దేవకి: నా ఈ బ్యూటిఫుల్ ప్రపంచంలో నువ్వు కూడా మెంబర్ అయితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ.
అని స్మైల్ చేస్తూ అరుంధతి చెయ్యి పట్టుకుంటుంది.
అరుంధతి:....
దేవకి: నువ్వు సమయానికి అత్తయ్య గారిని కాపడలేకుంటే..
నా ఈ అందమైన ప్రపంచం వెళుతురిని కొలిపోయి ఉండేది.
నీ మేలు ఎలా తీర్చుకోవాలో మాకు తెలీదు.
అందుకే నిన్ను మాలో ఒకరిగా చేసుకుందామని ఆశ పడుతున్నాం.
నువ్వు మాలో ఒకరైతే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే.
ఇదిగో ఇవి తీస్కో. ఫ్రెషప్ అయి ఇవి వేసుకుని కిందకురా. అందరం కలిసి భోం చేద్దాం. ఓకే?
అండ్..
వన్ మోర్ రిక్వెస్ట్..
నేను నిన్ను అరూ అని పిలవొచ్చా? ప్లీస్
అని క్యూట్గా అడుగుతుంది.
అరుంధతి చిన్న స్మైల్ ఇచ్చి సరే అని తల ఊపుతుంది.
దేవకి: ఓకే అరు! ఇక నుంచి ఇది నీ రూం.
ఫ్రెషప్ అయి త్వరగా కిందకి వచ్చే?!
నేను వెళ్లి అత్తయ్య గారికి వంటల్లో హెల్ప్ చేస్తుంటాను. ఓకే?!
అరుంధతి సరేనని తల ఊపుతుంది.
దేవకి పెద్దగా స్మైల్ చేస్తూ హడావిడిగా వంట గదికి వెళ్లి శ్రీదేవమ్మకి వంటల్లో సహాయం చేస్తుంది.
***
అరుంధతి: హ్మ...
ఈ ఫ్యామిలీ కుంచం తేడాగానే ఉంది.
కానీ నేను చూసిన వాళ్ళలో 1% అంత కూడా కూడా లేరు.
మా నాన్నను చంపింది ఎవరెవరో ఇక్కడే ఉండి
తెలుసుకుంటా!
ఆయనకు నాకూ మధ్యలో ప్రేమ ఆప్యాయతలు లేకున్నా నన్ను కని పెంచిన రుణం మర్చిపోలేనుగా?!
అని దీర్గంగా ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే ఆమె చూపు వేరొక వైపుకు మళ్ళుతుంది.
ఆమె ఎదురుగా తలుపు బయట రాజా నిలబడి ఉంటాడు.
వాళ్ళిద్దరి చూపులు లాక్ అవుతాయి.
రాజ: హ్మ్...
రాజ ఒక IPS ఆఫీసర్. అతను మైండ్ రీడింగ్లో ఎక్స్పర్ట్ కూడా.
కళ్ళలోకి చూసి వాళ్ళ చిట్టా మొత్తం విప్పగలిగే టాలెంటెడ్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.
రాజ గదిలోకి నడుచుకొని వెళ్లి ఆమె ఎదురుగా
నిలబడుతాడు.
అతను లోపలకు రావటం చూసి అరుంధతి మొహమాట పడుతూ లేచి నిలబడుతుంది.
అరుంధతి: అం.. సార్.. మీరు.. ఇక్కడ...
అని తడబడుతూ మాట్లాడుతుంది.
రాజ తన దెగ్గరకు వెళ్లి ఆమెను కళ్ళలోకి చూసి మైండ్ రీడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
అరుంధతి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అరుంధతి: సార్.. మీరు ఏం చేస్తున్నారు?..
ఎవరైనా చూస్తే బాగోదు.. సార్..
రాజ: ఇంట్రెస్టింగ్..
అని చిన్న గొంతుతో చెబుతూ స్మైల్ చేస్తాడు.
రాజ: నా ఇంట్లో, నా గదిలో, నాకు కాబోయే పెళ్ళాంతో నేనుంటే నాకెవరు అడ్డు చెప్తారు?!
అంత ధైర్యం ఎవరికుంది??!!
అని చెబుతూ విలన్లా స్మైల్ చేస్తాడు.
అరుంధతి:.... పెళ్ళామా?.. నేనా?.. మీకా?..
అని అమాయకంగా చూస్తుంది.