అరుంధతి: మరి కిందకు వెళ్దామా?
ఇద్దరూ సరే అని తలో వైపు చెయ్యి పట్టుకొని మెట్లు దిగుతూ వెళ్తారు.
....
డోర్ చాటున రెడ్డయ్య నిలబడి అంతా వింటాడు.
రెడ్డయ్య: హ్మ్....
అతను వాళ్లు మాట్లాడుకున్న మాటలు ఆలోచిస్తూ ఉంటాడు.
అరుంధతి మెట్లు దిగుతూ ఉండగా కళ్ళు అతను దాక్కొని ఉన్న వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తుంది.
°°°°
ముగ్గురూ కిందకు వెళతారు. ఆమెను తీసుకోని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి వాళ్లు ఆమెకు తలో వైపు కూర్చుంటారు.
వాసు: అరుంధతి ఆంటీ! నేను నిన్ను అరు అని పిలవొచ్చా? ప్లీచ్...
లహరి: నో! నేను మాత్రమే ఆంటీని అరు అని పిలుస్తాను. నువ్వు షటప్!
వాసు: లేదు! నేనే ముందు అడిగా! నేనే అరు అని పిలుస్తాను! సొ యూ షటప్!!
అరుంధతి: ఓ మై బ్యూటిఫుల్ డార్లింగ్స్.
మీరు ఇద్దరూ గుడ్ బేబీస్ కదా?
లహరి: అవును!
వాసు: హ్మ్.
అరుంధతి: మరి ఎందుకు గొడవ పడుతున్నారు?
చూడండి బేబీస్. మీరు ఇద్దరూ సిబ్లింగ్స్! అంటే మీరిద్దరూ కలిసి ఏమైనా పంచుకోవాలి.
ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలి. అచ్చం మీ డాడీ, బాబాయ్ లాగా! ఓకే?!
ఇద్దరూ స్మైల్ ఇస్తూ సరేనని తల ఊపుతారు.
లహరి: సరే. అరు అంతగా చెప్తోంది కాబట్టి మనం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం.
వాసు: ఓకే అక్క. అంటే అరు ఆంటీ కూడా మన ఫ్రెండా?
లహరి: అవును. అది కూడా తెలీదా?! అరు మన గుడ్ ఫ్రెండ్. ఓకే!?
వాసు: ఎస్!! అర్ధమయింది.
అరుంధతి: హహహ...
°°°°
వాళ్లు ముగ్గురూ నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు.
రెడ్డయ్య వాళ్ళను చూస్తూ నడుచుకొని వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడుతాడు.
అతన్ని చూసి ముగ్గురూ ఒకేసారి లేచి నిలపడుతారు.
రెడ్డయ్య: అరుంధతి. అదేగా నీ పేరు?.
అరుంధతి: ఎస్ సార్.
రెడ్డయ్య: నీ వయసు ఎంత?
అరుంధతి: 25 yrs సార్.
రెడ్డయ్య: ఈ ఊరికి ఏ పని మీద వచ్చావ్?
అరుంధతి: నా నాన్న చనిపోయారని మా సొంతూరు వదిలి వచ్చేసాను సార్.
రెడ్డయ్య: అంటే నీకు ఈ బంధువులు ఎవరూ లేరా?
అని అనుమానంగా అడుగుతాడు.
అరుంధతి: నాకు తెలిసి ఎవరూ లేరు సార్. కానీ ఉన్నా వాళ్ళకి నాకూ ఎటువంటి రిలేషన్స్ లేవు సార్.
రెడ్డయ్య: అంటే ఆక్సిడెంటలీ నా వైఫ్ ని కాపాడవ్ అన్నమాట?!
అరుంధతి: ఎస్ సార్.
రెడ్డయ్య: ఓకే. యు కెన్ రిలాక్స్ నౌ. గో అండ్ సిట్.
అరుంధతి: ఎస్ సార్.
అని చెప్పి సోఫాలో కూర్చుంటుంది.
రెడ్డయ్య: హ్మ్... వాటే దిసిప్లైన్..
ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా, ఒక్క క్షణం కూడా ఐ కాంటాక్ట్ కట్ చేయకుండా అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పింది.
పిల్లలతో ఎలా బెహేవ్ చేయాలో, ఎలా మాట్లాడాలో అన్నీ చక్కగా చేసింది.
ఆ గొంతులో చాలా స్ట్రిక్ట్ దిసిప్లైన్ ఉంది. ఈ అమ్మాయి తండ్రి ఎవరో గానీ కూతురిని చక్కగా పెంచాడు.
నాకే కనుక కూతురు ఉండుంటే ఇలాగే ఉండేదేమో.. అరుంధతి..
అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు.