అరుంధతి:???
దేవకి: అరుంధతి!! ఐమ్ వెరీ హ్యాపీ!!
అరుంధతి: హా!!??
దేవకి: నీకు నా గురించి తెలీదు కదా? చెప్తా విను.
నా పేరు దేవకి. నాకు ఊహ తెలీక ముందే నా పేరెంట్స్ కార్ ఆక్సిడెంట్లో చనిపోయారు.
నాకు చెప్పుకొదగ్గ బంధువులు కూడా లేరు. నాకు 14 ఏళ్ళు వచ్చే వరకూ ఆర్ఫనేజ్లో పెరిగాను.
10th అయిపోయాక స్కాలర్షిప్ తో బయటకు వచ్చాను.
అలా పోల్టెక్నిక్ చదివే తప్పుడు మా హస్బెండ్ కలిశారు.
ఆయనకు చాలా సిగ్గు తెలుసా? హహహ... ఎప్పుడూ చాటుగా చూసి సిగ్గు పడుతూ ఉండే వారు.
అలా 2 yrs చిన్న మాట కూడా మాట్లాడటానికి ధైర్యం చెయ్యలేదు.
సరేలే ఒకసారి పలకరిద్దాం అని దెగ్గరికెళ్లి హై చెప్పాను అంతే.
పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నేను పెద్దగా ఆలోచించలేదు. సరే అన్నాను.
తనే నా చదువు అయ్యాక వాళ్ళ పేరెంట్స్ తో పరిచయం చేపిస్తాను అన్నారు. సరే అన్నాను.
చదువు కంప్లీట్ అయ్యాక తన ఇంటికి తీసుకోని వెళ్ళాడు. తన ఇంట్లో ఒప్పుకోరని అనుకున్నాను. చాలా భయపడ్డాను.
కొత్త చోటు, కొత్త మనుషులు, కొత్త జీవితం..
నేను వీళ్ళలో ఒకరిగా ఉండటానికి అర్హురాలినేనా అని అనిపించింది.
కానీ, ఈ ఇల్లు. ఇంట్లోని మనుషులను చూసాక నా మనసు మార్చుకున్నాను.
నాలాంటి అనాధని తీసుకొచ్చి కోడల్ని చేసుకున్నారు. ఏనాడూ నన్ను దెప్పి పొడవటం, చిన్న చూపు చూడటం లాంటివి చేయలేదు.
నాకు ఇక్కడ అలవాటు అవ్వడానికి చాలా టైమే పట్టింది.
నా హస్బెండ్ నాకు పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చారు. పై చదువులు, లైఫ్ గోల్స్ ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తా అన్నారు.
అత్తయ్యగారు నన్ను తన సొంత కూతురిలా ప్రేమగా చూసుకుంటున్నారు.
మామయ్యగారు పైకి కటువగా కనిపించినా తన సొంత కూతురిని చూసుకున్నట్టే చూసుకున్నారు.
నా హస్బెండ్ కి చెప్పాను. నా లైఫ్ గోల్, డ్రీం ఒకటేనని.
ఫ్యామిలీ..
నాకంటూ ఒక మంచి ఫ్యామిలీ దొరకాలని ఎప్పుడూ దేవుడిని కోరుకునే దాన్ని.
ఆ విష్ మీ వల్ల నెరవేరింది అని. నాకు ఫ్యామిలీ తప్పా ఇంకేమొద్దని ఇంటినే నా ప్రపంచం చేసుకున్నాను.
ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పాపేమో 5th, బాబేమో 3 క్లాస్ చదువుతున్నాడు.
నా అత్తే మా అమ్మ..
నా మమ్మయ్యే నాకు నాన్న..
నా హస్బెండ్ నా బెస్ట్ ఫ్రెండ్..
నా మరిది నా పెద్ద కొడుకు..
నా పిల్లలే నా జీవితం..
నా కుటుంబమే నా ప్రపంచం..
నా ఈ బ్యూటిఫుల్ ప్రపంచంలో నువ్వు కూడా మెంబర్ అయితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ.
అని స్మైల్ చేస్తూ అరుంధతి చెయ్యి పట్టుకుంటుంది.
అరుంధతి:....