Chapter 3 - 3

అరుంధతి అతన్ని దీర్గంగా చూస్తుంది.

అరుంధతి: నేను ఎవరి ప్రాణం తీద్దామని వచ్చానో ఆ వ్యక్తే నా ప్రాణం కాపాడటం...

అని ఆలోచిస్తుంటుంది.

ఆమె కళ్ళు రాజ కళ్ళలో లాక్ అయుంటాయి.

రాజ ఆమెను పట్టించుకోకుండా లోరిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి సేమ్ ప్లేసులో ఆపుతాడు.

అతను లారీ దిగి, ఆమెను దిగమని చెయ్యి ఇస్తాడు.

ఆమె చెయ్యి పట్టుకొని కిందకు నిదానంగా దిగుతుంది.

శ్రీ దేవమ్మ కంగారుగా పరిగెత్తుకుని వస్తుంది.

శ్రీ దేవమ్మ: రాజా? బాబూ!! నీకేం కాలేదు కదరా?! దెబ్బలేం తగల్లేదుగా? చెప్పూ?.. ఎక్కడికెళ్లావ్?..

అని కంగారు పడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.

రాజ: అమ్మ! నాకేం కాలేదు. బాగున్నాను. ఇక్కడే ఉండటం మంచిది కాదు. ఇంటికెళ్లి తిరిగ్గా మాట్లాడుకుందాం పదమ్మా.

అని మృధువైన గొంతుతో చెబుతాడు.

రాఘవ: రాజా నిజంగానే నీకేం కాలేదు కదా?! లేకుంటే మేము కంగారు పడతామని అలా అంటున్నావా?

అని కంగారు పడుతూ అడుగుతాడు.

రాజ: లేదన్నయ్య! నిజంగానే ఏం కాలేదు.

దేవకి: ఒకసారి హాస్పిటల్కి వెళ్లి వద్దాం రాజా! అప్పటిదాకా మాకు భయం పోదు!

అని కంగారు పడుతూ అడుగుతుంది.

రాజ: అదేం అక్కర్లేదు ఒదిన. చూడండి నాకు చిన్న దెబ్బ కూడా తగల్లేదు.

దేవకి: అవును, ఆ అమ్మాయి ఎవరూ?

రాఘవ: నేను కూడా అదే ఆలోచిస్తున్నాను.

శ్రీ దేవమ్మ: ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? నీతో పాటుగా బండి నుంచి దిగింది? చూడటానికి చాలా అందంగా ఉంది.

అని అరుంధతినే ఆతృతతో చూస్తారు.

రాజ: నాకూ తెలీదమ్మా. ఇందాక ఆక్సిడెంట్ కాకుండా అందరినీ తనే కాపాడింది.

రాఘవ: హా?!

దేవకి: అంటే.. ఇందాక ఆ లారీ తోలింది...

రాజ: ఆ లారీ బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవర్ బయటకు దూకేసాడు. అది అమ్మని గుద్దబోతే ఆ అమ్మాయే లారీ ఎక్కి దారిని మార్చి అమ్మని కాపాడింది.

శ్రీదేవమ్మ: హా? అవునా?! దేవుడే నిన్ను మా కోసం పంపినట్టు ఉన్నాడు తల్లీ. నీ పేరేంటమ్మా?

అని ప్రేమగా అడుగుతుంది.

అరుంధతి: నా పేరు అరుంధతి అండి.

అని వినయంగా నమస్కరించి చెబుతుంది.

శ్రీదేవమ్మ: అవునమ్మా, మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? పెళ్ళీడు వచ్చిన పిల్లలా ఉన్నావు. నీకు పెళ్లి సంబంధలేమైనా చూస్తున్నారా?

రాజ: అమ్మా...

అని తల పట్టుకుంటాడు.

అరుంధతి: లేదండి. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్నగారు ఈ మధ్యే ఆక్సిడెంట్లో పోయారు. నాకు బంధువులు కూడా ఎవరూ లేరు. అందుకే ఊరు వదిలి నిన్నే వచ్చాను. ఇంతలో అన్నీ జరిగిపోయాయి.

అని తెలివిగా సమాధానం ఇస్తుంది.

రాఘవ: అరెరే...

దేవకి: పాపం..

శ్రీదేవమ్మ: అయ్యో... చిన్న వయసులో ఎన్ని కష్టాలుచడమ్మా నీకూ..

ఏమనుకోనంటే మా ఇంటికి వస్తావా? కొన్ని రోజులు మాతోనే ఉండి వెల్దువు.

రాజ: అమ్మ...

శ్రీదేవమ్మ: నువ్వుండరా! నువ్వు చెప్పమ్మా! మాతో ఇంటికి వస్తావా?

దేవకి: అవునమ్మా. మాతో కలిసి కొన్ని రోజులు ఉండరాదు? నీకు నచ్చినన్నాళ్ళు ఉండు. నీకు నచ్చినప్పుడు వెళ్ళు.

అరుంధతి: నేను ఎలాగో వీళ్ళ గురించి తెలుసుకోవాలి. మా నాన్న చావుకి వెనుక ఎవరెవరు ఉన్నారో వీడి ఇంట్లో ఏమైనా సాక్ష్యం దొరకొచ్చేమో.

