Chapter 7 - 7

రాజ: నా ఇంట్లో, నా గదిలో, నాకు కాబోయే పెళ్ళాంతో నేనుంటే నాకెవరు అడ్డు చెప్తారు?!

అంత ధైర్యం ఎవరికుంది??!!

అని చెబుతూ విలన్లా స్మైల్ చేస్తాడు.

అరుంధతి:.... పెళ్ళామా?.. నేనా?.. మీకా?..

అని అమాయకంగా చూస్తుంది.

రాజ: ఏం? నేను నీకు నచ్చలేదా? హ్మ్?

అని ఆమె దెగ్గరికెళ్లి చెవిలో చిన్న గొంతుతో అడుగుతాడు.

సిగ్గుతో అరుంధతి బుగ్గలు ఎర్రబడుతాయి.

ఆమె సిగ్గు పడుతూ మొఖం దాచుకుంటుంది.

రాజ ఆమె ఎకస్ప్రెషన్స్ను సీరియస్ మొఖంతో గమనిస్తూ ఉంటాడు.

ఆమె చూపుని అతని వైపు తిప్పగానే అతని ఎకస్ప్రెషన్స్ నార్మల్గా పెడతాడు.

అరుంధతి: అంటే.. మనం మొదటిసారి కలిసింది ఈ రోజే కదా..

నాకు మిమ్మల్ని అర్ధం చేసుకోవడానికి టైం పడుతుంది సార్..

అని తల దించుకొని సిగ్గు పడుతూ చెబుతుంది.

రాజ: హ్మ్... సరే మరి. కింద వెయిట్ చేస్తుంటాం ఫ్రెషప్ అయి త్వరగా రా!

అని చెప్పి వెళ్ళిపోతాడు. అతని మొఖం నార్మల్ స్మైల్ నుంచి సీరియస్ మోకానికి క్షణంలో మారిపోతుంది.

రాజ: ఈ అమ్మాయి రియల్ చారెక్టర్ నాకు అర్థం కావట్లేదు.

ఎవరిది?! త్వరలో నీ నిజస్వరూపం తెలుసుకొని మెడపట్టుకొని నేనే ఊసులు లెక్కపెట్టేలా చేస్తా!!

వెయిట్ అండ్ సీ!!

అని ఆలోచిస్తూ వెళ్తాడు.

అరుంధతి అతను బయటకు మెట్లు దిగి వెళ్ళిపోగానే సిగ్గు పడుతున్న ఎక్స్ప్రెషన్స్ నుంచి సీరియస్ మోకానికి వచ్చేస్తుంది.

అరుంధతి: నీకంత సీన్ లేదు డార్లింగ్.

అని ఆలోచిస్తూ విలన్లా స్మైల్ ఇస్తుంది.

రాజ ఒక IPS ఆఫీసర్. అతను ఖైదీలను ఇన్వెస్టిగేట్ చేయడంలో, మైండ్ రీడింగ్లో ఎక్స్పర్ట్.

కళ్ళలోకి చూసి వాళ్ళ చిట్టా మొత్తం విప్పగలిగే టాలెంటెడ్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.

కానీ...

అతను ఎంత ప్రయత్నించినా అరుంధతి మైండ్ మాత్రం రీడ్ చెయ్యలేక పోతాడు.

కారణం...,

అరుంధతి: నువ్వు కళ్ళలోకి చూసి మైండ్లో ఉన్నవి చదివితే,

నేను ఊపిరితోనే పేగులు లెక్క పెట్టే రకం.

నాతో ఇంత కిరికిరి నీ లెవెల్కి తగింది కాదు.

నువ్వు పుస్తకాలు పట్టుకున్న వయసులో నేను గన్నులు, బాంబులతో ఆడుకునే దాన్ని డార్లింగ్.

నా ముందు నువ్వు పోసులు కొడుతుంటే నాకు నవ్వొస్తోంది.

అని ఆలోచిస్తూ స్మైల్ చేస్తూ ఉంటుంది.

బాత్రూం డోర్ వేసుకొని, స్నానం చేసి, రెడీ అయ్యి బెడ్రూం డోర్ తెరుస్తుంది.

ఇద్దరు చిన్న పిల్లలు తలుపు బయట నిలబడి ఉంటారు.

అరుంధతి: పిల్లలు?