రాజి: అలా అయితే పర్వీన్ నేనూ పెళ్లి చేసుకుంటాం. అప్పుడు మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండొచ్చు! అంతే కాదు! ఈ హర్ష గాడి లాంటి వాళ్ళ నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను! ఏమంటావ్ పర్రు బేబీ!
అని అంటూ తమాషాగా అంటున్నాను అని సైగ చేస్తూ కన్ను కొడుతుంది. పర్వీన్ చిన్నగా నవ్వుతూ సరే అని తల ఊపుతుంది.
రాజ రెండు చేతులతో థంబ్స్ అప్ ఇస్తాడు.
వల్లి, హర్షాలు: ఏంటి?...
అదేం కుదరదు!!
అంటూ కాసేపు గొడవ పడుతూ ఉన్న తర్వాత, వాళ్లు చేసిన అల్లరిని గుర్తుకు తెచ్చుకొని పక పకా నవ్వుకుంటారు.
@@@@
సాయంత్రం అవుతుంది.
పర్వీన్ స్కాల్లో జరిగిన విషయాలు వాళ్ళ అమ్మ, నాన్నలతో షేర్ చేసుకుంటుంది.
వాళ్లు బాగా నవ్వుకుంటారు.
అలా రోజూ ఇంట్లో దొరికే వస్తువులతో ఏదొక స్నాక్స్ చేసి ఇచ్చి పంపుతుంది.
వాళ్లు ఐదుగురు తెచ్చే స్నాక్స్ అన్నీ ఒకరితో ఒకరు షేర్ చేసుకోని తింటూ ఉంటారు.
అలా ఫ్రెండ్స్గా మారిన వాళ్ళ స్నేహం పైన కొన్ని దిష్టి కళ్ళు పడుతాయి.
@@@
ఒకరోజు పొద్దున్న పర్వీన్ స్కూల్కి వచ్చి, తమ్ముడిని క్లాస్లో దింపి తన క్లాసుకి వెళుతూ ఉంటుంది.
ఒక 8త్ క్లాస్ అబ్బాయి తనకు అడ్డుగా నిలబడుతాడు.
ఆమె పక్కనుంచి వెళ్ళబోతే, ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతాడు.
పర్వీన్ చెయ్యి విదిలించుకుని దూరంగా జరుగుతుంది.
"ఓయ్! ఐ లవ్ యూ!!"
అని అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఒక చేతిలో రోజా పువ్వు, పెద్ద డైరీ మిల్క్ చాకలేట్ను తీసుకోమని ముందుకు చూపిస్తూ ఉంటాడు.
ఆమె వద్దని తల అడ్డంగా ఊపి వెళ్ళిపో బోతుంది.
"ఓయ్! వెళ్ళిపోకు! ఆగు!..."
వాడు కంగారులో ఆమెను ఆపబోతూ ఆమె చెయ్యి పట్టుకోబోయి డ్రెస్ పట్టుకొని లాగుతాడు.
హడావిడిలో డ్రెస్ కుంచం చినుగుతుంది. పర్వీన్ వాడిని పక్కకు నెడుతుంది.
ఆమె షోల్డర్ దెగ్గర చినగడంతో చెయ్యి అడ్డుగా పెట్టుకుంటుంది.
వాళ్ళని దూరంలో ఎవరో ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటారు.
ఆ వ్యక్తి కోపంలో పిడికిలిని బిగిస్తుంటే చేతికున్న నరాలు బయటకు కనిపిస్తుంటాయి.
.....
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.