అరుంధతి: హ్మ్... మా నాన్నను ఎన్కౌంటర్ చేసింది వీడా?! ఎవరీడు?
"మేడం, వీడొక IPS ఆఫీసర్. వయసు 28. హయిట్ ఆరున్నార అడుగులు. బరువు 80 కేజీలు."
అరుంధతి: హ్మ్... కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. విడినేనా నేను చంపాల్సింది?..
"మేడం, వీడికి ఒక పెద్ద కుటుంబమే ఉంది. వీడు..."
అతను మాట్లాడుతూ ఉండగా ఆమె దృష్టి మరో వైపు మళ్ళుతుంది.
దూరంలో ఒక లారీ దారి తప్పి స్పీడుగా వస్తూ ఉంటుంది. డ్రైవర్ బయటకు దుకేసి ఉంటాడు.
ఒక 45 ఏళ్ళ వయసు గల ఆవిడ ఒంటరిగా రోడ్డు దాటుతూ ఉంటుంది.
అరుంధతి లారి వేగాన్ని, ఆవిడకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కాల్క్యూలేట్ చేస్తుంది.
మరో 2:23 నిమిషాలలో లారీ ఆమెను గుద్దేస్తుందని అర్ధం చేసుకుంటుంది.
అరుంధతి ఒక డాన్. ఆమె చిన్నప్పటి నుంచి స్ట్రిక్టుగా తీసుకున్న ట్రైనింగ్ వల్ల చీమ చిటిక వేసినా ఆమెకు వినిపిస్తుంది. చాలా దూరం వరకూ అన్నీ స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ పెద్దావిడని ఎవరూ గమనించలేదు. ఆమె చూసి కూడా పట్టించుకోకుంటే ఆవిడ చనిపోతుందని జాలి పడుతుంది.
ఆవిడ మంచి వ్యక్తి అని ఒక్క చూపుతోనే అర్థం చేసుకుంటుంది.
అరుంధతి: డిటేల్స్ మళ్ళీ వింటాను! ఉండు!
అని చెప్పి, వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్లి
అరుంధతి: అదొక పెద్ద లారీ! దాని వేగం, డిస్టెన్స్ కాల్క్యూలేట్ చేస్తే ఆ పెద్దావిడే కాదు! చుట్టు పక్కల ఉన్న వాళ్ళతో సహా, చిన్న పిల్లలు కూడా గాయపడుతారు.. నేను ఎలాగయినా ఆపాలి!..
అని అనుకుంటూ పరిగెత్తుకొని వెళ్లి ఆటోల మీద ఎక్కి, అలా ఒక్కో ఫాస్ట్ వెహికల్ మీదకు దూకి లాస్ట్గా ఆ లారీ వెనుక ఎక్కుతుంది.
వేగంగా తాడ్లు పట్టుకొని వేలాడుతూ వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది.
అరుంధతి: దీని బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి..
లారీ ఎదురుగా ఆ పెద్దావిడ నిలబడి ఉంటుంది.
"అమ్మ!....."
అని పిలుస్తూ ఆవిడను కాపాడటానికి పరిగెత్తుకుంటూ వస్తాడు.
ఆమెను గుద్దడానికి క్షణాల ముందు స్టీరింగ్ తిప్పేస్తుంది.
"అమ్మ! నీకేం కాలేదుగా? అమ్మ..?"
అని కంగారుగా అడుగుతాడు.
ఆమెకు ఏం కాలేదని కంఫర్మ్ చేసుకుంటాడు.
"అన్నయ్య! ఒదిన! అమ్మ, మీరూ జాగర్త! ఇప్పుడే వస్తాను!"
అని చెప్పి ఆ లారీ వైపుగా పరుగులు తీస్తాడు.
అతనికి దెగ్గరలో మరో పెద్ద లారీ కనిపిస్తుంది. దాన్ని ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెనకే ఫాలో చేస్తాడు.
ఆమె లారీని వేరే దిక్కుగా తిప్పి ఊరి చివర ఉన్న ఖాళీ ప్రదేశానికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.
అరుంధతి: ఇక్కడ ఎవరూ లేరు. బండిని వదిలి బయటకి దుకేస్తే నా చెయ్యి, కాలు ఒకటయినా ఫ్రాక్చర్ అవుతుంది!
మా నాన్న కోసం రివెంజ్ తీర్చుకోకుండా నేను గాయపడకూడదు.
దెగ్గరలో ఏదయినా నది ఉంటే అందులో తీసుకెళ్లి వదిలేద్దాం అంటే నాకు ఈ ఊరు కొత్త!
లేకుంటే ఫ్యూయల్ అయ్యే వరకూ మనుషులు తిరగని ప్లేస్ లో బండిని తిప్పుతూ ఉందాం.
హ్మ్..?
అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు అద్దంలో వెనుక నుంచి మరో లారీ ఫాలో కావడం కనిపిస్తుంది.
ఆమె బయటకు తొంగి చూస్తుంది. ఒక వ్యక్తి తన వైపుగా డ్రైవ్ చేసుకుంటూ పక్క పక్కనే ఉండుంటాడు.
అతను ఎటో దారి చూపిస్తూ ఉంటాడు. అతను వెళుతున్న దారిగానే ఆమె డ్రైవ్ చేస్తూ ఉంటుంది.
కాసేపటికి దూరంలో రోడ్డు చివర టర్నింగులో ఒక నది కనిపిస్తుంది.
ఆమె అతని వైపుగా చూపు తిప్పుతుంది.
అతను ఒక చేతిని స్టిరింగ్ పైన మరో చేతిని ముందుకు చాపి లారీ పక్కనే డ్రైవ్ చేస్తాడు.
ఆమె అతని ఇంటెన్షన్ చెప్పకుండానే అర్ధం చేసుకుంటుంది.
ఆమె లారిని నేరుగా వెళ్లేలా వదిలేసి బయటకు దూకి అతని చేతిని పట్టుకుంటుంది.
అతను వేగంగా లోపలికి లాగుతాడు. ఆమె అతన్ని కౌగిలించుకుంటుంది.
టర్నింగ్ వచ్చే క్షణం ముందు అతను వెంటనే గట్టిగా బ్రేక్ వేస్తాడు.
వెంటనే పక్కనున్న లారీ నదిలోకి ఎగురుతూ వెళ్లి మునిగి పోతుంది.
ఇద్దరూ ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే ఒకరిని ఒకరు చూసుకుంటారు.
ఆమె నమ్మలేక పోతుంది.
రాజ: మా అమ్మని, మిగతా వాళ్ళని సమయానికి వచ్చి కాపాడినందుకు థాంక్స్!
అరుంధతి:....
ఆమె ఎవరినైతే చంపాలని వచ్చిందో అతనే ఆమె ప్రాణాలు కాపాడటం విధి ఆడిన వింత నాటకమని అనుకుంటుంది.