Chapter 16 - 16

లహరీ తప్పా మిగతా అందరూ వాళ్ళిద్దరినీ గమనిస్తూ చిన్నగా స్మైల్ చేస్తారు.

రెడ్డయ్య: హ్మ్... ఈ అమ్మాయి మనకి బాగా పనికొచ్చేలా ఉంది.. హ్మ్...

అని ఆలోచిస్తూ ఉంటాడు.

***

అందరూ భోజనాలు తినేసి వెళ్ళిపోతారు. దేవకి, శ్రీదేవమ్మ, అరుంధతి మాత్రం టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటారు.

వాళ్ళ మొఖాల్లో అలసట కనిపిస్తుంది.

అరుంధతి: ఆంటీ. మీరు రెస్ట్ తీస్కోండి. మిగతా పనులు నేను చూసుకుంటాను.

శ్రీదేవమ్మ: కానీ...

దేవకి: పర్లేదు అత్తయ్య. మీరు వెళ్లి రెస్ట్ తీస్కోండి. మేమిద్దరం మిగతా పని చేసేస్తాం.

శ్రీదేవమ్మ: సరే.. మరీ కష్టంగా అనిపిస్తే నన్ను పిలవండి. ఓకేనా?

దేవకి: సరే అత్తయ్య.

శ్రీదేవమ్మ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

***

అరుంధతి: నేను ప్లేట్స్ కడుగుతాను నువ్వు టేబుల్ క్లీన్ చెయ్యి. ఓకేనా?

దేవకి: కానీ.. చాలా అంట్లు ఉన్నాయిరా! నీ వల్ల అవుతుందా?..

అరుంధతి: హా. ఓకే నేను కిచెన్లోకి వెళ్తున్న. ఏమైనా అవసరం అయితే పిలవండి.

అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది.

దేవకి: అదీ.... కాదు... వెళ్ళిపోయింది..

హెల్ప్ ఏమైనా అవసరం అయితే పిలవండి అని నేను కదా అడగాలి!..

తను అంటుందేంటి?..

అరుంధతి మాలో ఒకరిగా కలవడానికి చాలా టైం పట్టుద్దేమో అనుకున్న.

ఒక్క రోజు కాకుండానే ఇంత కలవడిగా ఉంటుందంటే..

నాకు తోడి కోడలు అయ్యే అన్నీ లక్షణాలు ఉన్నట్టే!.. హుహుహు...

తను నాకు చాలా నచ్చింది. మా రాజకీ సరైన జోడీ!

అని తనలో తను ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది.

అరుంధతి చేతులు తుడుచుకుంటూ కిచెన్ నుంచి బయటకు వస్తుంది.

దేవకి: ఏంట్రా? ఏమైంది? పని కష్టంగా ఉందా? ఓకే! నేను వెళ్లి అంట్లన్నీ తోమేస్తాను.

నువ్వు కాసేపు రెస్ట్ తీస్కో.

అని అంటూ ఉండగా పక్కకు చూస్తుంది.

దేవకి: హా?.....

ఆమె షాక్తో నోరు పెద్దగా తెరుస్తుంది.

కొన్ని నిమిషాల్లోనే ఆమె అంట్లు అన్నీ తోమేసి వస్తుంది.

అరుంధతి: ఇంకా పని కాలేదా? నువ్వు కూర్చో. నేను చేస్తాను.

అని చెప్పి టేబుల్ ఫాస్టుగా క్లీన్ చేసి తుడిచేస్తుంది.

దేవకి:.....

పనంతా పూర్తి చేసి ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటుంది.

అరుంధతి: మీరు స్వయంగా పనులు చేసుకునే బదులు పని వాళ్ళను పెట్టుకోవచ్చుగా?

అని అడుగుతుంది.

దేవకి: అం.. మా ఆయన ఊరి కలెక్టర్, మావయ్య ఏమో జడ్జి, నా మరిది ఒక IPS ఆఫీసర్.

మాకు శత్రువులు ఎక్కువ.

బయట వాళ్ళని నమ్మడానికి కుదరదు. వాళ్లు ఎప్పటికయినా వెన్ను పోటు పొడుస్తారు.

అందుకే.. మిగతా పనులు బయట వాళ్ళతో చేయించినా వంటలు మాత్రం నమ్మిన వాళ్ళతోనే చేయిస్తారు.

అరుంధతి: మరీ నన్ను ఎందుకు వండమని పర్మిషన్ ఇచ్చారు?

నేను పరిచయం అయ్యి ఒక్క రోజు కూడా అవ్వలేదుగా?

దేవకి: ఏమో.. నాకూ తెలీదు.

అందరితోనూ స్ట్రిక్టుగా ఉండే మావయ్య నీకు చాలా త్వరగా ఇంట్లో ఉండమని పర్మిషన్ ఇచ్చారు.

వంటలు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు.

పిల్లలిని చూసుకోమని కూడా పర్మిషన్ ఇచ్చారు..

మాములుగా అయితే, నేను, అత్తయ్య నిన్ను ఇంట్లో ఉండనివ్వమని ఆయన్ని బాగా బ్రతిమాలుదామని అనుకున్నాము.

కానీ మేము ఏం అడక్కుండానే ఆయెనే పర్మిషన్ ఇచ్చేసారు.

బహుశా ఆయనకు నువ్వు నచ్చావేమో?

అరుంధతి: నేను నచ్చానా?

దేవకి: హ్మ్! నాకూ అత్తయ్యకి కూడా నువ్వు చాలా బాగా నచ్చావు. పిల్లలు కూడా నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.

మావయ్య కూడా ఓకే అంటే నువ్వు ఇకనుండి మాతోనే ఉండిపోవచ్చు.

నీకు మా రాజాని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?

బలవంతం ఏమీ లేదురా. నీకు నచ్చితేనే..

అరుంధతి చుట్టూ కళ్ళతో స్కాన్ చేస్తుంది.

ఆమెకు చాలా మంది యొక్క ప్రెసెన్స్ తెలిస్తుంది.

చిన్నగా స్మైల్ ఇస్తుంది.

అరుంధతి: నాకు మీ ఫ్యామిలీ నచ్చింది. కానీ అతను మాత్రం నచ్చలేదు.

దేవకి: హా?...