Chapter 11 - 11

టీచర్ ఆమెను ఏదొక బెంచులో కూర్చో అని అనగానే ఆమె అందరి పిల్లలను కళ్ళతో స్కాన్ చేసి పర్వీన్ ను కనిపెడుతుంది.

వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోగానే, వల్లి ఆమెను చూసి స్మైల్ చేస్తుంది.

పర్వీన్ ఏం జరుగుతుందో అర్ధం కాకపోవడంతో కన్ఫ్యూస్ అవుతుంది.

వల్లి తన బ్యాగ్ చేతిలోకి తీసుకోని నేరుగా వెళ్లి పర్వీన్ ఎదురుగా నిలబడుతుంది.

పర్వీన్ ఆమెను చూసి గుటకలు మింగుతుంది.

వల్లి ఆమె పక్కన కూర్చొని, పర్వీన్ను పక్కకు జరుపుతుంది.

ఒక బెంచుకి 5 మంది పిల్లలు కూర్చునే అంత చోటు ఉంటుంది.

ఇదివరకే 5 మంది కూర్చొని ఉండుంటారు. వల్లి ఆమె పక్కన కూర్చొని నెట్టగానే అటు వైపున కూర్చొని ఉన్న అమ్మాయి కింద పడిపోతుంది.

ఆ అమ్మాయి దిక్కులు చూసి పైకి లేచి టీచర్ ఈ అమ్మాయి నన్ను నెట్టేసింది అని గట్టిగా అరుస్తుంది.

ఆ టీచర్ చిరాకుతో చూస్తూ, ఎవరు? ఏంటి నీ గోల? అంటూ కసురుకుంటుంది.

ఆ అమ్మాయి వల్లిని చూపించి టీచర్ ఈ అమ్మాయి నన్ను కిందకు నెట్టేసింది అని చెబుతూ వేలుతో చూపిస్తుంది.

టీచర్ వల్లిని చూసి తిట్టబోతుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుటకలు మింగి, తిరిగి కింద పడిన అమ్మాయి వైపు చూస్తుంది.

ఆ అమ్మాయిని బాగా తిట్టి, వేరే బెంచ్ మీద కూర్చోమని కసురుకుంటుంది.

పర్వీన్ పైకి లేచి, తను వేరే బెంచులో కూర్చుంటాను అని చెబుతుంది.

టీచర్ వల్లి వైపు చూస్తుంది. ఆమె వద్దని తల ఊపుతుంది.

టీచర్ తడబడుతూ ఆమెను అక్కడే కూర్చోమని చెప్పి ఆ బెంచులో ఉన్న పిల్లలను వేరు వేరు బెంచుల మీద కూర్చోబెడుతుంది.

పర్వీన్ అశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది.

ఆ బెంచులో పర్వీన్, వల్లీలు మాత్రమే కూర్చొని ఉంటారు.

వల్లి ఆమె చేత్తో పర్వీన్ నోరుని ముస్తుంది.

వల్లి: నోరుమూసుకో! లేకుంటే ఈగలు దూరిపోతాయ్! ఫుఫుఫు...

అని నవ్వుతుంది.