హర్ష: ఔ.....
తల మీద బొప్పి కట్టడంతో హర్ష తన తలను రెండు చేతులతో రుద్దుకుంటూ ఉంటాడు.
పర్వీన్/ రాజ ఇద్దరూ వాళ్ళని గుడ్లప్పగించుకొని చూస్తూ ఉండిపోతారు.
పర్వీన్: నీకు అలవాటైపోయిందా?😐
అని అడగగానే, అవును అని తల ఊపుతాడు.
పర్వీన్: సరిపోయింది~😮💨
వాళ్లు గొడవ చేసుకుంటూ ఉంటారు. పర్వీన్ వాళ్ళను పట్టించుకోకుండా అన్నం తినడానికి బాక్సును ముందు ఉంచుతుంది.
ఆమె అన్నం తింటూ ఉంటే వాళ్లు సైలెంటుగా చెరో పక్క కూర్చొని లంచ్ బాక్స్లు బయటకు తీస్తారు.
పర్వీన్ పులిహోర తింటూ ఉంటుంది.
రాజ, రాజీలు చికెన్, మటన్ కూర తెచ్చుకొని ఉంటారు.
వల్లి, హర్షాలు చేపల కూర, చేపల ఫ్రై తెచ్చుకొని ఉంటారు.
ఆమె వాసన గమనించి తల ఎత్తకుండా సైలెంటుగా తల దించుకొని అన్నం నోట్లో పెట్టుకొని తింటూ ఉంటుంది.
పర్వీన్: పర్లేదు పర్వీన్.. మన దెగ్గర ఇవన్నీ కొని తినేంత డబ్బులేకున్నా అమ్మ పొద్దున్నే లేచి నాకోసం వండింది. ఉన్నదాంట్లో తృప్తిగా ఉండు.
అని కళ్ళు మూసుకొని, మనసులో తనకు తాను శ్రద్ద చెప్పుకుంటుంది.
కళ్ళు తెరవగానే ఎడమ వైపున రాజ, రాజీలు, కుడి వైపున హర్ష వల్లీలు ఆమెను కల్లార్పకుండా చూస్తూ ఉంటారు.
ఏంటని దిక్కులు చూస్తుంటే వాళ్ళ దృష్టి అంతా ఆమె లంచ్ బాక్స్ మీద ఉంటుంది.
పర్వీన్:.... పులిహోర తింటారా?
అని మొహమాటంగా అడుగుతుంది. వాళ్లు వద్దని చెప్పి అవమానిస్తారని అనుకుంటుంది. కానీ,
ఆమె ఆ మాట అనగానే నలుగురూ ఒకేసారి లంచ్ బాక్సుల మూతలు చూపిస్తూ కుంచం పెట్టమని ఆమె ముందు ఉంచుతారు.
పర్వీన్ వాటిని కల్లార్పకుండా చూస్తూ ఉంటుంది. తన అన్నం వాళ్లకు నచ్చుతుందొ లేదో అని ఆలోచిస్తూ, బాక్స్ లోనుంచి చెరో పిడికెడు అన్నం ముద్దను మూతల్లో నింపుతుంది.
ఆమె బాక్స్ దాదాపు ఖాళీ అయిపోయి ఉంటుంది.
వాళ్లు వాళ్ళ మూతలు తీసేసుకొని అన్నం తింటారు.
పర్వీన్ తల దించుకొని తన బాక్స్ లోని అన్నం తింటూ ఉంటుంది.
రాజ, రాజీలు, హర్ష, వల్లీలు ఒకేసారి ఆమెను పిలుస్తారు.
ఆమె ఉలిక్కిపడి వాళ్ళను చూస్తుంది.