Chapter 29 - 29

పర్వీన్: నువ్వేం భయపడకు! నేనున్నా కదా?!

అని చెబుతూ, హర్ష చెయ్యి పట్టుకొని చుట్టూ చూస్తూ కాపలా కాస్తుంది.

హర్ష ఆమె చేతిలో చెయ్యేసి లోలోపల మురిసిపోతూ సైలెంటుగా కూర్చొని ఉంటాడు.

వల్లి, రాజి, రాజ ముగ్గురూ తలో దిక్కున వస్తూ ఆ దృశ్యాన్ని చూస్తారు.

అందరి మోఖాళ్ళో సైలెన్స్ ఉంటుంది.

నార్మల్గా నడుచుకుంటూ వెళ్లి ఆమె పక్కన కూర్చుంటారు.

పర్వీన్ వాళ్ళను పలకరిస్తూ ఉంటుంది.

మాటల్లో కూడా వాడి చెయ్యి వదలకుండా ఉండటాన్ని ముగ్గురూ గమనిస్తారు.

వాళ్ళ ముగ్గురూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని ఓకే గోల్ మీద నిర్ణయం తీసుకుంటారు.

ముగ్గురూ ఒకేసారిగా తల ఊపుతారు.

వల్లి: హా..... పర్వీన్.... నాకు చాలా అలసటగా ఉంది... హా....

అని ఆస్కార్ లెవెల్లో నటిస్తూ పర్వీన్ ముందుకి ఆనుకుంటుంది.

పర్వీన్: ఏమైన్ది నీకు? ఎందుకు అలసటగా ఉంది?..

అని దిగులు పడుతూ అడుగుతుంది.

వల్లి: రాత్రంతా నిద్ర లేదు నాకు.. హా...

అని అంటూ బాగా ఆవులుస్తుంది.

రాజి: నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయ్ పర్రు బేబీ.. *ఇస్* *ఔ* అమ్మ... అబ్బా.... అయ్యా...

అని ఆస్కార్ వాళ్ళ నాన్నలా యాక్టింగ్ చేస్తుంది.

పర్వీన్ వాళ్ళిద్దరినీ చూసి చాలా కంగారు పడుతుంది.

పర్వీన్: ఏమైంది? నీకు ఒళ్ళు నొప్పులు ఎందుకున్నాయ్? దారిలో కింద పడ్డావా ఏంటి? హా?

...

అని కంగారుగా అడుగుతున్నప్పుడు, అప్పుడే రాజ కళ్ళు తిరిగి గోడమీద నుంచి పడే బల్లిలా హర్ష మీద కూలిపోతాడు.

హర్ష: చచ్చాన్ రోయ్!!.... రే ఎలుకుబంటి లేరా!!! ఆ...

అని అంటూ నేల మీద దేకుతూ, రాజాను పక్కకు తొయ్యబోతాడు.

రాజా మాత్రం ఇంచు కూడా కదలకుండా వాడి మీద పడుకొని ఉంటాడు.

హర్ష అలసిపోయి అక్కడే నోక్ ఔట్ అయిపోతాడు. 😵

పర్వీన్ హడావిడిగా లేచి, వాళ్ళను ఒకరి తరువాత ఒకరిని పరిశీలిస్తుంది.

ఏం చెయ్యాలో అర్ధం కాకపోవడంతో ఆలోచిస్తూ ఉంటుంది.

వల్లి: నన్ను నీ ఒడిలో పనుకోబెట్టుకో.. లేకుంటే ఆ

....

అని అంటూ కళ్ళు తిరుగుతున్నట్టు నటిస్తుంది.

రాజి: నన్ను కూడా... నేను కూడా పోయేలా ఉన్నా..  ఆ....

అంటూ ఎడమ వైపు జరుగుతూ పర్వీన్ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది.

వల్లి కుడి వైపు జరిగి పర్వీన్ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది.

పర్వీన్ వెనక్కు పడిపోబోతుంది.

రాజా ఆమె పడిపోకుండా ఆమెకు బ్యాలెన్స్ ఇవ్వడం కోసం, వీపు వెనుక అనుకోని వెనక్కి తిరిగి కూర్చొని కళ్ళు మూసుకుంటాడు.

హర్ష: నన్ను వదిలేయకండ్రా....

అని పాకుతూ వచ్చి పర్వీన్ ఎడమ చెయ్యి పట్టుకొని, భుజం మీద తల పెట్టుకొని నిద్రపోతాడు.

పర్వీన్:.....

కాసేపు సీరియస్గా ఆలోచిస్తూ, స్మైల్ చేస్తూ ముగ్గరి తల నిమిరి రాజాకు అనుకోని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది.

పర్వీన్: 😴.....

వాళ్లు నలుగురూ ఒకేసారి కళ్ళు తెరుస్తారు.

*BLUSHING*

అందరూ పెద్దగా స్మైల్ చేస్తూ ఉంటారు.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి..