Chapter 4 - 4

రెడ్డయ్య: అడుగుతుంది మిమ్మల్నే! నోర్లు పడిపోయాయా?!

అని గట్టిగా అరుస్తాడు.

అరుంధతి: ముసలోడు స్పీకర్ మింగేసినట్టున్నాడు. అలా అరుస్తున్నాడేంటి?!

అని మనసులో అనుకుంటుంది.

°°°

రాజ: డాడీ ప్లీస్ కాల్మ్ డౌన్. జరిగింది అంతా నేను చెప్తాను.

అసలేం జరిగిందంటే...

....

•••

అదీ డాడీ జరిగింది. ఈ అమ్మాయి అమ్మని కాపాడిందని అమ్మ తనని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది.

రెడ్డయ్య:..... హ్మ్... మీరంతా లోపలకి వెళ్లి రెస్ట్ తీస్కోండి.

మిగతా విషయాలు రేపు డిస్కస్ చేద్దాం.

అతని ఆర్డర్స్ విని అందరూ త్వర త్వరగా లోపలకి వెళ్ళిపోతారు.

శ్రీ దేవమ్మ: ఆయన మనసు మార్చుకోక ముందే త్వరగా వెళ్దాం పదమ్మా!..

అరుంధతి:.....?

ఆవిడ అరుంధతి చెయ్యి పట్టుకొని కొత్త రూంలోకి తీసుకోని వెలుతుంది.

దేవకి: అరుంధతి. నువ్వేం మొహమాట పడొద్దు. మాతో ఫ్రీగా ఉండు. ఓకే?

అరుంధతి: సరేనండి..

దేవకి: ఇంకా అండి గిండి ఏంటి? నన్ను ఒదిన అని పిలుపు!

అరుంధతి: ఒదిన?..

శ్రీదేవమ్మ: నువ్వు మాకు చాలా బాగా నచ్చేశావమ్మా.

ఎంత అందంగా ఉన్నవో... రెండు కళ్ళు సరిపోవట్లేదు.

నా చిన్న కొడుకు రాజా నీకు నచ్చాడా?

అని ఆతృతగా అడుగుతుంది.

దేవకి: మా రాజా చూడటానికి భయపెట్టేలా ఉన్నా చాలా మంచి వాడమ్మా. నిన్ను బాగా చూసుకుంటాడు.

మేమూ నిన్ను బాగా చూసుకుంటాం.

చెప్పరా నీకు మా రాజా నచ్చాడా?

అని ఫ్రెండ్లీగా అడుగుతుంది.

అరుంధతి: టోటల్ ఫ్యామిలీకి నట్టు లుసా? ఎవరో ఏంటో తెలీకుండా ఇంటికి తీసుకొచ్చి కొడుక్కి పెళ్లి చేస్తామంటున్నారు? అదీ నేను చంపడానికి వచ్చిన వాడినే?..

ఒకడేమో లౌడ్ స్పీకర్, వాళ్ళ ఆవిడేమో బ్రెయిన్లేస్.

పెద్దోడేమో సైలెంట్ కింగ్, వాళ్ళ ఆవిడేమో వాగుడుకాయ.

చిన్నోడేమో గండు పిల్లి.. అంటే నేనేంటి? ఎలక?..

అని ఆలోచిస్తూ ఉంటుంది.

శ్రీదేవమ్మ: ఇప్పుడే చెప్పక్కర్లేదులే. కొన్ని రోజులు మాతోనే ఉండి మాలో ఒకరిగా ఉండి చూడు.

మేము అందరం నచ్చితే నీ ఒపీనియన్ చెప్పు. ఓకే?

దేవకి: అదీ కరెక్టే!! నీకు రాజా ఒకడే నచ్చితే సరిపోదు. మేము అందరమూ నచ్చాలిగా?!

శ్రీదేవమ్మ: అయ్యోరామా! టైం చూడు ఎంత అయిపోయిందో!!

భోజనాలకి టైం అవుతోంది. దేవి, మన అరుంధతికి నీ డ్రెస్ ఇచ్చి ఫ్రెషప్ చేయించమ్మ.

నేను వెళ్లి వంట సంగతి చూసుకుంటాను.

మళ్ళీ లేట్ అయితే మీ మామయ్యగారు గొప్పడుతారు.

దేవకి: అలాగే అత్తయ్యగారు. మీరు అరుంధతిని నాతో వదిలేసి ధైర్యంగా వెళ్ళండి. నేను చూసుకుంటాను.

శ్రీదేవమ్మ: సరేమ్మ!!...

అని చెప్పి హడావిడిగా గది నుంచి బయకు వెళ్లి నేరుగా వంట గదికి వెళ్తుంది.

అరుంధతి: ఇప్పుడు మా చుట్టూ ఎవ్వరూ లేరు కాబట్టి ఈ అమ్మాయి తన నిజస్వరూపానికి వస్తుంది. చూద్దాం ఈమె ఆటిట్యూడ్ ఎలా ఉంటుందో...

అని మనసులో అనుకుంటుండగా, దేవకి అరుంధతి చేతిని పట్టుకొని తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెడుతుంది.

అరుంధతి:???

1