్చొని తింటూ ఉంటుంది.

చీకు (బెంగాల్ టైగర్): పాపం.. జాలేస్తోంది.. వాడ్ని చూస్తుంటే గతంలో నన్ను నేను చూసుకున్నట్టే ఉంది.. చూ చూ చూ...

అని ఆలోచిస్తూ సొర చేప మీద జాలి పడుతుంది.