రెడ్డయ్య: పిల్లలు ఏం తప్పు చేసినా నీకూ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
వంటల్లో ఏం లోటు జరిగినా సరే నీదే రెస్పాన్సిబిలిటీ.
అర్ధమైందా?!
అరుంధతి: ఎస్ సార్.
రెడ్డయ్య: ఓకే. వెళ్లి నీకిచ్చిన పనులు చేయ్. వెళ్ళు.
అని చెప్తాడు.
అరుంధతి: ఎస్ సార్. పిల్లలు ఫుడ్ వచ్చే వరకూ మీ టెక్స్ట్ బుక్స్ తీసుకోని మీకు ఇచ్చిన హోమ్ వర్కుని తీసుకోని చేస్తూ ఉండండి. ఓకే?
వాళ్లు సరేనని తల ఊపి రూముల్లోకి నడిచేకుంటూ వెళ్తారు.
ఆమె నేరుగా వంట గదిలోకి వెళ్తుంది.
***
శ్రీదేవమ్మ: నువ్వెంటమ్మా ఇలా వచ్చావ్? వంటయ్యాక నేనే పిలుస్తాగా?
దేవకి: అరుంధతి. నువ్వు రెస్ట్ తీస్కోరా. కాసేపట్లో వంటలు పూర్తి అవుతాయి.
అని చెబుతూ ఇద్దరూ హడావిడిగా పనులు చేస్తూ ఉంటారు.
అరుంధతి: సార్ వంటల్లో హెల్ప్ చేయమని పంపించారు అండి.
శ్రీదేవమ్మ: ఏంటి?
దేవకి: మావయ్యగారా?
శ్రీదేవమ్మ: అదేంటమ్మా?..
రెడ్డయ్య: నేను అన్నదాంట్లో తప్పేముంది?
అని మధ్యలో వచ్చి అడుగుతాడు.
ముగ్గురూ అతని వైపు చూపు తిప్పుకుంటారు.
వాళ్ళ ఇద్దరి నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు.
రెడ్డయ్య: ఈ ఇంట్లో ఉండాలంటే ఇంటి పనులు వంట పనులు చేయాల్సిందే.
ఏ పనీ చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి ఇదేం సత్రం కాదు!
సో! మాట్లాపి చెప్పిన పనులు సక్రమంగా చేయండి!
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
***
శ్రీదేవమ్మ: నువ్వు అవేం పట్టించుకోకమ్మా. నువ్విలా కూర్చో.
మేము వంటలు చేసేస్తాంగా?! ఆయన అడిగితే ముగ్గురం కలిసి చేశామని చెపుదాం.
దేవకి: అవును అరుంధతి. నీకు మేము కొత్త కదా? అలవాటు అయి అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. అప్పటిదాకా లైట్ తీస్కో.
అరుంధతి: లేదండి. సార్ చెప్పింది కూడా కరెక్ట్. నాకు కూడా ఫ్రీగా తిని కూర్చోడం అస్సలు నచ్చదు.
నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. నాకు కొద్దో గొప్పో వంటలు తెలుసు అండి.
శ్రీదేవమ్మ: నీ ఇష్టం అమ్మ. మా ఇంట్లోని పెద్దాయనకి బయట వాళ్లు వండితే నచ్చదు. అందుకే మా చేతే వండిస్తారు.
దేవకి: అం... అంటే..
అని ఒక్కసారిగా ఇద్దరూ ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటారు. ఇద్దరి మోకాళ్ళో చిన్న స్మైల్ వస్తుంది.
అరుంధతి తన స్లీవ్స్ పైకి జరుపుకొని పైటను నడుముకి కట్టుకుంటుంది.
అరుంధతి: మీరు 3 రకాల ఆకు కూరలు, 2 రకాల నాన్వెజ్ వండుతున్నారా?
దేవకి: అవున్రా. పిల్లలకు చికెన్ అంటే ఇష్టం. అందుకే 2 వెరైటీస్ చేద్దామని అనుకుంటున్నాం. నీకెలా తెలుసు?
మేమింకా చికెన్ కడగను కూడా లేదు.?
అరుంధతి: సింపుల్! చెస్ట్ పిస్లు వేరుగా, లెగ్స్ పీసెస్ వేరుగా ఉంచారుగా? అందుకే అలా అనుకున్నాను. మీరు అడిగిన ప్రశ్న వల్ల కాన్ఫర్మ్ అయింది.
శ్రీదేవమ్మ: హహహ... నువ్వు అచ్చం మా ఆయన లాగే మాట్లాడుతున్నావమ్మా. ఆయనా అంతే. నా చిన్న కొడుకు కూడా అంతే.
అని చిన్నగా నవ్వుతుంది.
అరుంధతి:...