Chapter 23 - 23

దుమ్ము పట్టి ఉన్న రూం కనుక ఆమె అడుగుల ముద్రలు పడి ఉండటం గమనిస్తుంది.

ఆమెకు మరింత భయం ఎదురవ్వుతుంది.

అప్పుడే తను దాక్కొని ఉన్న బెంచి ఎదురుగా నిలబడుతాడు.

ఆ వ్యక్తి బెంచీని ఒకచేత్తో ఎత్తి పక్కకు పడేస్తాడు.

పర్వీన్ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.

"పర్వీన్.."

అని గొంతు వినిపించగానే ఆమె టక్కున కళ్ళు తెరుస్తుంది.

ఎదురుగా రాజ నిలబడి ఉంటాడు. అతను కంగారు పడుతూ ఉంటాడు.

ఆమె క్షణం కూడా ఆలోచించకుండా, అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తుంది.

రాజ ఆమె తలను నిమురుతూ ధైర్యం చెబుతాడు.

ఆమె డ్రెస్ చినిగి ఉండటం గమనిస్తాడు. ఒళ్ళంతా మట్టి అంటుకొని ఉంటుంది.

తను తన చొక్కా విప్పి పర్వీన్కి ఇచ్చి వెనక్కు తిరుగుతాడు.

పర్వీన్ కుంచం దూరంగా, బెంచ్ వెనుకకు వెళ్లి చొక్కాలోకి మార్చుకొని బయటకు వస్తుంది.

అప్పుడే వల్లి, హర్షా, రాజీలు కంగారుగా పరిగెట్టుకొని వచ్చి చేరుకుంటారు.

పర్వీన్ను చూడగానే ముగ్గురూ ఒకేసారిగా కౌగిలించుకుంటారు.

వాళ్లు జరిగిందంతా కళ్లారా చూసుంటారు. వాళ్ళ కళ్ళలో నిప్పులు తిరుగుతూ ఉంటాయి.

హర్షాకు కోపంతో కళ్ళు ఎర్రబడుతాయి.

వాళ్ళ వెనుక రాజా కూడా కోపం అనుచుకుంటూ సైలెంటుగా నిలబడి చూస్తూ ఉంటాడు.

@@@

రాజి: చెప్పరా! మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి పిలుద్దామా?

పర్వీన్ ఏడుస్తూ వద్దని ఆపుతుంది.

పర్వీన్: ప్లీస్ చెప్పద్దు! మా పేరెంట్స్ భయంతో నన్ను స్కూల్ మానిపించేస్తారు.

అని ఏడుస్తూ అంటుంది.

వల్లి: మరయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అలాంటోళ్ళని ఊరికే వదిలేయకూడదు!

పర్వీన్: ప్లీస్ వద్దు!.. ఈ విషయం బయటకు తెలిస్తే అందరూ నన్ను అదోలా చూస్తారు.

అని చెబుతూ ఏడుస్తుంది.

వల్లి: అంటే? వాడిని క్షేమించి వదిలేస్తావా?! హా? వాడు నిన్ను వదిలేస్తాడని అనుకుంటున్నావా?

అని కోపంతో కసురుతుంది.

పర్వీన్: వదిలేయండి. నేను వాడి జోలికి వెళ్ళను. అప్పుడు వాడు కూడా నా జోలికి రాడు.

అని ఏడుస్తూ ఉంటుంది.

****

హర్షా, రాజాలు దూరంగా నిలబడి ఉంటారు.

హర్ష: రాజా! మనం సరదా కోసం చాలా మందినే రక్తం వచ్చేలా కొట్టి ఉన్నాం కదా?! కానీ..

ఈ ఫీలింగ్ ఏంటి?...

హా?...

నాకు అర్ధం కావట్లా..

నా రక్తం ఉడికిపోతున్నట్టు అనిపిస్తోంది..

నీక్కూడా అలాగే ఉందా?..

రాజా అప్పటి వరకూ సైలెంటుగా నిలబడి ఉంటాడు.

రాజ: అవును..

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.