Chapter 8 - 8

బాత్రూం డోర్ వేసుకొని, స్నానం చేసి, రెడీ అయ్యి బెడ్రూం డోర్ తెరుస్తుంది.

ఇద్దరు చిన్న పిల్లలు తలుపు బయట నిలబడి ఉంటారు.

అరుంధతి: పిల్లలు?

పాప: ఎవరు ఆంటీ నువ్వు?

బాబు: ఆ... ఆంటీ చూడటానికి చాలా బాగుంది.

పాప: నోరు ముస్తావా?! ముందు ఆంటీ ఎవరో చెప్పని!!

బాబు: సరే..

అని మూడ్ ఆఫ్ అవుతాడు.

పాప: నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి! నాకు ఓకే కొషన్ రెండు సార్లు రిపీట్ చేయడం అస్సలు నచ్చదు!

అని సూటిగా అడుగుతుంది.

అరుంధతికి ఆ పాప ఒక చిన్ని పిల్లి పిల్లలా కనిపిస్తుంది.

బాబు ఏమో తోక వంచుకొని ఉన్న కుక్క పిల్లలా కనిపిస్తాడు.

ఆమె చిన్నగా నవ్వుకుంటుంది.

అరుంధతి: ఫ్ఫ్... హహహహ....

పాప: ఎందుకు నవ్వుతున్నావ్? నేను జోక్ ఏం వేయలేదు!

బాబు: అక్క.. కోప్పడకు!.. మమ్మీకి తెలిస్తే తిడుతుంది.

పాప: ఏం కాదు! ఇది మన ఇల్లు! ఈ ఆంటీనే స్ట్రెంజర్! మన పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చింది. డీటెయిల్స్ అడగటంలో తప్పు లేదు!

బాబు: అయినా సరే...

పాప: నువ్వుండ్రా! చెప్పండి ఆంటీ! ఎవరు నువ్వు!?

అరుంధతి: ఓకే! ఓకే!!

అంటూ నవ్వుతూ ఆమె మోకాళ్ళ మీద కూర్చుంటుంది.

అరుంధతి: నా పేరు అరుంధతి. మీ ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ని.

కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండమని మీ నాన్నమ్మ, అమ్మ చెప్పారు.

నాకు మీ ఇద్దరూ కనిపించలేదు. అందుకే పర్మిషన్ తీసుకోకుండా ఉన్నాను.

ఇఫ్ యు డోంట్ మైండ్..

నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా బ్యూటిఫుల్ బేబీ.

అని స్వీట్ గొంతుతో అడుగుతుంది.

బాబు: ఆ.....

అని షాక్ తో పెద్దగా నోరు తెరుస్తాడు.

పాప: నన్ను బ్యూటిఫుల్ బేబీ అన్నవా నువ్వు?..

అరుంధతి: ఓ... నేను తప్పుగా ఏమైనా అన్నానా?

నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నవని బ్యూటిఫుల్ బేబీ అన్నాను.. ఐమ్ చో చోరీ...

పాప: ఎందుకు సోరీ? నువ్వు చెప్పింది నిజమే ఆంటీ! నేను బ్యూటిఫుల్ గానే ఉంటాను. హిహి..

బాబు: పొగిడితే చాలు.. కరిగిపోద్ది...

అని చిన్న గొంతుతో గొనుక్కుంటాడు.

పాప: ఏదో అంటున్నావ్?

అని ఉరిమి చూస్తుంది.

బాబు: ఏం లేదు! ఏం లేదు!!

అని టెన్షన్ పడుతాడు.

అరుంధతి: హహహ... బ్యూటిఫుల్ బేబీస్.

మీ బ్యూటిఫుల్ నేమ్స్ నాకు చెప్తారా?

పాప: నా పేరు లహరి.

బాబు: నా పేరు వాసు.

అరుంధతి: aw... మీలాగే మీ పేర్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.

పాప: హ్మ్!! కచ్చితంగా! హిహిహి...

బాబు: థాంక్స్ ఆంటీ. హహహ..

అరుంధతి: ఇంకేంటి? కిందకు బయలుదేరుదమా?

పాప:.....

బాబు:....

అరుంధతి: ఏమైంది? ఏమైనా ప్రాబ్లెమా?