Chapter 12 - 12

రెడ్డయ్య:..... మీ నాన్న పేరేంటి?

అరుంధతి:.... మా నాన్న పేరు రవి చంద్ర సార్.

రెడ్డయ్య: రవి చంద్ర.. హ్మ్.. అతను ఏం ఉద్యోగం చేసే వాడు?

అరుంధతి: వ్యవసాయం సార్.

రెడ్డయ్య: మీ సొంతూరు?

అరుంధతి: @@##%%.... సార్.

రెడ్డయ్య: ఒక రైతు కూతురివా నువ్వు...

అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు.

అరుంధతి: అవును. బట్ మా నాన్న మొక్కలకు బదులుగా తలలు నరుకుతూ ఉంటాడు అంతే.

మిగతాదంతా సేమ్ టూ సేమ్.

అని స్మైల్ చేస్తూ ఆలోచిస్తుంది.

రెడ్డయ్య: మరి మీ మదర్?

అరుంధతి: ఆవిడ ఒక వంట మనిషి సార్. కానీ నాకు ఊహ తెలీక ముందే చనిపోయింది.

రెడ్డయ్య: ఓహ్!! ఓకే. రెస్ట్ ఇన్ పీస్.

అరుంధతి: నా ఇద్దరూ పేరెంట్స్ డాన్లే. వాళ్లు చేసిన హత్యలకు, హింసలకు కచ్చితంగా నరకంలోనే ఉండుంటారు. నేనూ వెళ్ళేది అక్కడికే. సో! ఇక్కడ పీస్ అన్న మాటకి మా లైఫ్ లో స్థానమే లేదు.

అని ఆలోచిస్తూ స్మైల్ చేస్తూ ఉంటుంది.

రెడ్డయ్య: మరి నీ ఎడ్యుకేషన్, గోల్స్ ఏంటి?

అరుంధతి: నేను హోమ్ ఎద్యుకేషన్ తీసుకున్నాను సార్. పెద్దగా చదవలేదు.

రెడ్డయ్య: ఆల్రయిట్.

అంటూ ఆలోచిస్తూ ఉంటాడు.

అరుంధతి: హుహుహు.. నా చదువు గురించి తెలుసుకుంటే హార్ట్ ఏటాక్ వచ్చి పోతావ్ ముసలోడా.

ఈ దేశంలోనే కాదు. పక్క దేశాల్లో ఉన్న ప్రతీ చదువూ నేను చదివేసాను.

నేను చేయని డిగ్రీ లేదు. నేను మాస్టర్ చేయని సబ్జెక్ట్ లేదు.

ప్రతీ దేశపు నేషనల్ లాంగ్వేజెస్ మాస్టర్ చేశాను.

నా బాబు నన్ను అలా చదివించాడు మరీ.

అని మనసులో అనుకుంటుంది.

రెడ్డయ్య: మరి నీకు వంట చేయడం వచ్చా? వస్తే నీ స్కిల్స్ ఏంటి?

అరుంధతి: సౌత్ ఇండియన్ వెజ్, నాన్ వెజ్ వంటలు చేయడం తెలుసు సార్.

నా స్కిల్స్ వచ్చి వాసన చూసి అందులో వేసిన వస్తువుల క్వాలిటీ, క్వాంటిటీ చెప్పేయగలను.

రెడ్డయ్య: నైస్. నేను ఏ పనీ చేయని వ్యక్తిని నా ఇంట్లో అలో చెయ్యను. సో, నువ్వు నా ఇంట్లో ఉన్నంత వరకూ ఇక నుంచి వంటలు చేయడం, పిల్లలను చూసుకోవడం నీకు అప్పజప్పుతున్నాను.

వాళ్లు ఏం తప్పు చేసినా నీకూ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.

వంటల్లో ఏం లోటు జరిగినా సరే నీదే రెస్పాన్సిబిలిటీ.

అర్ధమైందా?!

అరుంధతి: ఎస్ సార్.