Chapter 19 - 19

హర్ష: మా అత్తయ్య ఎంత మంచిదో! మన కోసం ఇన్ని మురుకులు చేసి పంపించింది.

అని గొనుక్కుంటూ తింటుంటాడు.

పర్వీన్: మా అమ్మ గుత్తోంకాయ్ కూర చేసింది. తింటారా?

అని అడుగుతుంది.

వాళ్ళందరూ మోకాలు 😮‍💨 ఇలా పెడతారు.

వల్లి: తింటారా అని అడగకూడదు! ఎంత తింటారు అని అడగాలి!

రాజి: హా!! మీ మమ్మీ ఎంత బాగా వంట చేస్తున్నారో! యమ్మీ!! నేను ఇంత రుచికరమైన ఫుడ్ ఎప్పుడూ తినలేదు తెల్సా?!

హర్ష: అదేగా?! బయట కొన్న ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ అంత రుచిగా ఉండదు కదా!?

మా మమ్మీలు మీ మమ్మీ లాగా ఉండుంటే ఎంత బాగుండు?!..

వెయిట్! అలా అనుకోడం ఎందుకు? మీ మమ్మీ మా అత్తే కదా? వైఫీ!! హిహిహిహి...

నేను చాలా లక్కీ!!

అని అంటూ సిగ్గు పడుతూ మెలికలు తిరుగుతాడు.

పర్వీన్ కుంచం దూరం జరుగుతుంది. 😧

వల్లి వాడి నెత్తి మీద గట్టిగా మొట్టిక్కాయ్ వేస్తుంది.

వల్లి: పిచ్చి పిచ్చిగా వాగావంటే పుచ్చె పగలకొడతా!

నోరుమూసుకుని అన్నం తిను!!

రాజి: వాడికి ఒకటి కాదు రెండు వేయాలి! ఓవర్గా మెలికలు తిరిగిపోతున్నాడు!

పాపం మన పర్వీన్ భయపడుతోంది వాడివల్ల!

అంటూ పర్వీన్ ను కౌగిలించుకుంటుంది.

హర్ష: ఒసే! ఒసే!!... కొట్టకే!!!.. వినే  బాబూ!! పర్వీన్ నా పెళ్ళాం అయితే వాళ్ళ అమ్మ నాకు అత్తే కదా? అప్పుడు నువ్వు నా చెల్లివి కాబట్టి నువ్వు కూడా ఆంటీ చేసిన వంటలు ఓసిలో తినొచ్చు!! ఆలోచించే!!!....

అని కంగారు పడుతూ, చేతులు అడ్డుగా పెట్టుకొని అంటాడు.

వల్లి ఆలోచిస్తుంది.

వల్లి: అదీ కరెక్టే! అప్పుడు పర్వీన్ మనతోనే కలిసి ఉంటుంది!.. హ్మ్.. ఐడియా బానే ఉంది..

అని గొనుక్కుంటూ ఉంటుంది.

రాజి: అలా అయితే పర్వీన్ నేనూ పెళ్లి చేసుకుంటాం. అప్పుడు మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండొచ్చు! అంతే కాదు! ఈ హర్ష గాడి లాంటి వాళ్ళ నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను! ఏమంటావ్ పర్రు బేబీ!

అని అంటూ తమాషాగా అంటున్నాను అని సైగ చేస్తూ కన్ను కొడుతుంది. పర్వీన్ చిన్నగా నవ్వుతూ సరే అని తల ఊపుతుంది.

రాజ రెండు చేతులతో థంబ్స్ అప్ ఇస్తాడు.

వల్లి, హర్షాలు: ఏంటి?...

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.