Chapter 28 - 28

వల్లి/ రాజి: మాక్కూడా భయం వేస్తోంది.. మమ్మల్ని కూడా కాపాడు పర్వీన్..

అంటూ ఆమెను తలో వైపులా కౌగిలించుకుంటారు.

పర్వీన్: ఏం పర్లేదు!! నేనున్నానుగా?! భయపడకండి!!

అంటూ వాళ్లకు ధైర్యం చెబుతుంది.

ఆమెకు కనిపించకుండా వాళ్లు నలుగురూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని ఈవిల్ స్మైల్ ఇస్తారు.

@@@

హర్ష: నేను పర్వీన్ పక్కనే తోడుగా ఉంటాను. రాజా నువ్వు వెళ్లి మన బాగులు తీస్కునిరా!.

వల్లి: రాజా నేను కూడా నీతో వస్తా పదా!

రాజి: నేనెళ్ళి తినడానికి స్నాక్స్ కొని తెస్తా!

రాజ:...

@@@@

ముగ్గురూ వెళ్ళిపోతారు.

క్లాసుల్లో టీచర్లు ఎవరూ ఉండరు. స్టూడెంట్స్ అందరూ ప్లే గ్రౌండులో ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు.

పర్వీన్ ఒక మిట్ట మీద కూర్చొని, అమ్మాయిలను చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.

పర్వీన్: నేను కూడా వాళ్ళలా అందంగా ఉండుంటే బాగుండు..

అని మనసులో ఆలోచిస్తూ, తన జడని తాకుతూ ఉంటుంది.

హర్ష ఆమె పక్కన 5 అడుగుల దూరంలో కూర్చొని, ఆమెనే చూస్తూ ఉంటాడు.

హర్ష: చూపులతో నా ఊపిరిని పిండేస్తున్నావ్. నా కళ్ళకు నీ అందం ఊపిరి పోస్తోంది. నాకోసం దేవుడికి చెప్పి పుట్టావా?

అని మనసులో అనుకుంటూ చిరునవ్వు నవ్వుతాడు.

పర్వీన్ పక్కకు తిరిగి చూస్తుంది. హర్ష ఆమెను కల్లార్పకుండా చూడటం గమనిస్తుంది.

పర్వీన్: ఇప్పుడు పిలిచావా నన్ను?

హర్ష: లేదే? నీకలా అనిపించిందా?

పర్వీన్: ఏమో? పిలిచినట్టుగా అనిపించింది నాకు..

అని అంటూ తల గోక్కుంటుంది.

హర్ష చిన్నగా నవ్వుతాడు.

హర్ష: నువ్వలా దిక్కులు చూస్తూ ఉండిపోయావనుకో, ఎవరీ పిల్లాడు క్యూట్టుగా, హన్సమ్గా ఉన్నాడు అని అనుకుని నన్ను ఎవరోకరు కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతారో ఏమో?

నాకు చాలా భయం వేస్తోంది వైఫీ!..

పర్వీన్: నువ్వేం భయపడకు! నేనున్నా కదా?!

అని చెబుతూ, హర్ష చెయ్యి పట్టుకొని చుట్టూ చూస్తూ కాపలా కాస్తుంది.

హర్ష ఆమె చేతిలో చెయ్యేసి లోలోపల మురిసిపోతూ సైలెంటుగా కూర్చొని ఉంటాడు.

వల్లి, రాజి, రాజ ముగ్గురూ తలో దిక్కున వస్తూ ఆ దృశ్యాన్ని చూస్తారు.

అందరి మోకాళ్ళో సైలెన్స్ ఉంటుంది.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి..