పర్వీన్: వాడు నా తమ్ముడు! నా తమ్ముడిని కొడితే అది నేను మాత్రమే అయుండాలి!
ఇంకెవరైనా చెయ్యేస్తే తోలు తీస్తా!!
అని చెబుతుంది.
ఆ అబ్బాయి గింజుకోవడం ఆపేసి ఆమెను దీర్గంగా చూస్తూ ఉంటాడు.
హర్ష: ఆ..... నన్ను ఓడించిన మొదటి అమ్మాయివి నువ్వే... ఐ లవ్ యూ!
అని చెబుతాడు.
ఆమె షాక్తో పక్కకు జరిపోతుంది.
వల్లి వాళ్ళను అశ్చర్యంతో చూసి వాళ్ళిద్దరినీ అటూ ఇటుగా చూస్తుంటుంది.
రాజ కిటికీలో కూర్చొని బుక్ చదువుతూ వాళ్ళను గమనిస్తూ ఉంటాడు.
రాజి వాళ్ళిద్దరినీ సినిమా చూస్తున్నట్టుగా ఇంట్రెస్టుతో స్మైల్ చేస్తూ చూస్తూ ఉంటుంది.
పర్వీన్: హా?... నాకవన్నీ అనవసరం! నా తమ్ముడికి సోరీ చెప్పూ! లేకుంటే-
అని చెబుతూ ఉండగా సప సపా పైకి లేచి పండు దెగ్గరకు వెళ్లి వాడి చేతులు పట్టుకుంటాడు.
హర్ష: సోరీరా బామ్మర్ది! గట్టిగా కొట్టేసానా?! ఏడుపు ఆపేసావనుకో నీకు 5స్టార్ చాకలేట్ కొనిస్తా! ఓకేనా?
అని అనగానే పండు టక్కున ఏడుపు ఆపేస్తాడు.
పర్వీన్: ఓరినీ ఏసాలో!...
అని అంటూ తల గోక్కుంటుంది.
హర్ష: మరి నీ పే-
అని పర్వీన్ దెగ్గరకు వెళుతుండగా, వల్లి వాడ్ని పక్కకు నెట్టేసి ఆమె ఎదురుగా నిలబడుతుంది.
వల్లి: ఎంత కొవ్వు నీకు! నా అన్నానే కొడతావా?!నేనెవరో తెల్సా?! ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మా తాతయ్య!!
పర్వీన్: నేనెవరో తెల్సా?! సీఎం మాకు కావాల్సిన వాడు తెల్సా?!
వల్లి: హా?.
అంటూ వెనక్కి రెండు అడుగులు వేస్తుంది.
హర్ష: ఎలగెలగా?
పర్వీన్: పోయిన ఎలక్షన్లో మా పేరెంట్స్ ఆయన గుర్తుకే ఓటు వేసారులే!~
అని ఆట పట్టిస్తుంది.
వల్లి చిరాకుతో పళ్ళు కొరుకుతూ ఉంటుంది.
రాజ ఆమె జోక్ విని ఫస్ట్ టైం చెప్పట్లు కొడతాడు.
రాజీ, హర్ష ఇద్దరూ పకపకా నవ్వేస్తారు.
రాజీ: మా నలుగురికీ మార్టియల్ ఆర్ట్స్ వచ్చు తెలుసా?!
అసలు నువ్వు అలా ఎలా హర్షాని కొట్టగాలిగావు?
హర్ష: అదే కదా?! నేనేంటి? ఇలా తన్నులు తినడం ఏంటి? నాకే అర్ధం కావట్లా!
అని చెబుతూ తల గోక్కుంటాడు.
ఆమె ఆలోచనల్లో పడుతుంది.
పర్వీన్: నిజం ఏమిటంటే..