Chapter 21 - 21

పైలట్ హెలికాప్టర్ ని వేగంగా పోనిస్తూ వెలుతాడు.

పైలట్: 😭 హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ ని చంపేసినట్టు ఏంటి నాకీ పరిస్థితి?.. ఆ....

అంటూ ఏడుస్తూ మరింత వేగం పెంచుతూ వెలతాడు.

"హిహిహిహి..."

***

అరుంధతి పెట్టిని అన్ని రకాలుగా పగలకొట్టి చూస్తుంది.

చెట్టు ఎక్కి ఒక రాయిని చెట్టు తీగలతో పైకి మోసుకెళ్లి పెట్టె పైకి ఫోర్స్ తో విసిరి కొడుతుంది.

చిన్న గీత పడుతుంది అంతే.

ఆ పెట్టెని ఒక చిన్న రాయి మీదకు మోసుకెళ్లి కిందకు విసిరి కొడుతుంది.

మరికొన్ని గీతలు పడుతాయి తప్పా పగలదు.

చేత్తో రాయి తీసుకోని బలంగా బాదుతుంది. రాయి ముక్కలు అయ్యి, చేతులు ఎర్రబాడుతాయి తప్పా పెట్టె మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది.

చీకు తన పంజాలతో బాగా గీకి, నోటితో కరా కరా నములుతుంది.

గీతలు పడి, జొల్లుకి తడుస్తుందే తప్పా ఏమాత్రం తెరుచుకోదు.

అరుంధతి: ఆ... ఇది ఏం చేసినా తెరుచుకోవట్లేదు!! ఏం చేయను???!!...

మా బాబు లాగా కంటికి కనిపించిన వన్నిటికి బాంబులు పెట్టి పెల్చాల్సిందే-

అని పెట్టె మీద కూర్చొని అంటూ ఉండగా ఆమెకు మరో ఆలోచన వస్తుంది.

చిన్నగా స్మైల్ ఇస్తుంది.

@@@

అదే చెట్టు తొర్రలో ఒక రంద్రం ఉంటుంది. ఆమె దాన్లో లోతుకి చెయ్యి పెట్టి కదపగా

అందులో 2 గ్రైనేడ్లు ఒక లైటర్ పెట్టి ఉంటాయి.

వాటిని మెల్లగా బయటకు తీసి రెండు చేతుల్లో పట్టుకుంటుంది.

అరుంధతి: ఐ లవ్ యూ నాన్న!

అని చెబుతూ స్మైల్ ఇస్తుంది.

హెలికాప్టర్లో ఉన్న అతను స్మైల్ ఇస్తూ,

"ఐ లవ్ యూ టూ మమ్మీ..

అంటూ జోబీలో నుంచి అరుంధతి ఫోటోని చేతిలోకి తీసుకోని (ఉమ్మా!! ఉమ్మ్..... మా....") అని ముద్దు పెట్టి పక్కకు తిరిగి పనుకుంటాడు.

@@@

అరుంధతి ఆ పెట్టెకి రెండు వైపులా వాటిని పెట్టి దూరంగా వచ్చి వెలిగించి,

అరుంధతి: చీకు! ఆ బండ రాయి వెనుక త్వరగా దాక్కో!!

అని చెప్పి ఇద్దరూ ఒక్కసారిగా వెళ్లి దాక్కుంటారు.

*BAMM*

మని పెద్ద పేలుడు జరుగుతుంది. చుట్టు పక్కలున్న పక్షులు వేగంగా పారిపోతాయి.

చుట్టూ పొగలు అలుముకుంటాయి.

ఆమె మోకానికి చెయ్యి అడ్డుగా పెట్టె ఆ బాక్స్ దెగ్గరకు వెలుతుంది.

పెట్టె బయట మొత్తం బద్ధలుగా పగిలిపోతాయి.

అందులో మరొక పెట్టి ఉంటుంది.

ఈసారి దాన్ని రాయితో కొట్టగానే పగులుతుంది.

పెట్టెను తెరిచి చూడగానే ఆమె కళ్ళు అశ్చర్యంతో పెద్దవి అవుతాయి.