Chapter 15 - 15

అరుంధతి: ఏమైంది?... వంటలు నచ్చలేదా?..

అని అడుగుతుంది.

శ్రీదేవమ్మ: అం.. అంటే... అదీ...

దేవకి:..... నన్నేం అడగొద్దు.. నేనేం చెప్పలేను..

అని మొహం తిప్పేసుకుంటారు.

అరుంధతి: ఏమైంది వీళ్ళకి? వంటలు నిజంగా బాలేవా?

అని ఆలోచిస్తూ ఉంటుంది.

అప్పుడే రెడ్డయ్య టేబుల్ దెగ్గరకు వస్తాడు.

రెడ్డయ్య: ఏంటి? ఎందుకు గమ్ముగా నిలబడి ఉన్నారు?

12 అవ్వడానికి 5 నిమిషాలే ఉన్నాయి. త్వరగా టేబుల్ మీద ఫుడ్ రెడీ చేయండి!

అని స్ట్రిక్టుగా చెప్తాడు.

వాళ్లు ఇద్దరూ హడావిడిగా కిచెన్ లోకి వెళ్లి వంటలు తీసుకొని వస్తుంటారు.

అరుంధతి తను వండిన కూరలు తీసుకోని కిచెన్ లో పెట్టేద్దామని అనుకోని తీసుకెళ్ల బోతుంది.

రెడ్డయ్య: ఏం చేస్తున్నావ్? ఖాళీగా నిలబడకుండా అందరికీ అన్నం వడ్డించు!

అని చెప్తాడు.

అరుంధతి: ఓకే సార్.

అని చెప్పి, అన్నిటిని వడ్డిస్తూ ఉంటుంది.

12 అవ్వగానే అందరూ వచ్చి టేబుల్ ముందు కూర్చుంటారు.

అలా ఒక్కొక్కరికి వంటలు వడ్డించి పక్కన నిలబడుతారు.

రెడ్డయ్య: అన్నీ వడ్డీంచావ్! మరి వాటి సంగతేంటి?! అవి కూడా వడ్డించు!

అని అరుంధతి వండిన కూరలను చూపిస్తాడు.

అరుంధతి: ఓకే సార్..

అని వడ్డించడం మొదలు పెడుతుంది.

రాజ: హ్మ్?.. ఈమె ఈ పనులన్నీ చేస్తోందేంటి?! బహుశా డాడీ చేయమన్నట్టు ఉన్నారు.

లేకుంటే ఈ ఇంట్లో వంటగదిలో అడుగు పెట్టడానికి ఎవరికీ ఛాన్స్ దొరకదుగా!

అని మనసులో ఆలోచిస్తాడు.

అందరూ భోజనం చేస్తూ ఉండగా సడెన్గా ఆగిపోతారు.

రెడ్డయ్య: ఈ వంటలు చేసింది ఎవరూ?

అని సీరియస్గా అడుగుతాడు.

అతను తింటుంది నాన్వెజ్. అరుంధతి చేసిన వంటలు.

అరుంధతి: వీడు ఇలా అడుగుతున్నాడంటే దానర్థం బాలేదనా? నచ్చిందనా? చూద్దాం.

అని ఆలోచిస్తూ,

అరుంధతి: నేనే సార్.

అని చెప్పి ముందుకొస్తుంది.

రెడ్డయ్య:....

రాజ:....

రాఘవ:....

దేవకి:....

శ్రీ దేవమ్మ:...

అందరూ ఒకరి మోకాలు ఒకరు చూసుకొని అరుంధతి వైపుగా చూపు తిప్పుతారు.

పిల్లలు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా సైలెంటుగా తింటూ ఉంటారు.

అరుంధతి: ఏమైంది సార్? వంటలు మీకు నచ్చలేదా?

అని చిన్న గొంతుతో అడుగుతుంది.

రెడ్డయ్య: పర్లేదు. బానే ఉంది. ఇక నుంచి వంటలు అన్నీ నువ్వే దెగ్గరుండి చేయించు.

అని చెప్పి భోజనం తినడం కంటిన్యూ చేస్తాడు.

రాజ: హ్మ్... డాడీ కి కూడా ఈమె నచ్చేసిందా?..

ఈ పిల్లని బయటకు గెంటాలనుకునే నా ఆలోచనకు దూరం అవ్వుతున్నానే..

అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు.

రాఘవ: వంటలు అన్నీ బాగున్నాయి. అందరికీ థాంక్యూ.

అని చెప్పి భోజనం తినడం కంటిన్యూ చేస్తాడు.

ఫుడ్డు కోసం పిల్లలు సైలెంటుగా గొడవ పడుతూ భోం చేస్తూ ఉంటారు.

వాసు: ఇది నాది.. నా ప్లేట్లోవి!!.. మమ్మీకి చెప్తా!!

అని చిన్న గొంతుతో చెప్తాడు.

లహరి: నీకంటే నేను వయసులో పెద్దదాన్ని! సో, నీ ఫుడ్డు నాది!! హిహిహి...

అని చిన్న గొంతుతో చెప్పి వాసు ప్లేట్ నుంచి చికెన్ ముక్క లాక్కుని తింటుంది.

వాసు:.... నా చికెన్ లెగ్ పీస్....

అని ఎమోషినల్గా ఆమె మూతి వైపు చూస్తూ ఉంటాడు.

సడెన్గా వాసు ప్లేట్లో ఇంకో రెండు చికెన్ లెగ్ పీస్లు కనిపిస్తాయి.

వాసు సంతోషంలో నోరు పెద్దగా తెరుస్తాడు.

తల పైకి ఎత్తి చూడగానే అరుంధతి స్మైల్ చేస్తూ కనిపిస్తుంది.

ఆమె తినమని సైగ చేసి కన్ను కొడుతుంది.

వాసు పెద్దగా స్మైల్ చేసి, లహరి నుంచి వేరే పక్కకు  తిరిగి త్వరత్వరగా తింటూ ఉంటాడు.

లహరీ తప్పా మిగతా అందరూ వాళ్ళిద్దరినీ గమనిస్తూ చిన్నగా స్మైల్ చేస్తారు.

రెడ్డయ్య: హ్మ్... ఈ అమ్మాయి మనకి బాగా పనికొచ్చేలా ఉంది.. హ్మ్...

అని ఆలోచిస్తూ ఉంటాడు.