హడావిడిలో డ్రెస్ కుంచం చినుగుతుంది. పర్వీన్ వాడిని పక్కకు నెడుతుంది.
ఆమె షోల్డర్ దెగ్గర చినగడంతో చెయ్యి అడ్డుగా పెట్టుకుంటుంది.
వాళ్ళని దూరంలో ఎవరో ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటారు.
ఆ వ్యక్తి కోపంలో పిడికిలిని బిగిస్తుంటే చేతికున్న నరాలు బయటకు కనిపిస్తుంటాయి.
పర్వీన్ వెనక్కు జరిగి నిలబడుతుంది. గోడ అడ్డుగా ఉండటం వల్ల ఆగిపోతుంది.
ఆ అబ్బాయి ఆమెను అటూ ఇటూ గోడ మీద చేతులు ఉంచి ఎటూ వెళ్లకుండా అడ్డుగా నిలబడుతాడు.
పర్వీన్: అడ్డులే.... నేను వెళ్ళాలి...
అని భయంతో తడబడుతూ ఉంటుంది.
"ఐ లవ్ యూ టూ అని చెప్పు. వెళ్ళిపోతాను."
అని చెబుతూ స్మైల్ చేస్తాడు.
వాళ్ళను దూరం నుంచి చూస్తున్న వ్యక్తికి కోపం ఎక్కువ అవుతుంది.
పర్వీన్: నాకు ఇష్టం లేదు.. పో!..
అని అంటూ అతన్ని దూరంగా తోయబోతుంది.
ఇద్దరికీ సైజ్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఆ అబ్బాయిని కుంచం కూడా జరుపలేక పోతుంది.
"ఏం? ఎందుకు ఇష్టం లేను నేను? హా? నేను ఎన్ని నెలల నుంచి నిన్ను ఇష్టపడుతున్నానో తెలుసా?!
అప్పుడప్పుడు అయినా నాకు కనిపిస్తూ వెళుతూ ఉండేదానివి! ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు నువ్వు!
వాళ్లు నలుగురు ఉన్నారనా నీ ధైర్యం? వాళ్లు మంచోళ్ళు అనుకుంటున్నావా?
ఆ హర్ష గాడి కోసమా? హా?
వాళ్లు నలిగురూ ఇలాంటోళ్ళో తెలుసా?..
వాళ్లు ఒక-"
అని తిట్టబోతుండగా, పర్వీన్ వాడి చెంప మీద లాగి పెట్టి కొడుతుంది.
పర్వీన్: నన్ను తిట్టినా, కొట్టినా, విసిగించినా భరిస్తాను! కానీ.. నా స్నేహితులని నా ముందు చెడుగా ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు!!
అని చెప్పి, వాడ్ని పక్కకు తోసి క్లాసుకి వెళ్ళిపోబోతుంది.
వాడు కోపంతో పర్వీన్ జడ పట్టుకొని లాగుతాడు.
పర్వీన్: ఆ.... వదలరా!... ఆ....
"పాపంలే అని ఉరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావా? హా?..
అని తిడుతూ, జుట్టు పట్టుకొని లాగుతాడు.
ఆమె గింజుకుంటూ ఉందని, చేత్తో నోరు మూసేసి దాక్కుంటాడు.
అప్పుడే ఎవరో అటుగా వెళుతూ ఉన్నట్టుగా నీడ కనిపిస్తుంది.
పర్వీన్: ఉమ్మ్.... ఉమ్మ్.... ఉమ్మ్...
అని గింజుకుంటూ పర్వీన్ అరవడానికి ప్రయత్నం చేస్తుంది.
కానీ ఆ నీడ దూరంగా వెళ్ళిపోతుంది.
పర్వీన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.
.....
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.