అని ఆలోచిస్తుంది.

రాజ వాళ్ళ అమ్మను పక్కకు తీసుకెళ్లి చిన్నగా మాట్లాడుతాడు.

రాజ: అమ్మ. ఎవరో ఏంటో తెలీకుండా ఇంట్లోకి ఎలా రానిస్తవమ్మా?

శ్రీదేవమ్మ: పాపం ఒంటరి ఆడపిల్లరా! అందులోనూ మనకు చాలా పెద్ద సహాయం చేసింది! తను సమయానికి వచ్చి కాపడకుండా ఉండుంటే నేను చనిపోయి గంట అయుండేది.

అందులోనూ ఆ అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంది. ఇక నుంచి మనతోనే ఉంటుంది.

రాజ: అమ్మ... నీకెలా చెప్పనమ్మ.. నేను ఐపీయస్ అన్న విషయం ఎవరికీ తెలికూడదు. నేనొక ఇంపార్టెంట్ కేస్ డీల్ చేస్తున్నానమ్మ. బయట వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం.

శ్రీదేవమ్మ: నువ్వుండరా! ఆ పిల్లని చూడు! ఎంత అమాయకంగా ఉందో! చాలా మంచి పిల్లలా ఉందిరా! బదులుగా ఏం ఆశించకుండా మనకు ఇంత పెద్ద సాయం చేసింది. అలా ఎలా వదిలేయమంటావ్?

నువ్వు కనుక దీనికి ఒప్పుకోకుంటే నేను నీతో మాట్లాడను చెప్తున్నా!

అని అలుగుతుంది.

రాజ: అమ్మ... సరే.. నీ ఇష్టం అమ్మ..

అని దిగులుతో చెబుతాడు.

శ్రీదేవమ్మ: నా బంగారు కొండ!!

అని చెప్పి చిన్నపిల్లాడిని బుజ్జగించినట్టు అతని బుగ్గలు లాగుతుంది.

***

శ్రీదేవమ్మ: అరుంధతి. చెప్పమ్మా, మాతో ఇంటికి వస్తావా?

దేవకి: మాలో ఒకరిగా చూసుకుంటాం. కాదనకమ్మా.

అరుంధతి: మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి కొన్ని రోజులు వరకూ ఉంటాను.

అని మొహమాట పడుతూ చెబుతుంది.

శ్రీదేవమ్మ, దేవకీ చాలా సంతోష పడుతారు.

@@@@

అందరూ ఇంటికి చేరుకుంటారు.

వాళ్ళ ఇల్లు చూడటానికి పెద్ద బంగాళాలా ఉంటుంది.

చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది. అందులో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు చాలానే ఉంటాయి.

పని వాళ్ళు అన్నిటిని చూసుకుంటూ నీళ్లు పోస్తూ, శుభ్రం చేస్తూ ఉంటారు.

ఐదుగురు కలిసి ఇంట్లోకి వెళ్తారు.

రెడ్డయ్య కోపంతో పని వాడ్ని తిడుతూ ఉంటాడు.

రెడ్డయ్య: ఎంత ధైర్యం ఉంటే అన్నం పెట్టే ఇంటికే కన్నం వేస్తావ్!! విశ్వాసం లేని కుక్క!

పనివాడు: క్షమించండయ్య! ఇంకోసారి ఎప్పుడూ ఇలా చెయ్యనయ్య. క్షమించండయ్య!..

అని రెడ్డయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంటాడు.

రెడ్డయ్య: క్షమించడమా?! నేనొక జడ్జని! తప్పు చేసిన వారిని శిక్షించడమే నేను ఇచ్చే తీర్పు!

రేయ్! వీడ్ని తీసుకెళ్లి దొంగతనం కింద కేస్ రాసి జైల్లో పడేయండి!

వీడికి బుద్దోచ్చె వరకూ ఎవరినీ బైల్ ఇవ్వొద్దని చెప్పండి!

లాయర్: ఓకే సార్.

కొందరు పనివాళ్ళు వచ్చి అతన్ని ఈడ్చుకొని వెళుతారు.

రెడ్డయ్య కోపంతో పక్కకు తిరిగి చూస్తాడు.

ఇదిరుగా ఐదుగురు నిలపడి ఉంటారు. నలుగురూ అతన్ని తడపడుతూ చూస్తుంటారు.

అరుంధతి: హ్మ్?.. ఏమైన్ది వీళ్ళకి? ఆగిపోయారు?

రెడ్డయ్య: ఎవరమ్మాయి?! ఎందుకొచ్చింది?! హా?!

అని కోపంగా అడుగుతాడు.

శ్రీ దేవమ్మ: అది.. ఏవండీ...

దేవకి: మావయ్యగారు...

రెడ్డయ్య: అడుగుతుంది మిమ్మల్నే! నోర్లు పడిపోయాయా?!

అని గట్టిగా అరుస్తాడు.

అరుంధతి: ముసలోడు స్పీకర్ మింగేసినట్టున్నాడు. అలా అరుస్తున్నాడేంటి?!

అని మనసులో అనుకుంటుంది.

1