అరుంధతి చుట్టూ కళ్ళతో స్కాన్ చేస్తుంది.
ఆమెకు చాలా మంది యొక్క ప్రెసెన్స్ తెలిస్తుంది.
చిన్నగా స్మైల్ ఇస్తుంది.
అరుంధతి: నాకు మీ ఫ్యామిలీ నచ్చింది. కానీ అతను మాత్రం నచ్చలేదు.
దేవకి: హా?...
°°°😨
ఎందుకు నచ్చలేదురా?..
అరుంధతి: ఎందుకంటే... (ఆమె చెవిలో ఒక కారణం చెబుతుంది)
అందుకే..
దేవకి: అంతేనా?! దీనికెందుకు దిగులురా?! నువ్వు మాలో ఒకరివి. నీకు మేమున్నాం.
అని చెప్పి ఆమెకు ధైర్యం చెబుతుంది.
చాటున దాక్కుని మాటలు వింటున్న వాళ్ళందరూ తికమక పడుతూ దేవకి చెవిలో ఆమె ఏం చెప్పిందో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.
అరుంధతి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి పిల్లల దెగ్గరకు వెలుతుంది.
°°°
{రాత్రి 8:00 pm}
అరుంధతి: పిల్లలు. ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్నీ ఈ పేపర్ మీద రాసాను.
ఈ వీటిని ఇద్దరూ ఇంకో పేపర్లో కాపీ చేసి అన్నిటిని నేర్చుకోండి.
ముందు డైరెక్టుగా లెసన్స్ చెప్తే మీకు అర్థం కావు. సో! ముందు ఫార్ములాస్ నేర్చుకొండి.
ఎవరైతే అన్నీ ఫార్ములాస్ నేర్చుకొని తప్పులు లేకుండా రాస్తారో వాళ్ళకి ఒక స్టార్ ఇస్తాను.
లహరి: అరు! ఈ స్టార్ ఎందుకు?
వాసు: నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను అరు ఆంటీ.
అరుంధతి: ఇదొక నార్మల్ పేపర్ స్టార్ మాత్రమే. బట్! మీలో ఎవరైతే 10 స్టార్స్ ముందుగా కలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఏదయినా ఒక విష్ ఇవ్వడం జరుగుతుంది.
వాసు: విష్ అంటే ఏం అడిగినానా?
లహరి: నిజంగానే?! ఏం కావాలన్నా ఇస్తావా? ఎక్కడికయినా తీసుకెళ్తావా?
అరుంధతి: నిజంగానే. నేను గ్రాంపని రిక్వెస్ట్ చేసి మీ విష్ పూర్తి చేసేలా చేస్తాను. ఏమంటారు?!
ఆమె అలా అడగగానే ఇద్దరు పిల్లలూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరై పోతారు.
లహరి: అదేదో కుంచం ముందే ఇచ్చేయొచ్చుగా అరు ఆంటీ?... ప్లీస్...
వాసు: ప్లీస్ ఆంటీ..
అరుంధతి: నో మై బ్యూటిఫుల్ బేబీస్!! మనం ఏదీ ఫ్రీగా దొరకాలని కోరుకోకూడదు.
ఏదయినా కష్టపడి సాధించుకోవాలి! అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది.
అది వస్తువుకయినా మరిదేనికయినా. ఓకే?!
ఇద్దరూ నిట్టూరుస్తూ సరే అని తల ఊపుతారు.
అరుంధతి: గుడ్ బేబీస్ కదా?! ఇదిగోండి మీ హోమ్ వర్క్! ఈరోజు రాత్రి కంప్లీట్ చేసేసి ఉండండి. రేపు టెస్ట్ పెడతాను.
ఆతర్వాత క్లాసెస్ స్టార్ట్ చేస్తాను.
ఇద్దరూ కలిసి ఒకేసారి ఓకే అని అంటారు.
అరుంధతి: ఓకే. ఇప్పుడు మీరు మీ రూంకి వెళ్లి హోమ్ వర్క్ చేయండి.
వాళ్లిద్దరూ సరే అని తల ఊపి స్కూల్ బ్యాగ్ లో నోట్ బుక్స్ సర్దుకొని బయలుదేరుతారు.
వెళ్లే ముందు,
లహరి: అరు ఆంటీ, మీరు ఏ స్కూల్లో చదివారు?
అరుంధతి ఆ ప్రశ్న విని ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోతుంది.
అరుంధతి: నేను స్కూల్కి వెళ్ళ లేదు బేబీ.
లహరి: మరి మాకు ఇంత బాగా చదువు చెప్తున్నావ్?! మా టీచర్స్ కూడా నీలా అర్థమయ్యేలా చెప్పరు తెల్సా?! నీకు చదువు ఎవరు నేర్పారు?
అరుంధతి: మా డాడీ.
లహరి: మీ డాడీ టీచరా?! ఆయన పేరేంటి?..
అరుంధతి అవునని తల ఊపి పెద్దగా స్మైల్ ఇస్తూ ఇద్దరినీ వాళ్ళ బెడ్ రూంలోకి తీసుకెళ్లి వదిలి తన రూంకి తిరిగి వచ్చేస్తుంది.
బాత్రూంలోకి వెళ్లి పేస్ వాష్ చేసుకోని తుచుకుంటూ అద్దంలోకి చూస్తుంది.
ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తొస్తుంది.
"అరు! బీ పవర్ఫుల్!! స్టే పవర్ఫుల్!! ఇదంతా నీ మంచి కోసమే!!"
అని చెబుతూ హెలికాప్టర్ నుంచి ఒక ఐల్యాండ్లోకి తీసుకెళ్లి దింపి కట్టు బట్టలతోఉన్న 9 ఏళ్ళ అరుంధతిని వదిలి వెళ్లి పోతాడు.
ఆమె ఆకాశంలోకి చూస్తూ వాళ్ళ నాన్న వెళ్లిపోవడం గమనిస్తుంది.
కళ్ళు తెరిచి ప్రస్తుతంలోకి వస్తుంది.
కళ్ళు తెరిచి ప్రస్తుతంలోకి వస్తుంది.
అరుంధతి: మా నాన్న ఎవరంటే...
విలన్లకే విలన్...
శత్రువులకే శత్రువు...
మా నాన్న పేరు...
రాకీ భాయ్...
నేను ఆయన వారసురాలిని....
నేనే కిల్లర్ క్వీన్...
అని చెపుతూ అద్దంలో తనను తాను చూసుకొని విలన్లా స్మైల్ ఇస్తుంది.
──•~❉©Farruarts©❉~•──
ఇంకా ఉంది...
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.