Chapter 18 - 18

కళ్ళు తెరిచి ప్రస్తుతంలోకి వస్తుంది.

అరుంధతి: మా నాన్న ఎవరంటే...

విలన్లకే విలన్...

శత్రువులకే శత్రువు...

మా నాన్న పేరు...

రాకీ భాయ్...

నేను ఆయన వారసురాలిని....

కిల్లర్ క్వీన్...

అని చెపుతూ అద్దంలో తనను తాను చూసుకొని విలన్లా స్మైల్ ఇస్తుంది.

°°°

నా జీవితం గురించి తెలుసుకోవాలంటే..

నేను పుట్టక ముందు సమయానికి వెళ్ళాలి..

మా అమ్మ కడుపులో నేను ఉన్నానని తెలిసిన కొన్ని నిమిషాల తరువాత బుల్లెట్ దాడికి గురయ్యింది..

ఆవిడ చనిపోయే ముందు ఒక మాట అడిగింది..

"అమ్మ బ్రతకాలి.."

నన్ను, మా అమ్మని కాపాడటానికి ఎంతో ప్రయత్నించాడు..

కానీ...

కుదరలేదు...

నేను మాత్రమే బ్రతికాను..

ఆవిడ కోమాలోకి వెల్లిపోయింది..

డాక్టర్లు ఆమె శరీరం నుంచి నన్ను పిండం రూపంలో ఉన్నప్పుడే బయటకు తీసేసారు.

నన్ను కాపాడాలని మా అమ్మ కోరిన కోరిక మాత్రం మా నాన్న మర్చిపోలేక పోయారు...

నన్ను మరో తల్లి గర్భంలో ఉంచి ఉంచి ప్రాణం పోయాలని చూశారు.

ఎన్ని గర్భాల్లో మార్చినా నేను వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేదు..

నేనూ చావలేదు..

అలా అని పుట్టడము లేదు..

విధి.. తలరాత..

మరణ దేవతకి నన్ను తీసుకెళ్లడం ఇష్టం రాలేదు..

ప్రతీ బిడ్డ 9 నెల్లకే గర్భం నుంచి పుడుతుంది.

కానీ నేను మాత్రం 12 నెలలకు పుట్టాను.

నా అసలు పేరు షాంతి.

లోకం దృష్టిలో మాత్రం నా పేరు అరుంధతి.

మా నాన్న నన్ను ఎప్పుడూ అమ్మ అని పిలిచే వాడు.

అమ్మలాగే చూసి గౌరవించే వాడు..

కానీ ఎందుకో తెలీదు నాకు అయనంటే నచ్చదు..

బహుశా ఆయన నన్ను పెంచిన పద్ధతుల వాళ్లేనేమో..

హ్మ్...

అని ఆలోచిస్తూ మంచం మీద పనుకొని కళ్ళు మూసుకుంటుంది.

@@@

అరుంధతికి 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు.

"అమ్మ, ఇదంతా నీ మంచి కోసమే! నువ్వు బయట ప్రపంచంలో బ్రతకాలంటే నిన్ను నువ్వు అర్ధం చేసుకోవాలి.

ఇక్కడ నిన్ను నెల రోజుల వరకూ వదిలి వెళుతున్నాను.

నీ ఆహారం నువ్వే వెతుక్కోవాలి, తాగడానికి నీరు ఎలా సంపాదించాలో నువ్వే నేర్చుకోవాలి.

మృగాలను ఎలా వేటాడాలో కూడా నేర్చుకోవాలి!

నీకోసం ఈ అడవిలో ఒక్కో చోట్లో ఒక్కో ఆయుధం రహస్యంగా దాచి ఉంచడం జరిగింది.

అవసరం వస్తే ఎలా వాడాలో నీకు తెలుసు! జాగర్త అమ్మ!"

అని చెప్పి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడు.

ఆమెను ఒక ఐల్యాండ్ లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు.

ఆమె ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా అతను వెళిపోతుంటే చూస్తూ నిలబడి ఉంటుంది.

దూరంలో పొదల నుంచి ఏదో శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది.

──•~❉©Farruarts©❉~•──

ఇంకా ఉంది...

చాప్టర్ ఎలా ఉంది ?

మీరు రోజూ రేటింగ్స్ అండ్ కామెంట్స్ ఇచ్చారంటే , నేను ఈ స్టోరీని రోజుకి ఒకటి అప్లోడ్ చేస్తాను .

కనీసం 5 రేటింగ్స్ & కామెంట్స్ ☺️

మీకు నచ్చిన స్టోరీలో రేటింగ్ ఇచ్చి కామెంట్ పెట్టడం మర్చిపోకండి .